తీరం దాటనున్న పెను తుఫాన్ టిట్లీ.. తేదీ 10, 11న రెడ్ అలర్ట్… !

401

తుఫాన్స్ అంటే మనకు ఎప్పుడు భయమే.ఎందుకంటే ఒకసారి సముద్రంలో తుఫాన్ వస్తే దాని భీభత్సము అంతా ఇంతా కాదు.హుదుద్,ఫైలాన్,లైలా.. ఇలా చాలా తుఫాన్స్ ఇప్పటివరకు మనల్ని అనేక సమస్యలకు దారి తీసింది.అయితే ఇప్పుడు మరొకటి అలాంటిదే రాబోతుంది.అయితే ఈసారి రెండు తుఫాన్స్ ఒకేసారి రాబోతున్నాయి.మరి ఆ రెండు తుఫాన్స్ గురించి పూర్తీగా తెలుసుకుందామా.రెండు వైపుల నుంచి రెండు సముద్రాల్లో ముంచుకొస్తున్న రెండు తుఫాన్లు పలు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. ఇటు బంగాళాఖాతం అటు అరేబియా సముద్రం రూపుదిద్దుకున్న ఈ తుఫాన్లు ఏ స్థాయిలో విరుచుకుపడతాయోనని ప్రభావిత ప్రాంతాల ప్రజలు భీతిల్లుతున్నారు.

Image result for floods

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి సోమవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది. ఇది మరింత బలపడి ఈనెల 10నాటికి తుఫానుగా మారనుంది. దీనికి “తితలీ” అని నామకరణం చేయనున్నారు. పశ్చిమ, దానికి ఆనుకుని తూర్పుమధ్య అరేబియా సముద్రంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. దీనికి “లుబన్‌” అని ఒమన్‌ దేశం నామకరణం చేసింది.అరేబియా సముద్రంలో ఇప్పటికే తుఫాన్ “లుబాన్‌” ఏర్పడగా బంగాళాఖాతంలో బుధవారం నాటికి తుపాను “తితలీ” ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన లుబాన్ తుఫాన్ మరింత బలపడి ఈనెల 10నాటికి తుఫానుగా మారనుంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి ఒమన్‌ తీరం దిశగా కదులుతోంది.ఈ తుఫాన్ మరో నాలుగైదు రోజుల్లో ఒమన్‌ పరిసరాల్లో తీరం దాటవచ్చని, ఆ క్రమంలో తీవ్ర పెనుతుఫానుగా మరింత బలపడనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Image result for floods

తూర్పు మధ్య బంగాళాఖాతంలో సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వాయుగుండం ఏర్పడగా…ఇది మంగళవారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారి,బుధవారం తుపానుగా మారుతుందని ఐఎండి తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఒడిశాలో మంగళవారం రాత్రి నుండి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.బంగాళాఖాతం తుపాను”తితలీ”ఎంత ప్రభావం చూపుతుందనేది…అరేబియా తుపాను “లుబాన్”పై ఆధారపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.అయితే రెండు సముద్రాల్లో రెండు తుఫాన్లు ఏర్పడటం అసాధారణ విషయమేమీ కాదంటున్నారు వాతావరణ నిపుణులు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

లుబాన్‌ తుపాను ఒమన్‌ వైపు వెళ్లిపోయి బలహీనపడితే బంగాళాఖాతంలోని తుపాను బలపడుతుందన్నారు. దీని ప్రభావం తో రెండు మూడు రోజులు కోస్తా, ఒడిశాలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. విశాఖపట్నం,మచిలీపట్నం, నిజాంపట్నం, కళింగపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వాయుగుండం కొనసాగుతున్నందున…ఈ నెల 11 వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని…మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వారు హెచ్చరించారు.కాబట్టి జాగ్రత్తగా ఉండండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.రాబోయే ఈ రెండు తుఫాన్స్ గురించి అలాగే ఇప్పటివరకు వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన తుఫాన్స్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.