నేపాల్ గురించిన షాకింగ్ నిజాలు..వింటే షాక్…

147

ఈ ప్రపంచంలోని చాలా దేశాలా చరిత్ర మనకు తెలుసు.ఆ దేశాల చరిత్ర పద్దతులు ఆచారాలు ఇలా చాలా విషయాల గురించి మనకు తెలుసు.అయితే మీకు నేపాల్ దేశం గురించి తెలుసా.ఆ దేశంలో పాటించే కొన్ని పద్దతుల గురించి మీకు తెలుసా.తెలియకపోతే ఇప్పుడు నేను చెబుతా వినండి.నేపాల్ కు వెయ్యి సంవత్సరాల పెద్ద చరిత్ర ఉంది.భారత్ మరియు చైనా మధ్యలో భౌగోళికముగా నేపాల్ బంధింపబడి ఉంది. మొత్తం 1,47,181 చ.కి.మీ. వైశాల్యములో విస్తరించి ఉంది. అందులో 56,827 చ.మై. భౌగోళిక వైవిధ్యమున్నప్పటికీ, పర్వతాలతో నిండి ఉంది.

Image result for nepal

నేపాల్ హిందు దేశం.ఇక్కడ బౌద్ధులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు.అందుకే నేపాల్ రాజధాని ఖాట్మండ్ ను సిటీ ఆఫ్ గ్లోరీ అంటారు.గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వము 563లో నేపాల్‌లోనే జన్మించాడునేపాల్ క్రమకమంగా ఆధునిక దేశంగా మారుతుంది.ఆధునిక పోకడలు పెరిగిపోయాయి.కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ పబ్లిక్ గా ముద్దులు హగ్స్ చేసుకోవడం నేరంగా భావించేవారు.ఈ మద్యనే రాజ్యాంగాన్ని సవరించి ఎటువంటి ప్రదేశంలో అయినా ముద్దులు పెట్టుకోవచ్చని తప్పులేదని చెప్పేశారు.

Image result for nepal

అలాగే ఈ దేశం నుంచి మన దేశానికి వచ్చి గుర్కాలుగా తిరిగే వారి గురించి మనకు తెలుసు.వీరికి ఎంత దైర్యం ఉంటుంది అంటే ఆపద ఎదురైనప్పుడు చావడానికైనా చంపడానికైన వెనుకాడరు.అందుకే వీరి కోసం ఇండియన్ ఆర్మీలో గుర్కా బెటాలియన్ అని ఏర్పాటు చేశారు.దాదాపుగా హిందు దేశం అయినా కూడా ఇతర దేశాల వారు ఈ దేశంలో ఉంటారు.కానీ ఎటువంటి మత కల్లోల్లాలు జరగకపోవడం ఈ దేశ ప్రత్యేకత.

Image result for nepal

మన దేశంలో ఉన్న బిన్నత్వంలో ఏకత్వం అనే సిద్ధాంతం అంటే ఈ దేశంలోని వాళ్లకు కూడా చాలా ఇష్టం.అందుకే అన్ని మతాలా వారిని సమానంగా చూస్తారు.ఈ దేశంలో ఎయిర్ పోర్ట్స్ చాలా తక్కువ.అందుకే విమాన ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి.మన దేశం వాళ్ళు ఎటువంటి పాస్ పోర్ట్స్ లేకుండానే నేపాల్ వెళ్ళవచ్చు.అంతేకాకుండా నేపాల్ వాళ్ళు ఇక్కడికి రావొచ్చు.ఇండియా నేపాల్ మద్య ఒక విషయంలో గొడవ జరుగుతూనే ఉంది.అదేమిటి అంటే గౌతమ బుద్దుడు ఎక్కడ జన్మించాడు అని.

ఈ దేశానికి డబ్బులు ఎక్కువగా మౌంట్ ఎవరెస్ట్ ను చూడటానికి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. నేపాల్ గవర్నమెంట్ రాకముందు నేపాల్ ఇండియా మీదనే ఆధారపడి ఉండేది.ప్రపంచంలోని అతి డేంజరస్ ఎయిర్ పోర్ట్స్ ఈ దేశంలోనే ఉన్నాయి.చాలా ప్రమాదాలు కూడా జరిగాయి.ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ పర్వతం ఈ దేశంలోనే ఉంది.ఈ దేశంలో హోలీని చాలా గ్రాండ్ గా చేసుకుంటారు.పశుపతినాథ్ టెంపుల్ చాలా ఫేమస్.ఇది చాలా పురాతనమైన ఆలయం.ఈ ప్రపంచంలోని అతి పెద్ద లేక్ తిలిచో ఈ దేశంలోనే ఉంది.ఇవేనండి నేపాల్ దేశం గురించి మనకు తెలియని కొన్ని విషయాలు.మరీ ఈ దేశం గురించి వారి పద్దతుల గురించి మీరేమనుకుంటున్నారో మాకు చెప్పండి.అలాగే మీకు ఇంకా ఏ దేశం గురించి తెలుసుకోవాలని ఉందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.మేము మా తర్వాత వీడియో లో మీకు తెలియజేస్తాం.