ఎవరు చెప్పినా వినలేదు.. హిజ్రాని పెళ్లి చేసుకున్నాడు.. చివరికి ఏమైందో తెలిస్తే షాక్!

485

కొంద‌రికి జ‌న్యుప‌రంగా లోపాలు రావ‌డంతో ఆడ‌వారి ల‌క్ష‌ణాలు కొన్ని వ‌చ్చి వారిలా మారిపోతారు.. ఇక ఆ ల‌క్ష‌ణాల‌తో సొసైటిలో మ‌గ‌వాడిలా ఉండేకంటే ఆడ‌వారిలా ఉండ‌టం మేలు అని అనుకుని ఆడ‌వారిలా మార‌తారు.. చివ‌ర‌కు స‌మాజంలో ఎటువంటి ప‌రిస్దితులు వ‌చ్చినా వారిలో న్యూన‌త భావం పెరిగినా, దానిని అణిచివేసుకుంటూ ముందుకు వెళ‌తారు.. అయితే స‌మాజంలో మ‌గాడిలా బ్ర‌త‌క‌డం కంటే ఇలా ఆడ‌వారిలా బ్ర‌త‌క‌డం మేలు అని అంటారు ఇలా మారిన వారు ….ఇలా మారిన ఓ వ్య‌క్తిని ప్రేమ అంటూ వెంట‌ప‌డి ఓ వ‌క్తి ఏం చేశాడో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు.

Image result for Hijra mariges

అతను ఆమెగా మారిపోయాడు. సమాజంలో తను మగాడిగా ఉండటం అతనికి ఇష్టం లేదు. అమ్మాయిగా ఉండాలన్నదే అతని కోరిక. దీంతో తల్లిదండ్రులతో గొడవపడి ఇంటి నుంచి పారిపోయి అమ్మాయిగా మారిపోయాడు. అంతేకాదు ఆ తరువాత హిజ్రా కూడా అయిపోయాడు. హిజ్రా అయిన అతన్ని ఒక వ్యక్తి గాఢంగా ప్రేమించాడు. పెళ్ళి కూడా చేసేసుకున్నాడు. ఇదంతా ఎక్కడో కాదు తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో జరిగింది.పుదుప్పేట్టకు అతి సమీపంలో ఎస్సి కాలనీ ఉంది. ఆ కాలనీలో మణి ప్లస్ టు (ఇంటర్ సెకండియర్) చదువుతున్నాడు. తమ కళాశాలకు ఒకసారి కొంతమంది హిజ్రాలు వచ్చారు. విరాళాలు సేకరించారు. ఆ హిజ్రాలలో హన్సిక… మణికి బాగా నచ్చేసింది. ఆ తరువాత హన్సిక ఎక్కడ ఉందో కనుక్కుని వెంటపడ్డాడు.

Image result for Hijra mariges

ప్రేమిస్తున్నానన్నాడు. హిజ్రాలందరూ ముందు మణిని హేళన చేశారు. కొంతమంది అయితే కొట్టారు. నీకేమైనా పిచ్చా.. మా గురించి నీకు తెలుసు కదా అంటూ చెప్పారు. అయినా మణిలో మార్పు లేదు. ప్రేమిస్తున్నానంటూ మళ్ళీ వెంటపడ్డాడు.దీంతో హన్సికకు మణిలోని నిజమైన ప్రేమ అర్థమైంది. మణి ఇంటిలో తల్లిదండ్రులు మొదట్లో ఒప్పుకోకున్నా.. ఆ తరువాత హిజ్రాలందరూ కలిసి ఒప్పించారు. కంచి సమీపంలోని శక్తి స్వరూపిణి అమ్మ ఆలయంలో వీరు వివాహం చేసుకున్నారు. సమాజం తమను ఏమనుకున్నా ఫర్వాలేదంటున్నాడు మణి.

ఇద్దరూ కలిసి మణి ఇంటిలోనే కాపురం కూడా పెట్టేశారు. చివ‌ర‌కు ఫ్యామిలీతో క‌లిసి ఇంట్లోనే కాపురం పెట్టాడు కాని ఇప్పుడు కుటుంబంపై సూటిపోటీ మాట‌లు వ‌స్తున్నాయి.. అయినా మా కుమారుడి కోసం ఎటువంటి మాట‌లు అయినా భ‌రిస్తాం అంటున్నారు మ‌ణి కుటుంబ స‌భ్యులు… చూశారుగా మ‌ణి చేసిన ప‌నిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.