Breaking News:స్టార్ డైరెక్టర్ మృతి..శోకసంద్రంలో చిత్ర పరిశ్రమ

415

ప్రముఖుల ఇళ్లలో వరుసగా విషాద ఛాయలు అలుముకుంటున్నాయి.రోడ్డు ప్రమాదాల వలన కొందరు, అనారోగ్యం వలన కొందరు చనిపోతే కొందరు ఏమో వివిధ కారణాల వలన ఆత్మహత్య చేసుకున్నవారు ఉన్నారు. సినిమా నటీనటులు కూడా ఇలా దుర్మరణం చెందుతున్నారు.మొన్నటికి మొన్న కన్నడ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ అంబరీష్ మరణం అందరికి కలచివేసింది.ఒక్క కన్నడ ఇండస్ట్రీలోనే కాదు మొత్తం దక్షిణాది ఇండస్ట్రీనే షాక్ అయ్యింది.ఆ విషాదం నుంచి కన్నడ సినిమా ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే బయటపడుతుంది.అయితే ఇంతలోనే కన్నడ ఇండస్ట్రీలో మరొక విషాదం నెలకొంది.మరొక ప్రముఖ వ్యక్తి చనిపోయాడు.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

ప్రముఖ నటుడు, సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న అంబరీష్ మరణం నుంచి కన్నడ సినీ పరిశ్రమ తేరుకోక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. కన్నడ ఫిల్మ్ మేకర్ ఏఆర్ బాబు మంగళవారం ఉదయం కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆయన మరణించిట్లు తెలుస్తోంది. కిడ్నీ సంబంధిత సమస్యతో బాధ పడుతున్న ఏఆర్ బాబు ఏఆర్ బాబు గత ఆరేళ్లుగా… ప్రతి ఆరు నెలలకు ఒక సారి డయాలసిస్ చేయించుకుంటున్నారు. సోమవారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను అపోలో ఆసుపత్రికి తరలించగా మంగళవారం ఉదయం కన్నుమూశారు.04-01-1962 న ఆయన ప్రసిద్ధ సంగీత దర్శకుడు హమ్సలేఖకు అభిమాన దర్శకుడు అయిన బాబు, సినిమాటోగ్రఫీలో అనేక మంచి చిత్రాలను ఇచ్చాడు.

56 ఏళ్ల ఏఆర్ బాబు… హలో యమా, సప్నోంకి రాణి, కూలీ రాజా, ఖలనాయకా, మరుజన్మ, యార్దు దుడ్డు యల్లమనా జాత్రె లాంటి పాపులర్ కన్నడ చిత్రాలకు దర్శకత్వం వహించారు. చరణ్ రాజ్, చార్లత, 1998 లో ధీరేంద్ర గోపాల్ ప్రధాన పాత్రలో నటించిన చోర్ గురు చందల్ షిషి దర్శకత్వం వహించిన తొలి చిత్రం, ఇది 2015 లో విడుదలైన సాప్నోకి రాణిచే చివరి చిత్రం.ఎంతో మంది కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మంగళవారం సాయంత్రం ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఏఆర్ బాబు అంత్యక్రియలు బెంగులూరులోని బాపూజీ నగర్లో జరుగనున్నాయి.