కూల్ డ్రింక్స్ తాగేవాళ్లు ఒక్కసారి ఈ వీడియో చూడండి

184

మనకు ఎక్కడైనా నలుగురు యువకులు కనిపిస్తే వారు మాట్లాడుకుంటూ వారి చేతిలో కనిపించే వస్తువులు ఒకటి సిగరెట్, రెండు కూల్ డ్రింక్స్. ఇన్ని రోజులు అందరూ సిగరెట్ వలన ప్రమాదం అని చెపుతూనే ఉన్నారు కానీ ఇప్పుడు కూల్ డ్రింక్స్ వలన కూడా చాలా ప్రమాదమని అంటున్నారు అమెరికన్ సొసైటీ ఆఫ్ అడిక్షన్ మెడిసన్ అధికారిక జర్నల్. యువత ఎక్కువగా ఇష్టపడి తాగే కూల్ డ్రింక్స్‌కి సంబంధించి కొన్ని కొత్త విషయాలు వెలుగు చూసాయి. మరి ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో చూద్దామా..

Image result for cooldrinks

సాధారణంగా ఈ డ్రింక్స్ తాగడం వల్ల శరీరానికి అధిక శక్తి వస్తుందని చాలా మంది నమ్ముతుంటారు. అందుకే వీటిని ఎక్కువగా సేవిస్తుంటారు. వీటిని తాగడం వల్ల వచ్చే శక్తిని పక్కనబెడితే వీటి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కూల్ డ్రింక్స్‌ వలన చాలా ప్రమాదం ఉందట దీనివలన ముఖ్యంగా గుండెపోటు ఎక్కువగా వస్తుందని చెప్పుతున్నారు పరిశోధకులు. ఈ కూల్ డ్రింక్స్‌ లలో ఎక్కువగా కెఫిన్ వాడకం వలన అధిక ప్రమాదం ఉంటుందని తాజా పరిశోధనలో తేలిన నిజం. అలాగే కెఫిన్ వలన మానవ శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థను పని చేయకుండా చేస్తుందని ప్రయోగ పూర్వకంగా తెలియజేశారు. కూల్ డ్రింక్స్‌ ఎక్కువగా తాగడము వలన టూత్ ఎనామిల్ గా పేర్కొనే పంటిపైగల్ గ్లాసీ లేయరును శాశ్వతముగా తొలగిస్తుంది. ఈ డ్రింక్స్ లో ఉండే అత్యదిక యాసిడ్ పదార్ధాలు దీనికి కారణము.

Image result for cool drinks drinking

సెల్యులర్ స్థాయిలో ఎసిడిటీ మన శరీరాన్ని ఏవిధంగా ప్రభావితము చేస్తాయంటే వీటిలో ఉన్న యాసిడ్స్ ‘ హైడ్రోజన్‌ ప్రోటీన్‌ అయాన్స్ ‘ తో శాచ్యురేట్ అయి మన శరీరము నుండి శక్తిని లాగుతాయి. మన శరీరాలు సహజముగా ఆల్కలైన్‌ తో డిజైన్‌ అయివుంటాయి. కూల్ డ్రింక్స్‌ తాగడము వలన ఆల్కలైన్‌ బ్యాలెన్స్ ప్రిజర్వేషన్‌మోడ్ నుండి ప్రొటేక్ట్ మోడ్ లోనికి మారుతుంది. పైగా ఇవి శరీరములో ఏ రకంగా నూ శక్తిని పెంచలేవు. నిజానికి శక్తిని తగ్గిస్తాయి. కార్బన్ డయాక్సైడ్ అనే విషవాయువు కూల్ డ్రింక్స్ ను ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంచడం కోసం ఈ వాయువును ఎక్కువగా వాడుతుంటారు. కూల్ డ్రింక్స్ లో విషపూరిత రసాయనాలు చాలా ఎక్కువగా కలిపి ఉంచ్చుతారు. కాబట్టి కొన్ని విదేశాలలో పిల్లలు కూల్ డ్రింక్ లు తాగరు. కూల్ డ్రింక్ లో పాస్ఫారిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివలన ఎముకల్లో క్యాల్షియం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఎముకల్లో కాల్షియం తగ్గితే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తేలిక ఎముకలు విరిగిపోతాయి. అంటే ఎముకలు దృఢత్వాన్ని కోల్పోతాయి. ఎముకలను కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంలు గట్టిపరుస్తాయి. కూల్‌డ్రింక్స్‌లో ఉండే ఫాస్ఫారిక్ ఆమ్లం వీటన్నింటినీ దెబ్బతీస్తుంది.

ఈ క్రింది వీడియో ని చూడండి

కూల్‌డ్రింక్స్‌ను అధికంగా సేవించడం వల్ల వాటిలో ఉండే చక్కెర శరీరానికి అదనపు క్యాలరీలను ఇస్తుంది. దీంతో బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కూల్‌డ్రింక్స్‌ను తాగడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. అవి కూల్‌డ్రింక్స్‌లో ఉండే పదార్థాలను శరీరం నుంచి బయటకు పంపేయడానికి నీటిని ఎక్కువగా వాడుకుంటాయి. దీంతో డీహైడ్రేషన్ బారిన పడి, నీరసం చెందుతారు. ఒక్కోసారి మూర్ఛపోయే ప్రమాదం కూడా ఉంటుంది. చాలా మంది మద్యం సేవించే వారు కూల్ డ్రింక్స్‌ను ఆల్కహాల్‌లో కలుపుకుని సేవిస్తారు. అలా చేస్తే లివర్, కిడ్నీలపై అధికంగా భారం పడుతుంది. దీంతో అవి కాలక్రమేణా పనిచేయకుండా పోతాయి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పసిఫిక్ సైంటిస్టులు 18-40 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారిపై కొన్ని ప్రయోగాలు నిర్వహించారు. 304-320 గ్రాముల కెఫైన్ కలిసిన 32 ఔన్స్‌ల ఎనర్జీ డ్రింక్‌ని సేవించిన వారి గుండె స్పందనల్లో తీవ్రమార్పులు చోటు చేసుకున్నట్లు తేలింది. ఈ కూల్ డ్రింక్స్‌ తాగిన వారి హృదయ స్పందనలు 6 మి.సె నుంచి 7.7 మి.సె ఉంటున్నట్లు గుర్తించారు. ఇది ప్రాణాలకు ముప్పు తీసుకొస్తుంది కాబట్టి కూల్ డ్రింక్స్‌ మానివేయాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఇప్పటికైనా ఇలాంటి డ్రింక్స్ తాగడం తగ్గించకపోతే మన ప్రాణాలను మన చేతులతో తీసుకున్న వారం అవుతాము. కాబట్టి జాగ్రత్త.