TV9 to TVNXT ఉగాండా లో కేబుల్ వ్యాపారం లో రవిప్రకాష్ గోల్ మాల్ అక్రమాస్తులు

199

ఉగాండా లో కేబుల్ వ్యాపారం లో రవిప్రకాష్ గోల్ మాల్ అక్రమాస్తులు.‌ఆదాయానికి మించి ఆర్జనతెలిసినవి గోరంత!! తేల్చాల్సినవి కొండంత!!మెరుగునై సమాజం ముసుగులో వెలిచేటి రవిబాబు @రవి ప్రకాష్ కుంభకోణాలు ఒక్కొకటి వెలుగులోకి వస్తున్నాయి. tv9 బూచి తో తెలుగు రాష్ట్రాలలో నే కాకుండా ఇతర దేశాల్లో కూడా తిమ్మిని బమ్మిని చేసి కోట్లు వెనకేసుకున్న గోల్ మాల్ వ్యాపారాలు బయటపడుతున్నాయి. ఆఫ్రికా లోని ఉగాండా రవిప్రకాష్ చేసిన గోల్ మాల్ ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లో, ఇటు‌మీడియా జనాన్ని షాక్ కి గురిచేస్తోంది.

Related image

TVNXT… ఆఫ్రికా దేశాల్లో ఒకటైన ఉగాండాలో వేగంగా విస్తరిస్తున్న కేబుల్‌ టీవీ సంస్థ. . దీని నెల ఆదాయం రూ. 1.70 కోట్లు. ఖర్చులు పోను యజమానికి రూ. కోటి నికరంగా ఆదాయం తెచ్చి పెడుతుంది ఈ సంస్థ. నెలకు రూ. కోటి అంటే ఏడాదికి రూ. 12 కోట్లు లాభాలు తెస్తున్న సంస్థ TVNXTఆఫ్రికా దేశాల్లో తెలుగు వారు అధికంగా నివసించే ఘన, బోట్సువానా, ఇధియోపియా, కెన్యా, జాంబియా కు విస్తరించే పనిలో వుంది!
ఉగాండాలో కంపాల కేబుల్ టీవి లిమిటెడ్ కంపెనీకుసగటున 10వేల కనెక్షన్లున్నాయి.ఒక్కో కనెక్షన్‌కు నెలకు రూ. 1700 మన కరెన్సీలో వసూలు చేస్తోంది. అదే ఉగాండా కరెన్సీలో అయితే 85 వేల షిల్లాంగులు . ఇక్కడ మనం ఒక రూపాయికి అక్కడ 50 షిల్లాంగులు చెల్లిస్తారు. ఈ సంస్థకు .. నెలకు రూ. 1.70 కోట్లు వసూలు అవుతుంది. అందులో రూ. 70 లక్షలు అన్ని ఖర్చులు పోనూ రూ. కోటి నికరంగా రవిప్రకాష్‌కు మిగుతుందని ఉగాండా కేబుల్‌ వ్యాపారవర్గాల అంచనా. ఎలా చూసినా ఏడాదికి రూ. 12 కోట్లు ఎక్కడికి పోవు.

Image result for రవిప్రకాష్

గోల్ మాల్ జరిగింది ఇలా

కంపాలా సిటీ కేబుల్‌ సంస్థను 1997 లో ఉగాండాలో ఎంఎస్‌ పార్ధసారధి 34 శాతం, ఏ. సతీష్‌కుమార్‌ , బి.ఆర్‌. శ్రీక్ష్మి 33 శాతం వంతున వాటాతో ప్రారంభించారు. కొద్ది రోజులకు సతీష్‌కుమార్‌ తన వాటాను బర్కత్‌ ఆలీ, బీఎస్‌ రమేష్‌బాబు, అమీర్‌ఆలీ జాసన్‌కు అమ్మారు. 2009 నవంబర్‌ 27న కంపాలా సిటీ కేబుల్‌ లిమిటెడ్‌లోకి ఎంఎస్‌ పార్ధసారధి, బర్కత్‌ ఆలీ, అమీర్‌ ఆలీ జాసన్‌, బీఎస్‌ రమేష్‌బాబు పేరుతో ఉన్న 2.35 లక్షల షేర్లను 40 కోట్ల షిల్లాంగులు… ఇండియన్ కరెన్సీ లో 80 లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. అదే రోజున సీహెచ్‌వీఆర్‌ సుబ్బారావు కూడా 16 కోట్లకు పైగా షిల్లాంగులు చెల్లించి (మన కరెన్సీలో రూ. 34 లక్షలు) 23,850 షేర్లు కొన్నారు. మెజారిటీ షేర్లు కొన్న రవిప్రకాష్ ఆ కంపెనీలో షేర్లే లేని రమేష్‌బాబు, వేములపాటి శ్రీధర్‌, సీహెచ్‌వీఆర్‌ సుబ్బారావు, శింగిరి మధుసూధన్‌ను డైరెక్టర్లుగా చేర్చుకున్నారు.

Image result for రవిప్రకాష్

షేర్లు ఒక్కటే..రవిప్రకాష్ రేటు వేరు

సుబ్బారావు రూ. 34 లక్షలతో 23,850 షేర్లు కొంటే… రూ. 80 లక్షలతో రవిప్రకాష్‌ 2.35 లక్షల షేర్లు కొన్నారు. సుబ్బారావు కొన్న ఒక్కో షేర్‌ ధర రూ. 140 రవిప్రకాష్ కొన్న షేర్‌ ధర రూ. 35. అంటే ఆర్‌పీకి రూ. 105 తక్కువకు ఒక్కో షేర్‌ లభించింది. ఇద్దరూ ఒకేరోజు షేర్లు ఒకే ధరకు కొన్నారు. ధరలో ఇంత వ్యత్యాసం ఎందుకుంది.? ఒక్కో షేర్‌ను ఆర్‌పీ కూడా రూ. 140కి కొంటే రూ. 3.29 కోట్లు చెల్లించాలి. ఎక్కడో ఆఫ్రికా ఖండంలో ఉన్న వారికి ఆర్‌పీపై అంత ప్రేమ ఎందుకుంటుంది. ఏదో ఒక రకంగా వారికి ఉపయోగపడితే తప్ప. ఒకవేళ ఆర్‌పీ రూ. 80 లక్షలు అధికారికంగా చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని హవాలా రూపంలో, మనీ లాండరింగ్‌ ద్వారా చెల్లించారా…? ఈ ప్రశ్నన్నింటికీ సమాధానం రావాలంటే లోతైన విచారణ జరగాల్సిందే. ఏడాదికి రూ. 12 కోట్లు ఆదాయం వచ్చే వ్యాపారాన్ని ఎవరైనా ఇతరులకు అమ్మాలంటే సాధారణంగా 5 రెట్లు ఎక్కువకు విక్రయిస్తారు. ఆ లెక్కన రూ. 60 కోట్లు ఆర్‌పీ బృందం చెల్లించాలి. అయితే వారు చెల్లించింది రూ. 80 లక్షలు మాత్రమే. ఇంత తక్కువకు షేర్హోల్డర్లు అమ్మటం వెనుక ఏం జరిగింది, ఒకవేళ ఆర్‌పీ మొత్తం చెల్లించి ఉంటే ఎలా చెల్లించారో ఇపుడు తేలాల్సి ఉంది? హవాలా ద్వారా రవి ప్రకాష్ చెల్లించారనే ఆరోపణలు అధికంగా వుండటంతో ఇప్పుడు అందరి దృష్టి రవిప్రకాష్ గోల్ మాల్ పై పడింది.

Image result for రవిప్రకాష్

రవిప్రకాష్ వ్యాపారాలు చేయొద్దా?

రవిప్రకాష్‌ విదేశాల్లో వ్యాపారాలు చేసుకోకూడదా, వాటిని ఖండాంతరాలకు విస్తరించ కూడదా? అలా చేస్తే తప్పేంటి? వ్యాపారాలతో కోట్లు సంపాదించుకోకూడదా? ఇతరులు చేస్తే ఒప్పు రవిప్రకాష్‌ చేస్తే తప్పా? అనే ప్రశ్నలు ఆయన మద్దతుదారులు లేవనెతుతున్నారు.ఏ దేశం లో నైనా ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు‌. కానీ రవిప్రకాష్ చేసే వ్యాపారాన్ని, కొనుగోలు చేసిన తీరు అంతా అనుమానాస్పదంగా వుంది.

ఈ క్రింద వీడియో చూడండి

అన్నీ సమాధానం లేని ప్రశ్నలే

అవినీతిని అంతం చేయడానికి పుట్టిన కల్కి ని అని రవిప్రకాష్ తనని తాను ప్రమోట్ చేసుకున్నాడు. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి కొడుకైన ఆర్‌పీ పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతుడు ఏమీ కాదు. తొలుత ఓ చిన్న పత్రికలో, ఆ తరువాత సిటీ కేబుల్‌లో, అక్కది నుంచి జెమినీ టీవీలోకి వచ్చి జీతంతో ఉద్యోగాలు చేశారు. 2003లో టీవీ9లో 10 శాతం వాటాతో డైరెక్టర్‌గా చేరి గత ఏడాది ఫోర్జరీ సంతకాల కేసులతో తొగించబడ్డాడు .

Image result for రవిప్రకాష్

కొద్ది రోజుల క్రితం *బ్రేక్‌ ఈవెన్‌లోకి వచ్చిన టీవీ9లో ఎంత డైరెక్టర్‌ అయినా వందల కోట్లు సాధించటం ఎలా సాధ్యం అన్నది ఇపుడు అందరికి కలుగుతున్న అనుమానం. టీవీ9లో అందరు ఉద్యోగులతో పాటు ఆర్‌పీకి జీతంతో పాటు బోనస్‌ వచ్చి ఉంటుంది. జీతం,బోసస్‌తో కాలం వెళ్లబుచ్చే రవిప్రకాష్ ఆఫ్రికా లోని ఉగాండాలో కేబుల్‌ వ్యవస్థను విస్తరించటంతో పాటు త్వరలో DTH వ్యాపారంలోకి రూ. 200 కోట్ల పెట్టుబడితో వస్తానని చెబుతూనే వున్నారు.

మెరుగునై సమాజానికి అంత డబ్బు ఎలా వచ్చింది?కేబుల్‌ వ్యాపారం ఎలా వచ్చిందనేది సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అంశాలు .రవిప్రకాష్ అత్యంత నీతిపరుడు ,నిజాయితీ పరుడు అయితే వేల కోట్ల రూపాయలు అక్రమ ఆస్తులు ఎలా వచ్చాయో కూడా ఆయన భజన బ్యాచ్ ,ఆయన అభిమానులు చెప్పాల్సిందే!!!

ఈ క్రింద వీడియో చూడండి