బస్సు లో సీటు కోసం కొట్టుకుంటున్న ఇద్దరమ్మాయిలకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన అబ్బాయి

434

ఇటీవ‌ల ఎటువంటి చిన్న సంఘ‌ట‌న జ‌రిగినా ఆ వార్త‌లు వెంట‌నే వైర‌ల్ అవుతున్నాయి.. అది వీడియో రూపంలో టెక్స్ట్స రూపంలో వైర‌ల్ అవుతోంది.. తాజాగా ఓ వార్త ఇప్పుడు వైర‌ల్ అవుతోంది…. ఆ వార్త ఏమిటి అనేది తెలుసుకుని వింటే ఆశ్చర్యం క‌లుగుతుంది.. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ వైర‌ల్ వార్త గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఇది వాట్సప్ లో వాట్సప్ లో తీవ్రంగా వైరల్ అవుతోన్న మెస్సేజ్.. వాస్తవ అవాస్తవాలను కాసేపు పక్కన పెట్టండి… కానీ చదవడం అంటూ మొదటు పెడితే తీవ్రమైన ఆసక్తితో చివరి వరకూ చదువుతారు…ఉదయం, సాయంత్రం రష్ బాగా ఉన్నప్పుడు బస్సులో ప్రయాణించటం ఎంతో కష్టంగా ఉంటుంది. అయితే, స్కూల్ పిల్లలు, కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు , మహిళలు ఎక్కువగా బస్సులలో ప్రయాణిస్తుంటారు….

Image result for girls in the bus

తాజాగా దిల్ సుఖ్ నగర్ నుండి హైటెక్ సిటి వైపుగా బయలుదేరింది పుష్పక్ బస్…ఒకటి, రెండు సీట్లు మినహా బస్ అంతా ఆల్ మోస్ట్ ఫుల్ గా ఉంది. ఇద్దరు ఫ్రెండ్స్ పక్కపక్కనే కూర్చొని కంపెనీ కబుర్లు చెప్పుకుంటున్నారు. బస్ లక్డికపూల్ చేరగానే జనాలంతా ఎగబడి , ఎగబడి ఎక్కారు. ఇంతకు ముందు చెప్పిన ఫ్రెండ్స్ ముందు ఓ సీటు ఖాళీగా ఉండడంతో..ఇద్దరమ్మాయిలు ఫాస్ట్ గా ఆ సీట్ వైపుగా దూసుకొచ్చారు.

Image result for girls in the bus

ఓ అమ్మాయి దూరం నుండే ఆ సీట్ మీద హ్యాండ్ బ్యాగ్ వేసింది. మరో అమ్మాయి ఆ సీటు దగ్గరకు వచ్చి హ్యాండ్ బ్యాగ్ తీసేసి కూర్చుంది. ఓ 10 మంది దాకా నిలబడి ఉన్నారు.ఇంతలో హ్యాండ్ బ్యాగ్ అమ్మాయి ఆ సీట్ దగ్గరికి వచ్చి ఎక్స్ క్యూజ్ మీ….ఇది నా సీట్ , మీరు లేవండి ప్లీజ్ అంది. దానికి కూర్చున్న ఆ అమ్మాయి నో…నేనే ఫస్ట్ వచ్చి కూర్చున్న అని చెప్పింది. లేదు నేను ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ వేశాను, తర్వాత మీరొచ్చి కూర్చున్నారని ఆమె, అయినా…కర్చీఫ్ లు , హ్యాండ్ బ్యాగ్ లు వేయడానికి ఇదేమైనా పల్లెవెలుగు బస్సా అంటూ కోపానికొచ్చింది కూర్చున్న అమ్మాయి ….. బస్ లోని జనాలంతా వీరివైపే చూస్తున్నారు. అది గమనించి ఎలాగైనా సీట్ దక్కించుకోవాలని ఇద్దరు పోటీ పడుతున్నారు. చిన్నపాటి గొడవ జరుగుతుంది.

Image result for girls in the bus

పక్క సీట్లో ఉన్న ఆ కుర్రాడు…ఎక్స్ క్యూజ్ మీ…అన్నాడు. ఏంటీ అన్నట్టు చూశారు ఆ ఇద్దరమ్మాయిలు, వారితో పాటు బస్ లోని జనాలు కూడా ఆ అబ్బాయి మీద దృష్టి సారించారు. సీట్ కోసం పోట్లాట ఎందుకు నేను ఓ మాట చెబుతాను దానికి తగ్గట్టు మీలో మీరే డిసైడ్ చేసుకోండి ఎవరు ఆ సీట్లో కూర్చోవాలో వద్దో అని అన్నాడు. ఏంటీ అన్నట్టు ఆ అమ్మాయిలతో పాటు, బస్ లోని జనాలందరు అతడు చెప్పే మాట కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఏం లేదు..మీలో వయస్సులో ఎవరు పెద్దో వారు ఆ సీట్లో కూర్చొండి.. పెద్దలను గౌరవించండి అనే ఫార్ములాను ఫాలో అవుదాం అన్నాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అంతే…అప్పటి వరకు కుర్చీలో కూర్చొని ఉన్న అమ్మాయి ఠక్కున లేచి..సారీ మేడమ్ మీరే కూర్చొండి అంటూ ఆమెకు సీట్ ఇచ్చింది. దానికి ఆ హ్యాండ్ బ్యాగ్ అమ్మాయి సారీ…సారీ…మీరే కూర్చొండి, ఆ సీట్ మీకే అంటూ సీటుకు దూరంగా జరిగింది. మేడమ్ కూర్చొండి అని ఆమె, పర్లేదు, పర్లేదు అని ఈమె…ఇద్దరూ సీట్ కు దూరంగా జరిగారు…ఇంతలో మరో 50 యేళ్లకు పైబడిన మహిళ ఆమె థ్యాంక్స్ బాబు, కాళ్లు బాగా నొస్తున్నాయి అంటూ వచ్చి ఆ సీట్లో కూర్చుంది. అదండీ సంగతి కాబట్టి ఎవరికీ కేటాయించిన సీట్లలో వారినే కూర్చినిద్దాం, ఒకవేళ పెద్దవారైతే వారికి మన సీట్ ఇద్దాం అని సూచిస్తున్నారు ఆర్టీసి యాజమాన్యం…చూశారుగా మీరు కూడా కాస్త ఇలాంటి స‌మ‌యాల్లో పెద్ద‌ల‌కు గౌర‌వం ఇచ్చి వారికి సీట్లు ఇవ్వండి…. చూశారుగా ఆయువ‌కుడు చేసిన ప‌నిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.