దేవుడి భార్యలు దెయ్యాలతో సంసారం చేస్తున్నారు ఎందుకో తెలిస్తే ఆశ్చ‌ర్చ‌పోతారు

744

స‌మాజంలో ఇలాంటి మూడ న‌మ్మ‌కాలు ఆచారాలు ఇంకా చాలా ప్రాంతాల్లో జ‌రుగుతున్నాయి అన‌డానికి, ప్ర‌త్య‌క్షంగా ఉదాహ‌ర‌ణ‌గా వీటిని చెప్ప‌వ‌చ్చు.. ఇప్పుడు తెలుసుకునే విష‌యం ఇదే..విన‌డానికి ఆశ్చ‌ర్యం క‌లిగినా ఇది వాస్త‌వం.. న‌మ్మ‌ద‌గిన విష‌యం… ఈ విష‌యం పూర్తిగా తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చ‌ర్య‌పోతారు…దేవదాసి, బసివిని, మాతంగి… పేరేదైనా.. వారి బతుకులు మాత్రం దుర్భరం..ఎప్పుడో…ఎవరో సృష్టించిన అనాగరిక ఆచారానికి బలైపోయిన మహిళలు వారు. అక్షర జ్ఞానం లేని తల్లిదండ్రులు చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న దేవదాసీలు వారు.. పేరుమారి…సమాజం తీరు మారి..తమ బతుకులే మారిపోయాక…తమను మనుషులుగా గుర్తించాలని కోరుతున్న అభాగ్యులు వారు…ఊపిరున్నంత వరకూ ఊరందరికీ అంగడిబొమ్మలు వాళ్లు. ఊరంతా కలిసి చేసిన అన్యాయానికి…నిత్యం నరకం అనుభవిస్తున్న అబలలు.

Image result for devadasi picture

ఒక్కడు మూడుముళ్లేశాడు… ఊరంతా అనుభవిస్తున్నారు దేవుడి సతినంటారు.. దెయ్యాల్లా వెంటబడతారు పగలంతా వెట్టి కష్టం చేసి .రాత్రయితే నరకం చూపిస్తారు ఎవ‌రు పిలిచినా వెళ్లాలంటారు.. కడుపొస్తే కనాలంటారు..బిడ్డలకు తండ్రిగా ఏ ఒక్కడూ ముందుకురాడు..అడుక్కోవడం..అవమాన పడడం..అత్యాచారాలకు బలైపోవడం..కాదు..బానిసలవడం జ‌రుగుతోంది అని వీరు క‌న్నీరు పెట్టుకుంటున్నారు.. అందరిలా మేమూ ఆడవాళ్లం కాదా…మాకూ మనసు లేదా…మాకు హక్కులు వర్తించవా..మానెత్తినెక్కిన ఆ భగ‌వంతునికీ దయరాదా..గొంతెత్తి ఘోషిస్తున్నా ఈ పాలకులకు వినపడదా..మేమింతేనా…మాబతుకింతేనా..దేవదాసి…బసివిని…మాతంగి..పేరేదైనా..అనాగరిక సమాజంలో బలైపోయిన అబలల ఆక్రందన ఇదీ..చ‌దువులేక ఎంద‌రో ఈ బాధ అనుభ‌విస్తున్నారు.

Related image

మ‌న రాష్ట్రంలో అత్య‌ధికంగా రాయ‌ల‌సీమలో ఎక్కువ‌గా దేవ‌దాసీలు ఉన్న‌ట్లు చెబుతున్నారు….ఎంతమంది దేవదాసీలుంటే ఆ దేవాలయానికి అంత ప్రతిష్ట అనే భావనతో పూజారి, పురోహితులు దేవదాసీల వ్యవస్థకు బీజం వేశారు… చివ‌ర‌కు వారు అలా మ‌గ్గిపోతున్నారు..దేవదాసీలు తొలుత ఆలయాల్లో నాట్యకత్తెలుగా ఉండేవారు. అలాగే లలిత కళలు నేర్చుకున్న కొందరు మహిళలు దేవాలయాలు, రాజుల కొలువుల్లో నాట్యమాడేవారు. వారిపై కన్నేసిన కొందరు పెద్దలు వారి కామవాంఛలు తీర్చే వస్తువుగా, ఉంపుడుగత్తెలుగా మార్చుకున్నారు. ఆ తర్వాత వీరికి దేవదాసీ..జోగినీ..మాతంగి పేరు తగిలించి ఊరందరికీ అప్పగించారు. వంశపార్యపరంగా కొంతమంది, మరోమార్గం లేక పొట్టకూటి కోసం మరి కొంతమంది ఈ రొంపిలోకి నెట్టబడ్డారు. ముక్కుపచ్చలారని చిన్నారులను సైతం దేవుడి భార్యగా మార్చి ఊరంతా వంతులు వేసుకుని అనుభవించారు. ఈవిధానం త‌ల్లిదండ్రుల చేసిన‌ప‌ని వ‌ల్లే అని వారు బాధ‌ప‌డుతున్నారు..

అభం శుభం తెలియని పదేళ్ల లోపు బాలికలను ఉలిగమ్మ, యల్లమ్మ, పెన్నోబిలేసు, హనుమంతరాయుడు తదితర దేవాలయాల పేరుతో దేవదాసీలుగా మారుస్తున్నారు. బాలికను పెళ్లికూతురుగా అలంకరించి దేవాలయానికి తీసుకెళతారు. సంప్రదాయం పేరుతో వరుసకు మామ అయ్యే వ్యక్తితో గానీ, లేక ఊరి పెద్దతో గానీ తాళి కట్టించి దేవుడికి వదిలేస్తారు.త‌ర్వాత పుష్పవతి అయ్యేంత వరకు ఆ అమ్మాయి తల్లిదండ్రుల సంరక్షణలోనే పెరుగుతుంది. పుష్పవతి కాగానే మొద‌ట‌ ఆ ఊరి పెద్దమనిషి కామవాంఛ తీర్చాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఊర్లో ఎవరు పిలిచినా వెళ్లాల్సి ఉంటుందని ఈ అనాగరిక ఆచారానికి బలైన వారు చెబుతున్నారు. చూశారుగా ఇలా కామవాంచ తీర్చుకోవ‌డానికి నాటి నుంచి పెట్టిన మూడు న‌మ్మక ఆచారాలు నేటికి జ‌రుగుతున్నాయి.. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.

ఎంపీ విజ‌యసాయిరెడ్డి మ‌రో ప్ర‌య‌త్నం