83 ఏళ్ల మామ‌గారిపై ఆ కోడ‌లు ఏం చేసిందో చూస్తే

1050

Image result for 80 years old indian man

మ‌న‌కు కూతురు లేక‌పోయినా వ‌చ్చే కోడ‌లిని కూతురిలా చూడాలి అని అనుకుంటారు కొంద‌రు.. ముఖ్యంగా కోడలు మ‌న ఇంట్లో క‌లిసి మెల‌సి ఉండాలి అని, కుటుంబంలో అంద‌రూ భావిస్తారు.. అయితే అత్త మామ‌ల‌ను కూడా సొంత త‌ల్లి దండ్రులా చూసుకోవాలి అని ఆ అమ్మాయికి కూడా ఉండాలి క‌దా, అందుకే ఇంటికి వ‌చ్చే అమ్మాయి గుణ గ‌ణాలు వారి కుటుంబం గురించి తెలుసుకుని ఇంటికి కోడ‌లిగా తీసుకువ‌స్తారు.. త‌న ఉద్యోగంతో క‌ష్ట‌పడి ఎంతో మంచి లైఫ్ త‌న కుటుంబానికి ఇవ్వాలి అని అనుకున్నాడు ఓ తండ్రి సొంత ఇళ్లు నిర్మించుకున్నాడు.. అలాగే త‌న పిల్ల‌ల‌ను ఉన్న‌త విద్యావంతుల‌ను చేశాడు.. ఇక రిటైర్మెంట్ వ‌య‌సు వ‌చ్చి, ఆయ‌న ఇంట్లోనే రిటైర్డ్ అయ్యి రెస్ట్ తీసుకుంటున్నాడు.. ఈ స‌మ‌యంలో ఆయ‌న భార్య ఈ లోకం విడిచి ఆ కుటుంబం విడిచి వెళ్లిపోయింది.
దీంతో ఆ ఫ్యామిలీ ఎంతో కుంగిపోయింది..

Image result for old women family

చివ‌ర‌కు కొద్ది రోజుల త‌ర్వాత ఆయ‌న పెద్ద కుమారుడిని ఓ మంచి అమ్మాయిని చూసి వివాహం చేసుకోవాలి అని కోరాడు.. ఇలా ఎన్ని రోజులు అయినా ఆ పెద్ద కుమారుడు ఇప్పుడు పెళ్లి చేసుకోను అని స‌మాధానం చెప్పేవాడు.. చివ‌ర‌కు తండ్రి మాట కాదు అన‌లేక పెళ్లి చేసుకోవ‌డానికి ఒకే చెప్పాడు ఆ కొడుకు.. ఇక త‌న‌కు ఇంట్లో కోడ‌లు ఉంటే తోడు ఉంటుంది అని, కోడ‌లు రాక‌కై ఆ అబ్బాయి తండ్రి ఎదురుచూశాడు.. చివ‌ర‌కు పెళ్లి అయ్యి అత్త‌గారింట అడుగుపెట్టింది కోడ‌లు.. పెళ్లైన కొద్దికాలం బాగానే ఉన్నా, ఇంట్లో ఉన్న మామ‌గారిపై ఈస‌డింపు పెరిగిపోయింది కోడ‌లికి… అత‌నికి వ‌య‌సు పెరిగే కొల‌ది ఆమె అత‌నికి ఇచ్చే గౌర‌వం త‌గ్గిపోతోంది.. నోటికి వ‌చ్చిన మాట‌లు అన‌డంతో ఆమె మామ‌గారు ఎంతో కుంగిపోయేవాడు.. ముస‌లివాడివి మూల‌న ప‌డి ఉండాలి అని త‌ర‌చూ త‌న నోటికి ప‌నిచెప్పేది అత‌ని కోడ‌లు.

Image result for 80 years old indian man

ఇక కొడుక్కి కూడా ఇంట్లో ఉన్న‌వి లేనివి మామ‌గారిపై నూరిపోసేది.. చివ‌రికి ఈ విష‌యాల‌పై త‌న‌లో తాను కుమిలి పోతూ ఉండేవాడు.. క‌నిక‌రం మాన‌వ‌త్వం లేకుండా 80 ఏళ్లు వ‌చ్చిన ముస‌లి వ్య‌క్తిని తాళ్ల‌తో క‌ట్టి ఇంట్లో ఉంచేశారు..ఇక ఇంట్లో ఎవ‌రిమీద అయినా కోపం వ‌స్తే ఆ కోపం ఆ ముస‌లి తాత‌పై చూపిస్తారు.. ఓ క‌ర్ర తీసుకుని వారి కోపం పోయే వ‌ర‌కూ ఆ తాత‌ని కొడ‌తార‌ట‌.. ఇక ఈ విష‌యం చుట్టుప‌క్క‌ల వారు కూడా గ‌మ‌నించ‌లేదు..కాని ఈ ఇంటి స‌భ్యుల బండారం బ‌య‌ట‌ప‌డింది.. నిజ‌మే -దుర్మార్గం – అన్యాయం ఎక్కువ కాలం నిలువ‌దు క‌దా, ఇక్క‌డ కూడా అలాగే జ‌రిగింది.

Image result for old women family

ఓసారి ఈ ఇంటికి చుట్ట‌పు చూపుగా వ‌చ్చిన ఓ బంధువు, ఆ ముస‌లి వ్య‌క్తి ధీన స్ధితిని చూసి, ఫోటోలు వీడియోలు తీశాడు.. అతన్ని తాళ్ల‌తో క‌ట్టిన ప‌రిస్దితిని అత‌ని నుంచి తెలుసుకుని బాధ‌ప‌డి, ఈ ఫోటోల‌ను బ‌య‌ట‌పెట్టాడు.. ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌డంతో ఈ విష‌యం అక్క‌డ స్దానికుల‌కు – చుట్టుపక్క‌ల వారికి అంతా పాకేసింది.. ఇక చివ‌ర‌కు పోలీసుల‌కు కూడా తెలియ‌డంతో, ఆ ఇంటికి చేరుకుని ఆ ముస‌లి వ్యక్తిని చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు.

ఇంటికి వ‌చ్చిన స‌మ‌యంలో ఆ ముస‌లి వ్య‌క్తిని చేతులు క‌ట్టేసి ఉంచారు.. వెంట‌నే అత‌న్ని హాస్ప‌ట‌ల్ కు తీసుకువెళ్లారు పోలీసులు.. దీంతో కోడ‌లు కొడుకుని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.. రెండు రోజులు చికిత్స తీసుకున్న త‌ర్వాత ఆ ముస‌లాయ‌న్ని వృద్దాశ్ర‌మంలో చేర్చారు.. త‌న కోడ‌లు కొడుకు మార‌ర‌ని నేను వారితో ఉండ‌ను అని చెప్పాడు ఆ వ్య‌క్తి… ఇక్క‌డ విచారించ ద‌గ్గ విష‌యం ఏమిటి అంటే? 80 ఏళ్ల ఆ ముస‌లి వ్య‌క్తిని ఎందుకు ఇలా ఇబ్బందులు పెట్టారు అంటే అత‌ని కొడుకు చెప్పిన స‌మాధానం, త‌నతండ్రి మాన‌సిక ప‌రిస్దితి బాగోలేద‌ని, అందుకే తాళ్ల‌తో క‌ట్టాము అని చెప్పారు..చూశారుగా స‌ర్వ‌శ్వం త‌న‌పిల్ల‌లు అని, ఆస్తి సంపాదించి కొడుక్కి ఇస్తే, చివ‌ర‌కు కొడుకు అత‌ను పిచ్చివాడు అనే ముద్ర త‌న తండ్రికి వేశాడు.. ఇలాంటి పుత్ర‌ర‌త్నాల‌కు ఎటువంటి శిక్ష విధించాలో కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియ‌చేయండి.