సెట్ లో అందరిముందు అక్కడ పట్టుకున్నాడు.. నోరువిప్పిన స్టార్ హీరోయిన్

503

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ ఎదుర్కుంటున్న అతిపెద్ద సమస్య “మీటూ”. “నేను కూడా లైంగిక వేధింపులకు గురయ్యా” అంటూ ఇప్పటికే పలు ఫిల్మ్ ఇండస్ట్రీల నుంచి చాలా మంది హీరోయిన్స్ పలువురు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేస్తూ వచ్చారు. తాజాగా, “లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా” ఫేమ్ అహానా కుమ్రా కూడా తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి సంచలన నిజాలు బయటపెట్టారు. ఓ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో తనకు గతంలో ఎదురైన చేదు అనుభవాలను వివరించారు.మరి ఆమె చెప్పిన విషయాల గురించి పూర్తీగా తెలుసుకుందామా.

“మనకి నచ్చిన పని చేయడం కోసం ఇష్టం ఉన్నా లేకపోయినా కొంతమంది వ్యక్తులతో కలిసి పని చేయాల్సివస్తుంది. ఆ సమయంలో ఆత్మాభిమానం చంపేసుకుని బతకాలి. అప్పటివరకూ ఇలా ఉండాలి అని పెట్టుకున్న నియమాలు కూడా గాలికి ఎగిరిపోతాయి. షూటింగ్ ల్లో పాల్గొన్న ప్రతిసారీ ఆ హీరో ఎక్కడెక్కడో టచ్ చేసేవాడు. ఏంటి అని అడిగితే సినిమా నుంచి తొలగించి వేరే హీరోయిన్ ను పెట్టుకుంటాం అని బెదిరిస్తారు. అవకాశాల కోసం ఇంట్లో వాళ్ళను కాదని ఇంత దూరం వస్తే వచ్చిన అవకాశం పోతే మళ్ళీ పస్తులుండాలి. అలా కొన్ని విషయాల్లో రాజీపడిపోయి బతికా.నాకంటూ ఒక గుర్తింపు వచ్చే వరకూ ఈ ఇబ్బందులు తప్పవనుకున్నాను.ఒకానొక దశలో సూసైడ్ చేసుకుని చచ్చిపోదామనుకున్నా కానీ అమ్మా, నాన్నల కోసం ఆలోచించి ఆగిపోయాను. అలా ఐదేళ్ల పాటు నరకం అనుభవించాను. ఎవరైనా ఈ నరకం నుంచి బయటపడేస్తారేమో అని చూసా, కానీ ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా కామన్ అనేవారు. కొంతమంది హీరోయిన్స్ కూడా దీనికి సపోర్ట్ చేయడం పట్ల నాకు ఆశ్చర్యం వేసింది.

ఇలా ఒక హీరోనే కాదు, చాలా మంది తనను లైంగికంగా వేధించారు. ఈ లిస్ట్ లో డైరెక్టర్ సాజిద్ ఖాన్ ఉన్నాడు. గత ఏడాది సాజిద్ ఖాన్ నా పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడు.ఒకరోజు స్టోరీ డిస్కస్ చేయాలి అని అతని ఇంటికి పిలిచాడు. ఇంటికి వెళ్ళగా, ఒక చీకటి గదిలోకి తీసుకెళ్ళాడు. లైట్స్ వేయమని చెప్పాను, కానీ చీకటిలోనే బాగుటుంది అన్నాడు. నేను బయటకు వెళ్దాం అని చెప్పా. దానికి అతను “మా అమ్మకు డిస్టర్బెన్స్ ఎందుకు, ఇక్కడే విప్పి మాట్లాడుకుందాం” అంటూ డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడాడు. నాకు భయం వేసి వెళ్లిపోతా అని పైకి లేచా. వెంటనే అతను నా భుజాలను గట్టిగా పట్టుకుని కూర్చోపెట్టాడు. ఏవేవో పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేశాడు. తర్వాత “100 కోట్లు ఇస్తాను, నా పెంపుడు కుక్కతో సెక్స్ చేస్తావా?” అని అడిగాడు. నేను వెంటనే సీరియస్ అయ్యా. వెంటనే నన్ను నవ్వించేందుకు జోకులు వేశాడు, ఆ తర్వాత సెక్స్ జోకులు చెప్పి నన్ను అనుభవించాలని చూశాడు.అప్ప‌టికీ త‌న‌కు లొంగకపోవడంతో నా సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని చెప్పి మభ్యపెట్టేందుకు ప్రయత్నించాడు. అతని ప్రవర్తనతో విసిగిపోయాను. ఇంటికెళ్ళనిచ్చేవాడు కాదు, చాలా ఇబ్బంది పెట్టాడు. ఆ ఒక్కరోజు ఎంతో నరకం చూశాను. ఆ ఘటన నుంచి ఎలా బయటపడ్డానో తలచుకుంటే భయమేస్తుంది” అంటూ తాను పడిన నరకం గురించి వివరించారు.