ట్రాఫిక్ పోలీసు హెల్మెట్ అడిగితే..ఈనాకొడుకు ఏం చేసాడో చూడండి

303

ట్రాఫిక్ పోలీసుల పని ఏమిటి రోడ్ల మీద ట్రాఫిక్ కాకుండా చూసుకోవడం, ఎవరైనా పేపర్స్ సరిగ్గా లేకుండా వాహనం నడిపితే వారిని ఆపి ఫైన్ వెయ్యడం లాంటివి ట్రాఫిక్ పోలీసులు చేస్తుంటారు. బైక్ పైన వేగంగా వెళ్లినా, హెల్మెట్ పెట్టుకోకపోయినా లేదా ట్రిపుల్ రైడింగ్ చేసినా ట్రాఫిక్ పోలీసులు చలానా వేస్తారు. లేదంటే ఫోటోలు తీస్తారు.ఇది వాళ్ళ డ్యూటీ.అయితే వాళ్ళ డ్యూటీ వాళ్ళు సరిగ్గా చేశారని ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు.హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చెయ్యడమే కాకుండా పోలీసులు హెల్మెట్ పెట్టుకోమన్నందుకు దారుణానికి పాల్పడ్డాడు.మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

కర్ణాటక రాష్టం దావణగేరి కి చెందిన ఓ వ్యక్తి బైక్ నడుపుకుంటూ రోడ్డుపై వెళుతున్నాడు.అయితే అప్పటికే అక్కడ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వాహనాలను ఆపుతూ అందరి దగ్గర పేపర్స్ ఉన్నాయో లేదో చెక్ చేస్తున్నారు.అయితే ఈ వ్యక్తి అక్కడికి వచ్చిన తర్వాత అతని బండిని ఆపివేశారు.అతను హెల్మెట్ పెట్టుకోకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు అతన్ని నిలిపేశారు.బండి పేపర్స్ అడిగితే ఇచ్చారు.అన్ని పేపర్స్ సరిగ్గా ఉండడంతో అతన్ని ఏమి అనలేదు.అయితే హెల్మెట్ పెట్టుకోవలసిందిగా సూచించారు. కానీ అతను వినలేదు.నేను హెల్మెట్ పెట్టుకొను నాకు చిరాకు అని పోలీసులతో అన్నాడు.ఇంకొకసారి హెల్మెట్ లేకుండా కనిపిస్తే భారీ ఫైన్ వేస్తామని అన్నారు.ఆ మాటలకు అతనికి కోపం వచ్చింది. నన్నే హెల్మెట్ అడుగుతావా నాకే ఫైన్ వేస్తావా అంటూ వారిపై దాడికి తెగబడ్డాడు.ఇద్దరు పోలీసులకు చుక్కలు చూపించాడు.

ఆల్కహాల్ సేవించాడో లేదా అతనికి నిజంగానే బిపి ఎక్కువనో తెలియదు కానీ ఒక్కసారిగా ఇద్దరు ట్రాఫిక్ పోలీసుల మీద దాడి చెయ్యడానికి రెడీ అయ్యాడు.ఈ క్రమంలో పక్కనే ఉన్న రాళ్లతో పోలీసుల తలలు పగలగొట్టాడు. స్థానికులు కట్టడి చేస్తున్నా కూడా ఆగకుండా వారిపై దాడికి దిగాడు. ఈ ఘటనలో హెడ్ ​​కానిస్టేబుల్ నారాయణ్ రాజ్ , ఎఎస్ఐ అంజన్నలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.చూశారుగా మన మంచికోసమే కదా పోలీసులు చెప్పేది.కేవలం హెల్మెట్ పెట్టుకోమని చెప్పినందుకు ఇతను ఎంత దారుణానికి పాల్పడ్డాడో.