కమల్ పరువుతీసేసిన చిన్నకూతురు ఏం చేసిందో తెలిస్తే షాక్

444

నటుడు, రాజకీయ నాయకుడు కమలహాసన్ రెండో కుమార్తె అక్షర హాసన్ ‘లో’ దుస్తులతో ఉన్న ఫొటోలు కొన్ని రోజుల కిందట ఇంటర్నెట్‌లో లీకయ్యాయి. దీనిపై అక్షర ముంబై పోలీసులను ఆశ్రయించింది. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది. తన వ్యక్తిగత ఫొటోలను లీక్ చేయడం దురదృష్టకరమని, ఇది తనను ఎంతో బాధించిందని అక్షర పేర్కొంది.

కమల్‌ హాసన్‌ రెండో కుమార్తె అక్షర హాసన్‌ ప్రైవేట్ ఫొటోలు ఇటీవల ఆన్‌లైన్‌లో లీకైన అంశం సంచలనంగా మారింది. దీని వెనుక ఎవరున్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి అక్షర మాజీ ప్రియుడు, అలనాటి నటి రతి అగ్నిహోత్రి కుమారుడు, నటుడు తనుజ్‌ వీర్వానీ ప్రమేయం ఉందని అనుమానిస్తున్నట్లు తెలిపారు. అతణ్ని విచారించనున్నట్లు చెప్పారు. విచారణకు హాజరు కావాల్సిందిగా తనుజ్‌కు ఇప్పటికే సమన్లు జారీ చేసినట్లు వెల్లడించారు.

ఆ ఫొటోలు తనుజ్ ఒక్కడి వద్దే ఉన్నట్లు అక్షర చెప్పిందని పోలీసులు తెలిపారు. 2013లో అక్షర తన వ్యక్తిగత ఫొటోలను తనుజ్‌కు షేర్‌ చేసిందని, 2016లో వారిద్దరూ విడిపోయారని పోలీసులు చెప్పారు. ‘2013 వరకు అక్షర ఐఫోన్‌-6 ఉపయోగించారు. 2013లో ఆమె తన వ్యక్తిగత ఫొటోలను తనుజ్‌కు షేర్‌ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది’ అని వర్సోవా పోలీసు స్టేషన్‌ సీనియర్‌ అధికారి మీడియాతో అన్నారు.కాగా.. తనపై వస్తున్న ఆరోపణలను తనుజ్ ఖండించాడు. ముంబై పోలీసులు ఇంతవరకు తనను కలవలేదని తెలిపాడు. ఇలాంటి సంఘటన జరగడం నిజంగా బాధాకరమని, తన దగ్గర అలాంటి ఫొటోలు లేవని చెప్పాడు. అక్షర తనకు కేవలం మంచి స్నేహితురాలు మాత్రమేనని వెల్లడించాడు.