బ్యాంకాక్ గురించి ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు

441

ఈ ప్ర‌పంచంలో సుంద‌ర ర‌మ‌ణీయ ప్ర‌దేశాలు ఎన్నో ఉంటాయి ఏఏ దేశానికి వారి హ‌ద్దులు ప్ర‌కారం అద్బుత‌మైన ఐలాండ్స్ కూడా అనేక దేశాలుక‌లిగి ఉన్నాయి ఇక ఆక‌ర్ష‌నీయ ప‌ట్ట‌ణాలు ఉన్న దేశాలు అయితే టూరిస్టుల‌ను ఎక్కువ‌గా ఆక‌ర్షిస్తూ ఉంటాయి.. అలాంటి ఓ న‌గ‌రం గురించి ఇప్పుడు మ‌నం చెప్పుకోబోతున్నాం….థాయిలాండ్ ప్ర‌కృతి అందాలు సుంద‌ర ప్రాంతాలు క‌లిగిన దేశం ప్ర‌పంచంలో 12 శాతం టూరిస్టుల‌ను రాబ‌ట్టుకుంటున్న దేశం కూడా థాయ్ లాండ్ మ‌సాజ్ హాబ్ గా పిల‌చే ఈ థాయ్ లాండ్ కుఎన్నో ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. ఓసారి అవేంటో తెలుసుకుందాం.

థాయిలాండ్ లో అతి పెద్ద సిటి బ్యాంకాక్ దీని విస్తీర్ణం: 15,68.737 చదరపు కిలోమీటర్లు…జనాభా 82 లక్షలకు పైగానే ఉంటారు… బ్యాంకాక్‌ థాయిలాండ్‌ దేశ రాజధాని…. స్థానికంగా దీనిని క్రాంగ్‌తేప్‌ అని పిలుస్తుంటారు. కానీ దీని పూర్తి పేరు చాలా పొడుగ్గా ఉంటుంది. 169 అక్షరాలతో టంగ్‌ట్విస్టర్‌లా ఉంటుంది… ఆ టంగ్ ట్విస్ట‌ర్ ఎవ‌రూ ప్ర‌య‌త్నించ‌రు.. ఈ పేరుతో ప్రపంచంలోనే అతి పెద్ద నగరం పేరుగా దీనికి గిన్నిస్‌ రికార్డుల్లో ఎక్కించారు.దీన్ని వెనిస్‌ ఆఫ్‌ ఆసియా, సిటీ ఆఫ్‌ ఏంజెల్స్‌ లాంటి ముద్దు పేర్లతోనూ పిలుస్తారు. .. థాయిలాండ్‌ జనాభాలో మొత్తం 10 శాతం మంది నివసించేది ఈ నగరంలోనే. .ఇది ప్రసిద్ధ ఆలయాలకు, స్ట్రీట్‌ ఫుడ్స్‌, షాపింగ్‌కి పెట్టింది పేరు. ..ఇక్కడికి వచ్చిన సందర్శకులు కోల్డ్‌ మిల్క్‌ టీ రుచి చూసే వెళతారు. బ్యాంకాక్ న‌గ‌రం చౌప్రాయా నదీ పరీవాహక ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడి కరెన్సీ బాత్ ఒక్క థాయి బాత్‌ మన కరెన్సీలో దాదాపు 2 రూపాయిలకు సమానం.

బ్యాంకాక్‌లోని అన్ని పేరొందిన దేవాలయాల బొమ్మలతో నాణాలుంటాయి ఇది ఇక్క‌డ విశేషం….ఈ నగరంలోనూ చైనా టౌన్‌ ఉంటుంది. ఇంచుమించు పదిలక్షల మంది చైనీయులు ఇక్క‌డ ఉంటారు….. ఇక్క‌డ ఛతుచక్ అనే వారాంతపు మార్కెట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.. 27 ఎకరాల్లో ఉండే ఈ సంత సందర్శకుల్ని తెగ ఆకట్టుకుంటుంది. 15 వేల స్టాళ్లు ఉండే ఈ మార్కెట్‌కి శని, ఆదివారాల్లో 2 లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు…. ఇక్కడి ఫ్లోటింగ్‌ మార్కెట్లు కూడా అందర్నీ ఆకట్టుకుంటాయి… ఈ సంత‌ల‌న్నీ నీటిపై పడవల్లో ఉంటాయి… పండ్లు, పువ్వులు, ఆహార పదార్థాలు, రకరకాల వస్తువులు ఇలా అన్నింటినీ పడవల్లోనే పెట్టుకుని వచ్చి అమ్ముతుంటారు. కొనడానికే కాదు చూడ్డానికీ గమ్మత్తుగా ఉంటాయి ఈ వ్యాపారాలు

ప్రపంచంలోనే అతి పెద్ద బంగారు బుద్ధ విగ్రహం ఇక్కడే ఉంది… ఈ విగ్ర‌హం 5.5 టన్నుల బరువుతో ఉంటుంది….ఇక్కడి ఎరవన్‌ మ్యూజియం మూడు తలల ఏనుగు భవంతిలో భలేగా ఆకట్టుకుంటుంది… అలాగే కొత్త సంవత్సరం రోజున ఇక్కడ సాంగ్‌క్రన్‌ పేరుతో పండగ జరుపుతారు. గుంపులు గుంపులుగా వీధుల్లోకి వచ్చి సరదాగా నీటి యుద్ధాలు చేసుకుంటారు.1782 నాటి ఇక్కడి గ్రాండ్‌ ప్యాలెస్‌ మంచి పర్యాటక ఆకర్షణగా ఉంటుంది… చూడ‌టానికి చక్కని నిర్మాణశైలితో కనువిందు చేస్తుంది.. చూశారుగా బ్యాంకాక్ విశేషాలు ఈ సారి హాలీడే ట్రిప్ గా ఇక్క‌డ‌కు వెళ్లే ప్లాన్ వెయ్యండి.