సముద్రాన్ని వెనక్కి పంపి కేరళను పుట్టించాడు..కేరళ గురించి ఎన్నో తెలియని విషయాలు.

495

కేరళ ప్రకృతికి మరొక రూపం అన్నట్టు ఉంటుంది.ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.చుట్టూ ఎటు చుసిన చెట్లు స్వచ్చమైన గాలి..ఇలా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.అయితే కేరళ గురించి మీకెంతవరకు తెలుసు.నిజానికి క్రీ పూ 573 సముద్రం నుండి కేరళ బయటపడిందని మీకు తెలుసా.కేరళ గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి.మరి ఆ విషయాలేంటో తెలుసుకుందామా.

త్రేతాయుగం లో పరశురాముడు ఒకరోజు సముద్రాన్ని తన శక్తితో వెనక్కి వెళ్ళేల చేసాడని, దాంతో కేరళ బయటపడింది అని చెబుతారు. కేరళ ప్రాచీనతకు అడ్డం పట్టే ఎన్నో ఆధారాలు మనకు ఇక్కడ లభిస్తాయి.క్రీ.పూ.10వ శతాబ్దం నాటి కుండపెంకులు, సమాధులే ప్రజల నివాసానికి సంబంధించి ఇక్కడ లభించిన మొదటి ఆనవాళ్ళు.అలాగే ప్రాచీన కాలంలో కేరళ, తమిళనాడు ప్రాంతాలు ఒకే భాష, జాతి, సంస్కృతికి చెందిన వారని చెప్పే ఆధారాలు మనకు ఇక్కడ కనిపిస్తాయి.14 వ శతాబ్దపు మొదట్లో భాష పరంగా కేరళ ప్రత్యేకతను సంతరించుకుంది.చేర వంశీకులు – వంచి రాజధానిగా కేరళను పాలించారు. పల్లవులతో కలిసి వారు చోళ, పాండ్య రాజులతో యుద్ధాలు చేసారు. 8- 14 శతాబ్దాల మధ్యకాలంలో చేరరాజుల పాలనా సమయంలో మళయాళం భాష అభివృద్ధి చెందింది. చివరికి కేరళ ఒక ప్రత్యేక జాతిగా ఆవిర్భవించింది.

క్రీ.పూ. 573లో యూదులు ఇక్కడకి వలస వచ్చారట. ఆ తరువాత 8వ శతాబ్దంలో ముస్లిం మతస్తులు కేరళలో స్థిరపడ్డారు. అలాగే క్రైస్తవులు కూడా స్థిరపడ్డారు.స్వాతంత్ర్యం వచ్చాక 1941 జూలై 1న తిరువాన్కూరు, కొచ్చిన్ సంస్థానాలను కలిపి తిరువాన్కూర్-కొచ్చిన్ ఏర్పరచారు. 1950 జనవరి 1న దీనిని ఒక రాష్ట్రంగా గుర్తించారు.1956 నవంబరు 1న, రాష్ట్రపునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేరళ రాష్ట్రం ఏర్పడింది.1957లో ఎన్నికలద్వారా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడడం అనేది ప్రపంచంలోనే మొదటిసారి. అప్పటి ట్రావన్కోర్ రాజు రాజా మార్తాండ వర్మ తన రాజ్యాన్ని తిరువనతపురం లోని పద్మ నాభ స్వామికి అంకితం చేసి ఆయన దాసునిగా రాజ్యాన్ని పరిపాలించాడు.అతని తర్వాత ఆయన వారసులైన రాజులు కూడా ఆ విధంగానే చేసారు.రాజ ముద్రలు దేవుని పేరునే ఉండేవి. అందుకనే కేరళను “God’s own country”అంటే దేవుని సొంత భూమి అని అంటారు.భారతదేశపు మొత్తం వృక్షజాతిలో సుమారు 10,000 జాతులు కేరళలో ఉన్నాయి.

4,000 పుష్పజాతులలో 1,272 రకాలు కేరళకు స్థానికం, 900 రకాలు విలువైన ఆయుర్వేద ఔషధ మొక్కలు. మొత్తం కేరళలో 24% అటవీ భూమి. భారతీయ అతి ప్రాచీన యుద్ధ కళ… కరాటే, కుంగ్ఫూ, సమురాయ్ అంటూ గొప్పగా చెప్పుకునే విదేశీయులంతా మన దేశంలోని సామాన్య సైనికుని ముందు తలవంచేలా నిలబెట్టిన కళ మన కేరళ సొంతం.పరశురాముడిని ఈ విద్యకు ఆద్యునిగా భావిస్తారు. అటు విదేశాలకూ ఈ కళ గొప్పతనం తెలిసింది.ఇంతకీ కేరళకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా.కేర అంటే కొబ్బరి చెట్టు, ఆళం అంటే భూమి – ఈరెండిటి నుండి కొబ్బరిచెట్ల భూమిగా కేరళం అయింది.