Breaking News: తన కార్ డ్రైవర్ తో కలిసి డ్రగ్స్ తో పట్టుబడిన టాప్ హీరోయిన్…..షాక్ లో సినీ ఇండస్ట్రీ

359

కొంతమంది సెలెబ్రిటీల జీవితం చెప్పుకునేంతలా ఏమి ఉండదు.తెరమీద మాత్రం హీరోల వేషాలు వేస్తారు బయటమాత్రం వాళ్ళు వేసే వేషాలు అన్నీఇన్నీ కావు.సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు నిజజీవితంలో చేసే కొన్ని పనులు వారి పరువుకు భంగం కలిగిస్తుంటాయి.ముఖ్యంగా డ్రగ్స్ లాంటివి తీసుకుని సమాజానికి తప్పుడు మెసేజ్ ఇస్తున్నారు. డ్రగ్స్ తీసుకుని కొందరు డ్రగ్స్ వ్యాపారం చేస్తూ కొందరు పోలీసులకు పట్టుబడుతున్నారు.ఇప్పుడు ఒక ప్రముఖ నటి ఈ విషయం మీదనే అరెస్ట్ అయ్యింది..మరి ఆమె ఎవరో ఎలా అరెస్ట్ అయ్యిందో తెలుసుకుందామా.

డ్రగ్స్ వ్యవహారంలో సినీ స్టార్లు గతంలో పట్టుబడిన సంఘటనలు చూశాం. కొందరు ఆయా కేసుల్లో అరెస్టయ్యారు. టాలీవుడ్లోనూ ఇలాంటివి చోటు చేసుకున్నాయి. తాజాగా మరోసారి డ్రగ్స్ వ్యవహారం సౌత్ సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. అశ్వథి బాబు అనే మలయాళ నటి డ్రగ్స్‌తో పట్టుబడింది. ఆమెను అరెస్ట్ చేసినట్లు తిక్కక్కరా పోలీసులు కన్ఫర్మ్ చేశారు. కొచ్చిలో ఆమె డ్రగ్స్ అమ్మడానికి కారులో రాగా పోలీసులకు దొరికిపోయినట్లు సమాచారం.

తన డ్రైవర్ బినయ్ అబ్రహంతో కలిసి అశ్విథి బాబు ఒక చోట కారులో వెయిట్ చేస్తుండగా అటుగా వచ్చిన పోలీసులు అనుమానం వచ్చి సోదాలు నిర్వహించారు. వారి వద్ద ఎండిఎంఏ అనే సింథటికర్ డ్రగ్ పట్టుబడింది. ఎండిఎంఏ డ్రగ్ లేట్ నైట్ పార్టీల్లో ఉపయోగిస్తారు. ఆదివారం రాత్రి అశ్వథి బాబు వాటిని కస్టమర్లకు అందించేలోపే పోలీసుల దృష్టిలోపడ్డారు. అశ్విథీ బాబు ఇంటి సమీపంలోనే పోలీసులు ఆమెతో పాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి అరెస్టును నమోదు చేయడంతో పాటు దీనికి వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే విషయమై దర్యాప్తు జరుపుతున్నారు. తిరువనంతపురంకు చెందిన అశ్విథీ బాబు మలయాళం ఇండస్ట్రీలో పలు సినిమాలతో పాటు, సిరియల్స్‌లో నటించారు. ఈమె పట్టుబట్టడం మలయాళం సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపింది.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.