ఇంటికింద ఉన్న విలువైన సంప‌ద చూసి కంగుతిన్న ఇంటి య‌జ‌మానులు

596

ఎవ‌రి ఇంటికిందైనా మ‌హా అయితే ఏమి ఉంటుంది మొత్త‌ని మ‌ట్టి, గ‌తంలో ఉన్న‌టు వంటి క‌ట్ట‌డానికి సంబంధించిన వ‌స్తువులు ఏమైనా ఉండ‌వ‌చ్చు.. అయితే తాజాగా ఓ ఇంటి కింద క‌నిపించింది చూస్తే వెంట‌నే క‌ళ్లు తిరిగి అవాక్క‌వుతారు.. ఇంతకి ఆ ఇంటికింద క‌నిపించింది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for turkey kapadocia tunnel

ట‌ర్కీలోని కంప‌డోసియాలో ఓ ఇంటి బేస్ మెంట్లో గోడ‌కూల్చుతుండ‌గా ఓ ర‌హ‌స్య గ‌ది క‌నిపించింది.. లోప‌లికి వెళ్లిచూస్తే ఆ ర‌హ‌స్య గ‌ది నుంచి భూ గ‌ర్బ సొరంగ మార్గం క‌నిపించింది..ఈ సొరంగం గుండా వెళితే డెరంటూయు అని ఓ ప్రాచిన న‌గ‌రం క‌నిపించింది.. దాదాపు 18 అంత‌స్తుల‌తో ఈ న‌గ‌రం నిర్మితం అయి ఉంది.. దాదాపు 20 వేల మంది నివ‌సించేందుకు అనువుగా ఉందిఈ కొత్త న‌గ‌రం..దీనిని చూసిన చరిత్ర కారులు ఆశ్చ‌ర్య‌పోయారు ఇలాంటి ప్రాంతం ఇక్క‌డ ఉంటుంది అని వారు అస‌లు ఊహించ‌లేదు ఇదంతా రాతి ప్రాంతం కావ‌డంతో, ఇలాంటి సొరంగాలు ఏర్పాటు చేయ‌వ‌చ్చు.. కాని చ‌రిత్ర కారుల‌కు ఇటువంటి ఆలోచ‌న వ‌చ్చినా అవి ఇక్క‌డ నిర్మించ‌లేదు అని భావించారు.

Image result for turkey kapadocia tunnel

ఆ న‌గ‌రం లోప‌ల చూస్తే ఆహార ధాన్యాలు నిలువ‌చేసేందుకు గిడ్డింగులు ఆకారంలో కొన్నిప్ర‌త్యేక గదులు కేటాయించారు అలాగే ఆనాడు ఉప‌యోగించిన ప‌నిముట్లు క‌నిపించాయి.. భారీ రాతి త‌లుపులు కూడా లోప‌ల నుంచి మూసేందుకు వీలుగా ఉన్నాయి… ఇక శ‌త్రువులు లోప‌లికి రాకుండా వారిని స‌మ‌ర్ద‌వంతంగా అడ్డుకునేవిగా ఆ తలుపులు ఉన్నాయి.. ఇవి క్రీస్తుశ‌కం 780 నుంచి 1180 మ‌ధ్య కాలంలో బెంజెన్ ప‌రిపాల‌న‌లో నిర్మించి ఉంటారు అని భావిస్తున్నారు.. ఈ న‌గ‌రం నిర్మాణం వెనుక కార‌ణం చూస్తే ఇది అరబ్ ల దాడుల నుంచి ర‌క్షించేందుకు అలాగే ప్ర‌కృతి ప్ర‌కోపాల‌ నుంచి త‌మ‌ను కాపాడుకునేందుకు నిర్మించి ఉంటారు అని చ‌రిత్ర‌కారులు చెబుతున్నారు.

ఈ సొరంగ‌మార్గాల నుంచి కిలో మీట‌ర్ల మేర వేరే న‌గ‌రాల వ‌ర‌కూ సొరంగ మార్గాలు ఉన్నాయి… వేరే ప్రాంతాల‌కు వెళ్లేలా ఈ సొరంగాల‌ను ఆనాడు ఏర్పాటు చేశారు అంటే శ‌త్రువుల నుంచి త‌ప్పించుకునేందుకు అని చ‌రిత్ర‌కారులు భావిస్తున్నారు… ఈన‌గ‌రం గురించి ఇంత విశ్లేషించినా 50 శాతం మాత్ర‌మే తెలుసుకోగ‌లిగారు చ‌రిత్ర‌కారులు.. ఇంకా తెలుసుకోవాల్సింది 50 శాతం ఉంది…ఇప్పుడు ఈ ప్రాంతం అంతా ప‌ర్యాట‌కుల‌తో క‌ల‌క‌ల‌లాడుతోంది.. చూశారుగా ఇలాంటి చ‌రిత్ర‌లో క‌లిసిపోయిన న‌గ‌రాలు కూడా ఉంటాయి.. ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.