ఆ ఆశ్రమంలోకి ఆడవాళ్లు వెళితే బాబా ఏం చేస్తాడో చూస్తే మ‌తిపోవ‌డం ఖాయం

496

ఈరోజుల్లో నిజంగా దైవ స్మ‌ర‌ణ‌తో ఉండే స‌న్యాసులు ఎవ‌రు అనేది తెలియ‌డం లేదు.. అక్ర‌మార్కుల వ‌లె వీరు త‌యారు అవుతున్నారు. చాలా మంది బురీడి బాబాలు ఇటువంటి చ‌ర్య‌లు లైంగిక వాంచ‌ల‌తో మితిమీరుతున్నారు. తాజాగా మ‌రో బాబా ఇలంటి అవ‌తార‌పురుషుడు వ్వ‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు అయింది…హైద‌రాబాద్ శివారులోని శ్రీభవతి ఆశ్రమంలో ఏం జరుగుతోంది. యువతులు కుటుంబసభ్యుల మాట వినకుండా ఎందుకు తయారవుతున్నారు. తల్లిదండ్రులకు కూడా పిల్లలను చూపించకపోవడానికి కారణమేంటి? రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో పోలీసులు అటువైపు సీరియస్‌గా దృష్టి పెట్టారట‌.

Related image

అతనో బాబా ఆయన మాటలకు భక్తులు ఫిదా ఆశ్రమంలో సేవికలుగా వెళ్లిన యువతులు మళ్లీ తమ ఇళ్లకు వెళ్లడానికే ఇష్టపడటం లేదు. కుటుంబసభ్యులు వచ్చినా వాళ్లను వెనక్కి పంపిస్తున్నారు. దీంతో అసలు ఆశ్రమంలో ఏం జరుగుతోందన్న సందేహాలు అటు స్ధానికుల్లో ఇటు సేవ‌కుల‌ కుటుంబాల్లో అలజడి సృష్టించాయి. కుటుంబసభ్యులనే కాదు పొమ్మనే పరిస్థితులు ఎందుకు వచ్చాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో హైదరాబాద్‌ శివార్లలోని విభోశ్రీ ఆశ్రమం ఆందోళనలతో అట్టుడికిపోయింది.
మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామంలోని ఒమౌజియా బాబా శ్రీభవతి ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని మహిళా సంఘాలు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఆశ్రమంలో చేరిన యువతిని తల్లిదండ్రులతో కలవనీయకుండా దాచిపెట్టడంతో బాబా ఆశ్రమ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఓ బాధిత తల్లి ఫిర్యాదు మేరకు అసలు బాబా ఎవరు? బాబా ఆశ్రమంలో ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Image result for kissing donga baba

నిర్మల్‌కు చెందిన చందన అనే అమ్మాయిని రెండు నెలలక్రితం శ్రీభవతి ఆశ్రమంలో చేర్పించారు. అయితే యువతి తల్లి మంగాదేవి తన కూతురిని చూపించాలని అడిగినా స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులతో కలిసి ఆశ్రమం దగ్గరికి వెళ్లినా ఆశ్రమ నిర్వాహకులు లోపలికి అనుమతించలేదు. స్థానిక పోలీసులు వెళ్లినా స్పందన లేకపోవడంతో ఏసీపీ రంగంలోకి దిగారు.
అయినా ఆశ్రమం నిర్వాహకులు ఎవరినీ లోపలికి రానివ్వలేదు. పైగా ఏసీపీతోనే కొందరు భక్తులు వాగ్వాదానికి దిగారు. ఈ పరిణామాలతో ఆశ్రమంలో అసలు ఏం జరుగుతోందన్న సందేహాలు ఎక్కువయ్యాయి. దీంతో ఆశ్రమం దగ్గర భారీగా పోలీసులను మోహరించారు.ఈ క్రమంలోనే మంగాదేవి కూతురు చందన బోయినపల్లి ఆశ్రమం నుండి నేరుగా గోధుమకుంట గ్రామంలోని ఆశ్రమానికి చేరుకుంది. అనంతరం పోలీసులు చందనను కుటుంబ సభ్యులకు అప్పగించారు. చందన తల్లి మంగాదేవి తమను ఆశ్రయించడంతో రంగంలోకి దిగామని డీసీపీ ఉమామహేశ్వర శర్మ తెలిపారు.

Image result for kissing donga baba

జవహర్‌నగర్‌లోని ఒంపుగూడ ఆశ్రమంలోనూ చందనకోసం వెదికినా దొరకలేదని గోధుమకుంట ఆశ్రమంలోని ఓమౌజీ ఆశ్రమంలోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో సిబ్బంది లోపలికి అనుమతించకపోవడంతో ఉద్రిక్తత ఏర్పడిందన్నారు. చందన బ్యాంకు అకౌంట్ నుండి 6 లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నారని, ఎందుకు డబ్బు డ్రా చేశారన్న విషయాలను తెలుసుకుంటున్నామని ఆయన వివరించారు.విషయం తెలుసుకున్న స్థానికులు, హిందూ సంస్థలు, ప్రజా సంఘాల నాయకులు గోధుమకుంటలోని శ్రీభవతి ఆశ్రమానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. దొంగ బాబాను ఆరెస్ట్‌ చేయాలంటూ నినాదాలు చేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మరోవైపు ఓమౌజియా ఆశ్రమం దగ్గర పరిస్థితుల గురించి తెలుసుకున్న పలువురు బాధితుల కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. భక్తి పేరిట మోసగిస్తున్నారని ఆరోపించారు.ఆశ్రమంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగడం లేదని భక్తులు చెబుతున్నారు. ముందుగా కుటుంబసభ్యులు అనుమతి తీసుకున్నాకే యువతులను సన్యాసినులుగా మారుస్తారని అంటున్నారు. ఇక ఈ ఆశ్రమానికి వచ్చిన ఆరుగురు యువతులను సన్యాసినులుగా మార్చినట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబసభ్యుల అనుమతి లేకుండా ఇలా జరిగి ఉంటే స్వామీజీని విచారిస్తామని పోలీసులు అంటున్నారు. ఇదేం విచిత్ర బాబా అని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. మ‌రి ఈ బాబాపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.