సముద్ర గర్భంలో రైలు ప్రయాణం, ఎక్కడో కాదు, మన దేశంలోనే

336

మనం ఇప్పటివరకు ఎన్నో అద్భుతాలను చూసే ఉంటాం.వాటిని చూస్తుంటే ఇది ఎలా సాధ్యం అయ్యింది అని అనిపిస్తుంది.అలంటి ఒక అద్భుతం గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.మీరు ఇప్పటివరకు రైల్వే బ్రిడ్జెస్ ను రైల్వే ట్రాక్స్ ను చూసి ఉంటారు.అవి చాలా పెద్దగా లేదా ఎత్తైన ప్రదేశాలలో నిర్మించి ఉంటారు.కానీ సముద్రం లోపల రైల్వే ట్రాక్ ను చూశారా..సముద్రం లోపల రైల్వే ట్రాకా..అది ఎలా సాధ్యం అవుతుంది అనుకోకండి.ఎందుకంటే సాధ్యం అయ్యింది.ఎన్నో వాటికి స్పృష్టికర్తగా మారిన భారత దేశం దీనిని కూడా సాధ్యం చేస్తుంది..సముద్రం లోపల రైల్వే ట్రాక్ ను నిర్మించింది.ఆ రైల్వే ట్రాక్ మీద వెళ్లే రైళ్లలో ప్రయాణం కూడా చేయవచ్చు.మరి దాని గురించి పూర్తీగా తెలుసుకుందామా.

సముద్ర గర్భంలో రైలు ప్రయాణం, ఎక్కడో కాదు, మన దేశంలోనే…..!

సముద్ర గర్భంలో రైలు ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ కొన్ని రోజుల్లో ఇది నిజం కాబోతోంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) నుంచి భారత్‌ వరకు అండర్‌వాటర్‌ హైస్పీడ్‌ రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. యూఏఈలోని ఫుజురాయ్‌ నగరం నుంచి ముంబై వరకు నీటి అడుగున రైలు మార్గాన్ని నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు యూఏఈకి చెందిన నేషనల్‌ అడ్వైజర్‌ బ్యూరో కంపెనీ తెలిపింది.ఈ విషయాన్ని సదరు కంపెనీ ఎండీ అబ్దుల్లా అల్‌షేహి వెల్లడించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ విషయమై అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘భారత్‌లోని ముంబై నుంచి ఫుజురాయ్‌ నగరాన్ని కలుపుతూ నీటి అడుగున హైస్పీడ్‌ రైలును తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడేందుకు ఈ ప్రాజెక్టు దోహదం చేయనుంది. భారత్‌ నుంచి ఎగుమతులు, దిగుమతులు చేసుకునేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుంద’న్నారు.అయితే ఇలా సముద్ర మార్గంలో రైళ్లు ప్రయాణం చెయ్యడం ఇదే మొదటిసారి కాదు.ఇంతకముందు హాంకాంగ్ – జుహాయ్ – మకావు మార్గంలో సముద్రం లోపల దాదాపు 6 కిమీ సముద్రం లోపలనే ప్రయాణించాల్సి ఉంటుంది.అయితే ఇప్పుడు భారత్ మరియు యుఏఈ మధ్య నిర్మించబోతున్న ఈ రైల్వే ట్రాక్ పూర్తీగా సముద్రం లోపల ఉంటుంది.చూడాలి మరి సముద్రం లోపల ప్రయాణం ఎలా ఉంటుందో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.సముద్రం లోపల నిర్మించబోతున్న ఈ రైల్వే ట్రాక్ గురించి అలాగే ఈమధ్య ఎన్నో కొత్త కొత్త వాటిని స్పృష్టిస్తున్న భారతదేశం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.