RX100 సినిమా స్ఫూర్తితో చనిపోయారు…వాట్సాప్‌ చాటింగ్‌లో బయటపడ్డ షాకింగ్ నిజాలు

140

సినిమాలు మ‌నిషి జీవితంలో ఎంతో ప్ర‌భావం చూపిస్తున్నాయి.. జగిత్యాల స్నేహితుల మ‌ర‌ణంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో చ‌ర్చ అయితే జ‌రిగింది. ప్రేమ‌కోసం ఇటువంటి దారుణాల‌కు పాల్ప‌డ‌టం అది కూడా మైన‌ర్ ఏజ్ లో ఇలాంటి ప్రేమ‌లు ఏమిటి అని ప్ర‌శ్నిస్తున్నారు. ముఖ్యంగా సినిమాల ప్ర‌భావం కూడా ఇలాంటి దారుణాల‌కు కార‌ణం అవుతోంది అని చెబుతున్నారు పోలీసులు… ఇది ప్రేమ గురించి ఇద్ద‌రూ ఘ‌ర్ష‌ణ‌ప‌డి చేసుకున్న హ‌త్యాయ‌త్నాలు అని అంటున్నారు పోలీసులు.

జగిత్యాల స్నేహితుల మ‌ర‌ణంపై డీఎస్పీ వెంక‌ట‌ర‌మ‌ణ‌ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇద్దరూ వేర్వేరు అమ్మాయిల‌ను ప్రేమించారని, ఆర్ఎక్స్ 100 సినిమా స్ఫూర్తితో చ‌నిపోయారని చెప్పారు. స్నేహితుల మధ్య జరిగిన వాట్సాప్‌ చాటింగ్‌ను ప‌రిశీలిస్తున్నామని, కాల్ డేటా సేక‌రిస్తున్నామని తెలిపారు. వారిది హ‌త్య కాదని, ఆత్మహ‌త్య అని ద‌ర్యాప్తులో తేలిందని ఆయన వెల్లడించారు. కేసును లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నామని వెంక‌ట‌ర‌మ‌ణ‌ పేర్కొన్నారు.జగిత్యాలకు చెందిన మహేందర్‌, రవితేజ ఒకే అమ్మాయిని ప్రేమిస్తుండడంతో ఆ విషయంలో తరచూ గొడవ పడుతుండేవారు. ఆదివారం మహేందర్‌, రవితేజ మరో స్నేహితుడితో కలిసి పట్టణంలోని మిషన్‌ కాంపౌండ్‌లో మద్యం సేవించారు.

తాగిన మైకంలోఇద్దరూ గొడవ పడినట్లు తెలుస్తోంది. చివ‌ర‌కు ఈ వివాదం చినికి చినిగి గాలివాన‌లా ఇద్ద‌రి మ‌ధ్య వార్ కు కార‌ణం అయింది. అది ముదరడంతో ఒకరిపైన మరొకరు పెట్రోలు చల్లుకొని నిప్పంటించుకున్నట్లు తెలుస్తోంది. త‌ర్వాత‌ వారి స్నేహితుడు అక్కడి నుంచి పారిపోయాడు. మంటల్లో చిక్కుకుని మహేందర్‌ ఘటనాస్థలిలోనే ప్రాణాలు విడిచాడు. రవితేజను జగిత్యాల ఆస్పత్రికి అక్కడి నుంచి కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవితేజ మృతి చెందాడు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇద్దరూ మ‌ర‌ణించ‌డంతో వీరి కుటుంబాల్లో విషాదం అల‌ముకుంది.. ఒక అమ్మాయిని ప్రేమించి గొడ‌వ ప‌డ్డారా లేదా ఇద్ద‌రూ వేర్వేరు అమ్మాయిల‌ను ప్రేమించారా అనేది పోలీసుల విచార‌ణ‌లో తేల‌నుంది. అయితే ఈ కేసు విష‌యంలో కుటుంబ స‌భ్యుల‌కు అమ్మాయిల‌ను అలాగే వారి స్నేహితుల‌ను కూడా విచారించ‌నున్నారు పోలీసులు