Breaking News:కాంగ్రెస్ పన్నిన కుట్రలో…టీఆర్ఎస్ నేత దారుణ హత్య

291

తెలంగాణాలో రాజకీయ రణరంగం మొదలయ్యింది.ఇంకొక నెలలో ఎన్నికలు ఉన్నాయి.అయితే అందరి ఆలోచన ఒకటే.ప్రత్యర్థులను ఎలా దెబ్బ తీయాలి ఎన్నికలలో ఎలా గెలవాలి.అందరు నాయకులూ ఇప్పుడు ఇదే ఆలోచనలో ఉన్నారు.అయితే కొందరు మాత్రం దుర్మార్గ చర్యలకు పాల్పడుతున్నారు.అవతల వ్యక్తులు గట్టి పోటీదారుడని భావిస్తే వారిని చంపడానికి కూడా వెనుకాడటం లేదు.అందుకే ఒకరిని ఒకరు పక్కా ప్లాన్ తో చంపడానికి కూడా రెడీ అవుతున్నారు.ఇప్పుడు ఒక తెరాస నేతను దారుణంగా చంపేశారు.మరి ఆ ఘటన వివరాలను పూర్తీగా తెలుసుకుందామా.

వికారాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ నేత దారుణ హత్య కలకలంరేపింది. పరిగి మండలం సుల్తాన్‌పూర్‌కు చెందిన నారాయణరెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం ఉదయం రాళ్లతో దాడి చేసి హత్య చేశారు.అయితే ఇది ప్రత్యర్థుల దాడి అనే అంటున్నారు. కొద్దిరోజులుగా టీఆర్ఎస్ నేతకు.. గ్రామంలో మరో వర్గానికి మధ్య వివాదం నడుస్తోంది. గతంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.ఇరువర్గాలపై కూడా పోలీసు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.ఈ మధ్యే నారాయణరెడ్డి వర్గీయులు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఈ రెండు గ్రూపుల మధ్య గొడవలు మరింత ముదిరాయి. మంగళవారం ఉదయం పొలం వెళ్తున్న నారాయణరెడ్డిని ప్రత్యర్థులు దారి కాచారు. కర్రలు, రాళ్లతో దాడి చేయగా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన గురించి తెలియగానే నారాయణరెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు.

ఈ హత్య, దాడితో సుల్తానాపూర్‌లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది.సుల్తాన్‌పూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కాంగ్రెస్ నాయకులపై ఆయన వర్గీయులు దాడి చేశారు.ఈ హత్యకు కాంగ్రెస్ నేతలే కారణమంటూ సుభాష్‌చందర్ రెడ్డితో పాటూ మరో వ్యక్తిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దర్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.ఇరువర్గాల మధ్య గొడవలు జరిగి ప్రమాదం ఉందని భావించి ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో పోలీసుల్ని మోహరించారు.టీఆర్‌ఎస్‌ నేత నారాయణ రెడ్డి దారుణ హత్యతో సుల్తాన్‌పూర్‌ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌తో వణికిపోతున్నారు స్థానికులు.చూడాలి మరి ఈ హత్య ఘటన ఆ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో.