ఇండియాలో దెయ్యాలు ఉన్న భయంకరమైన ప్రదేశాలు ఇవే

113

మన ప్రపంచం లో చాలా వింతలు విశేషాలు ఉన్నాయి. అందరికి కొన్ని కలలు ఉంటాయి కనీసం ఒక్కసారైనా ప్రపంచం అంతా తిరిగి రావాలని కానీ డబ్బు వల్లనో సమయం లేకపోవడం వల్లనో మనం అన్ని చూడలేం , వింత ప్రదేశాలు అనగానే గుర్తొచ్చేవి ప్రపంచం లో ఏడూ వింతలుఈ వింతలు కాకుండా మన ప్రపంచంలో భయంకరమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి కొందరికి ఆ ప్రదేశాల పేర్లు చెప్పిన భయం వేస్తోంది. అలాంటి ప్రదేశాలు మన భారత దేశం లోను ఉన్నాయి .. ఆ ప్రదేశాలలో దెయ్యాలు భూతాలు తిరుగుతాయి అని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. నిజంగా దెయ్యాలు ఉన్నాయో లేవో మనకు తెలియదు కాని చాలా మంది ఆ ప్రదేశాలకు వెళ్లాలన్న ధైర్యం కూడా చేయరు. భారత దేశం లో చాలా ప్రదేశాలను దాని చరిత్ర మరియు కొన్ని సంఘటనల ఆధారంగా ఒక హంటెడ్ ప్రదేశంగా లెక్కిస్తారు. పారనార్మల్ నిపుణులు కూడా మన దేశంలో కొన్ని హాంటెడ్ ప్రదేశాలు ఉన్నాయని అంగీకరించారు.అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ క్రింద వీడియో చూడండి

  1. భాంగ్రా ఫోర్ట్… రాజస్థాన్…
    హంటెడ్ ప్రదేశం అనగానే రాజస్థాన్ ప్రజలకు వినిపించే పేరే భాంగ్రా ఫోర్ట్ .ఇది రాజస్థాన్ లోని ఆళ్వార్ జిల్లాలో ఉంది. భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలలో భాంగ్రా కోట ముందుంటది. ఈ కోట పైన చాలా రకాల కథలు ఉన్నాయి.ఈ కోట బయట ప్రవేశ ద్వారం వద్ద ఒక హెచ్చరిక బోర్డ్ కూడా ఉంటుంది.. మీరు గనుక ఇండియా లో హంటెడ్ ప్రదేశాలకి వెల్లలనుకుంటే భాంగ్రా కోటాని మిస్ కాకండి.
  2. డుమస్ బీచ్..గుజరాత్..
    బీచ్ అంటే సాగర తీరాన సేద తిరచ్చు అనుకుంటారు కానీ ఈ బీచ్ కి వెళ్తే మీ పని అంతే ఇక. ఈ వేడి పర్యాటక ప్రదేశం కూడా ఒక హంటెడ్ ప్రదేశమే. సాయంత్రం 6 తరువాత ప్రజలు ఈ బీచ్ ని సందర్శించడానికి లేదు.ఎందుకంటే ఈ బీచ్ లో అనేక మిస్సింగ్ కథలు ఉన్నాయి.హిందువులు ఈ బీచ్ ముందు భాగంలో మృతదేహాలను కల్చడానికి ఉపయోగిస్తారు. ఈ బీచ్ లో దాగి ఉన్న భయాంకర రహస్యం ఎంటో ఇంకా అంతు చిక్కకుండా ఉంది.
Related image
  1. డౌ హిల్స్.. వెస్ట్ బెంగాల్..
    పశ్చిమ బెంగాల్ లో కుర్సీయంగ్ దగ్గర ఉన్న పాఠశాల ఇది ఒక అడవిలో ఉంటుంది.ఈ ప్రదేశాన్ని అక్కడ హాంటెడ్ ప్రదేశంగా భావించబడుతుంది.చాలా మంది హత్యలు మరియు భయంకమైన అరుపులు శబ్దాలు వినిపిస్తాయట.
  2. సెయింట్ మార్స్ లో ఒక ఇల్లు..బెంగుళూర్…
    బెంగళూర్ లో ఉండే ప్రజలు సెయింట్ మార్స్ రోడ్డు వైపుకు వెళ్లాలంటేనే భయపడతారు. ఎందుకంటే అక్కడ ఒక ఇంట్లో దెయ్యం తిరుగుతుందని, దానిని చాలామంది చూశారని ఒక వార్త ఉంది. ఆ రోడ్డులో ఉన్న ఒక ఇంట్లో ఒక మహిళా హత్య జరిగింది. ఆ మహిళా దెయ్యం అయ్యి అక్కడే తిరుగుతుందని అక్కడి వారు చెబుతారు.
Related image
  1. ఢిల్లీ కంటోన్మెంట్..న్యూ ఢిల్లీ…
    ఇది ఢిల్లీలో అత్యంత్య భయంకరమైన ప్రదేశం. ఈ ప్రదేశంలో డార్క్ మరియు ఆకుపచ్చ అడవి వెంటాడుతుంది. చనిపోయిన అనేక మంది ఇక్కడ తెల్లచీర కట్టుకుని అటునుంచి వెళ్లే వాహనదారులను లిఫ్ట్ అడుగుతారు. ఒకవేళ లిఫ్ట్ ఇవ్వకపోతే ఆమె మిమ్మల్ని వేటాడుతుంది అని అక్కడివారు చెప్తున్నారు.

ఇవేకాకుండా పూణేలోని శని వర్వడా పోర్ట్, ఢిల్లీలోకి అగ్రసేన్ బావోలి, వెస్ట్ బెంగాల్ లోని అలియా గోస్ట్ లైట్స్, హైదరాబాద్ లో కూడా కొన్ని భయంకరప్రదేశాలు ఉన్నాయి. మరి ఈ ప్రదేశాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.