జబర్దస్త్ శాంతి స్వరూప్ కష్టాలు వింటే ఎవ్వరైనా ఏడ్చేస్తారు

1367

జబర్దస్త్ స్టేజ్ పై లేడీ గెటప్స్ తో అలరించే నటుల్లో శాంతిస్వరూప్ ఒకరు. సన్నగా కనిపిస్తూ స్టేజ్ పై నవ్వుల సందడి చేసే శాంతిస్వరూప్, తాజాగా ఓ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చాడు.జబర్దస్త్షోతో పాప్యులర్ కావడానికి ముందు తనకి ఎదురైన పరిస్థితులను గురించి శాంతిస్వరూప్ చెప్పాడు.రూమ్ రెంట్ కట్టుకోలేని నేను వేరేవాళ్లని బతిమాలుకొని వాళ్ల రూమ్ లో ఉండేవాడిని.

ఈ క్రింది వీడియో చూడండి.

అక్కడ ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ నాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. రూమ్ లోనుంచి వెళ్లిపొమ్మని అన్నారు .. నా బ్యాగ్ తీసి బైట పెట్టేసిన సందర్భాలు వున్నాయి అని త‌న ప‌డ్డ క‌ష్టాల గురించి వివ‌రించాడు. ఒకసారి అలాగే బ్యాగ్ బయట వేశారు .. ఎక్కడికి వెళ్లాలో తెలియక అరుగుమీద ఏడుస్తూ కూర్చున్నాను. అప్పుడు నాకు కాస్త పరిచయమున్న దర్శకుడు చౌదరిగారికి ఫోన్ చేశాను .. నడి రోడ్డు మీద వున్నట్టుగా చెప్పానన్నాడు.

Image result for jabardasth shanthi swaroop

వెంటనే ఆయన వచ్చి నన్ను తన స్నేహితుడి రూమ్ కి తీసుకెళ్లాడు. ఆయన స్నేహితుడు ఊళ్లో లేకపోవడం వలన, ఆయనకి ఫోన్ చేసి అనుమతి తీసుకుని అక్కడ నాకు ఆశ్రయం ఇచ్చాడు. 9 నెలల పాటు అక్కడే ఉండగా .. ఆయనే రెంట్ కట్టారు .. ఆయనకి నేను రుణపడివున్నానుఅని అన్నారు. 2001 లో నేను హైదరాబాద్ వచ్చాను. నా క్షేమ సమాచారాన్ని ఇంటికి ఉత్తరాల ద్వారా తెలియపరిచేవాడిని. ఇక్కడ నేను ఎంతగా కష్టాలు పడుతున్నా .. ఆ విషయాలను ఎవరితోను చెప్పుకునేవాడిని కాను. వాళ్ల ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోయినా, నా నుంచి ఏమీ ఆశించేవాళ్లు కాదు. మా నాన్నకి అనారోగ్యం .. మంచి మందులు వాడే పరిస్థితి లేదు. అన్నయ్యలు ఉన్నప్పటికీ వాళ్ల ఆర్ధిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే అని త‌న ప‌డ్డ క‌ష్టాల గురించి వివ‌రించాడు.

Image result for jabardasth shanthi swaroop

ఇక అనేక విష‌యాల గురించి ఈ ఇంట‌ర్వ్యూలో స్వాతి స్వ‌రూప్ చెప్పాడు. మా నాన్న చనిపోయిన తరువాత నేను ఇంటికి వెళ్లాను. నేను బాగా సంపాదించేశానని ఊళ్లో వాళ్లంతా అనుకున్నారు. అన్నదమ్ములంతా కలిసి తలా రెండు వేలు వేసుకుని కార్యక్రమాన్ని జరిపించాలన్నారు. అప్పుడు నా దగ్గర 500 కూడా లేవు .. నాన్నను బతికించుకోలేకపోయానని ఉద్వేగంతో చెప్పాడు.. చనిపోయిన తరువాత కూడా ఏమీ చేయలేకపోతున్నానే అనిపించింది. హైదరాబాద్ లో తెలిసినతనికి ఫోన్ చేసి .. మా ఊళ్లో తెలిసిన వారి ఎకౌంట్ నెంబర్ చెప్పి, 2000 వేయమని కోరాను. ఆయన చేసిన సాయంతో మాట దక్కింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు . ఇక ఈవెంట్స్ కి వెళ్లినప్పుడు నేను స్టేజ్ పై కనిపించగానే జనం గోల చేస్తూనే వుంటార‌ని చెప్పాడు.

Image result for jabardasth shanthi swaroop

ఏయ్ రైలు కింద రూపాయి బిళ్లా .. పిండేసిన టూత్ పేస్ట్ .. టేకుచెక్క .. అంటూ అరుస్తూనే వుంటారు. అప్పుడు నేను పెద్దగా ఫీలవ్వను .. వాళ్లు అంతగా ‘జబర్దస్త్’కి కనెక్ట్ అయ్యారనుకుంటాన‌ని చెప్పాడు స్వ‌రూప్ .ఐ లవ్ యూ రా డాళింగ్ అంటూ నవ్వుతూ పలకరిస్తాను. ఎప్పుడైనా ఎవరైనా మరీ హద్దు దాటిపోతే కోపం వస్తూ ఉంటుందిఅంటూ చెప్పుకొచ్చాడు. కృష్ణా నగర్లో రూమ్ రెంట్ కట్టుకోలేని పరిస్థితుల్లో .. స్నేహితులను రిక్వెస్ట్ చేసుకుని వాళ్ల రూములో ఉండేవాడిని. రెంట్ కట్టేవాడిని కాదు గనుక, అందులో వుండేవాళ్లకి వంటచేసి పెట్టడం .. బట్టలుతకడం .. రూమ్ శుభ్రంగా ఉంచడం చేసేవాడినని చెప్పాడు.

Image result for jabardasth shanthi swaroop

ఒక రోజు తింటే ఒక రోజు తినని సందర్భాలు వున్నాయి. అలాంటి పరిస్థితుల్లో .. జబర్దస్త్’లో లేడీ గెటప్ వేసే ఆర్టిస్ట్ కావాలని రచ్చరవితో చమ్మక్ చంద్ర చెప్పాడట. అప్పటికే నాతో వున్న పరిచయం కారణంగా, రచ్చరవి నన్ను తీసుకెళ్లి చమ్మక్ చంద్రకి పరిచయం చేశాడు. ఆయన నాకు అవకాశం ఇచ్చాడు ..జబర్దస్త’తో నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు రూమ్ రెంట్ కి తీసుకుని ఉండగలుగుతున్నానుఅని చెప్పుకొచ్చాడు.