టాలీవుడ్ నిర్మాత ఇంట్లో విషాదం షాక్ లో ప్రభాస్

348

టాలీవుడ్ నిర్మాత, ఆదిత్యరామ్ స్టూడియోస్ అధినేత ఆదిత్యరామ్‌ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆదిత్యరామ్ తల్లి లక్ష్మి కన్నుమూశారు. చెన్నైలో లక్ష్మి తుదిశ్వాస విడిచారని సమాచారం. లక్ష్మి అంత్యక్రియలు చెన్నైలోని ఆదిత్యరామ్‌ నగర్‌లో ఆదివారం (నవంబర్ 11వ తేదీ) నిర్వహించనున్నారు.

‘సందడే సందడి’, ‘ఖుషి ఖుషీగా’, ‘స్వాగతం’, ‘ఏక్‌ నిరంజన్‌’ సినిమాలకు ఆదిత్యరామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆదిత్యరామ్‌ నిర్మాతగా వ్యవహరించారు. లక్ష్మి మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. నిర్మాత ఆదిత్యరామ్‌కు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.