ఆ ఊరిలో వింత ఆచారం.. పడకగదిలో ఒక భర్త నలుగురు భార్యలు

199

మన దేశంలో చట్టాల ప్రకారం బహుభార్యత్వం నేరం. రూల్స్ ప్రకారం విడాకులు తీసుకున్నాకే రెండో పెళ్లి చేసుకోవాలి. ఒక వేళ భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకున్నా దాన్ని సీక్రెట్ గా ఉంచుతారు. మొదటి భార్యకు విషయం తెలియనివ్వరు. తెలిస్తే బంధువులు, స్నేహితులు, సమాజంలో పరువు పోతుందని, ప్రతిష్ట మట్టిలో కలిసిపోతుందని భయపడతారు. కానీ ఆ ఊరిలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. అక్కడ ఎంతమంది భార్యలు ఉంటే మగాడికి అంత గౌరవం, మర్యాద ఇస్తారు. అక్కడ బహుభార్యత్వం ఓ ఆచారం, సంప్రదాయం. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. మరి ఆ ఊరు విశేషాల గురించి తెలుసుకుందామా.

Image result for villages girls

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్ గ్రామం లక్మీపూర్ కేరీ గ్రామంలో ఈ వింత ఆచారం ఫాలో అవుతున్నారు. ఆ గ్రామంలో 100 ఇళ్లు ఉంటాయి. 3వేల మంది జనాభా. ఆ ఊరికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి గవర్నమెంట్ ఉద్యోగి. ఆ ఊరిలో చాలామంది పురుషులు, మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు. కొందరు ముగ్గురు, నలుగురు భార్యలతో ఒకే ఇంట్లో సంసారం చేస్తున్నారు. కొందరు పని చేసే చోట రెండో సంసారం పెట్టారు. కొందరు ఊరిలోనే వేర్వేరు చోట్ల సంసారాలు పెట్టారు. మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారనే విషయం తెలిసినా భార్యలు ఏమీ అనరు. వారి సంసారాల్లో ఎలాంటి ఇబ్బంది లేదు. అంతా హ్యాపీగా భార్యలు, పిల్లలతో బతికేస్తున్నారు. మరో విశేషం ఏంటంటే…. ఆ ఊరిలో ఉండేవారిలో ఎక్కువమంది బ్రాహ్మణ, ఠాకూర్ సామాజికవర్గాలకు చెందిన వారే. ఇలా పెళ్లిళ్లు చేసుకున్న పురుషుల్లో చాలామంది గవర్నమెంట్ ఉద్యోగులే. దీంతో రెండు మూడు పెళ్లిళ్ల గురించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాళ్ల ఉద్యోగాలు ఊడిపోవడం ఖాయం. ఈ కారణంగా కొంతమంది మగాళ్లకు భయం పట్టుకుంది. బహుభార్యత్వం నేరం అనే విషయం తెలిసినా తమ గ్రామంలో ఇదొక ఆచారం, తరాలుగా పాటిస్తున్న సంప్రదాయం అంటున్నారు.

ఈ క్రింద వీడియోని చూడండి

కట్టుబాట్లను కాదనలేము కదా అని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఆ ఊరిలో ఉండే స్కూల్ టీచర్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. కాగా, ఈ జనరేషన్ కి చెందిన మగాళ్లకి మాత్రం రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ప్రభుత్వ ఉద్యోగం ఊడుతుందని భయపడుతున్నారు. కానీ ఆచారం, సంప్రదాయం కారణంగా పెళ్లిళ్లు చేసుకోవడం తప్పడం లేదంటున్నారు. ఎంతమంది పెళ్లాలు ఉంటే అంత గౌరవం, మర్యాద ఇస్తారని చెబుతున్నారు. ఒక పెళ్లామే ఉంటే కనీసం మనిషిలా కూడా చూడటం లేదని వాపోతున్నారు. దీనిపై ఊరిపెద్ద స్పందించారు. ఇప్పుడిప్పుడే ఊరిలో పరిస్థితులు మారుతున్నాయని, నేటి తరం యువకులు బహుభార్యత్వం విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని, రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి ఇష్టపడటం లేదని ఊరి పెద్ద చెప్పారు. రెండు పెళ్లిళ్లు చేసుకోవడానికి ఆచారమే కాదు.. మరో కారణం కూడా ఉందంటున్నారు. మొదటి భార్య చనిపోయినా, ఏదైనా కారణంతో వదిలి వెళ్లిపోయినా రెండో పెళ్లి చేసుకుంటే ఇంటి పనులు చూడటానికి, పిల్లలను చూసుకోవడానికి సాయంగా ఉంటుందని చెబుతున్నారు. ఇకపోతే ఎంతమంది భార్యలు ఉంటే వారందరికి సమానంగా భర్త తన ఆస్తిపాస్తులను పంచాల్సిందేనని గ్రామ పెద్దలు తేల్చి చెప్పారు. ఇదేనండి ఆ ఊరిలో ఉన్న వింత ఆచారం. వినడానికే విడ్డురంగా ఉంది కదా. మరి మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చెయ్యండి. అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానెల్ ను సబ్ స్కైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చెయ్యండి.