నేటి నుంచి తెలంగాణకు భారీ వర్షలు

203

జూన్,జులై మాసాలు దాటిపోతున్నా.. రాష్ట్రంలో ఇప్పటికీ సరైన వర్షాపాతం నమోదు కాలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. చాలాచోట్ల దుక్కులు దున్నిన రైతులు వర్షం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో రిజర్వాయర్లు,కాల్వలు,బావుల్లో చుక్క నీరు లేదు. సాధారణ వర్షపాతం కంటే కూడా ఈసారి తక్కువ వర్షాపాతం నమోదు కావడంతో భవిష్యత్‌పై రైతులు బెంగతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి కాస్త ఉపశమనం కలిగించేలా వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.

Related image

బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రానున్న 2, 3 రోజుల్లో ఒడిశా తీరంలో అల్పపీడనానికి అవకాశాలున్నట్లు తెలుస్తుంది. తెలంగాణపై నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున వర్షాలు భారీగా కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మొత్తం 102 ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు తేలికపాటి వర్షాలు కురిశాయి. భద్రాచలంలో సాధారణం కన్నా 5.8 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది.తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కరుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నందున వర్షాలు కురిసేందుకు అనువైన వాతావరణం ఉందని పేర్కొంది.

Related image

బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని కారణంగా రెండు మూడు రోజుల్లో ఒడిశా తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినా ఇంకా సరైన వర్షాలు కురవడం లేదు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదైంది. నైరుతి రుతు పవనాలు కూడా చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉన్నట్టు తెలిపింది. బుధవారం ఉదయం నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. భారీ వర్షాలు కురవాలని రాష్ట్ర రైతాంగం కోరుకుంటోంది.

ఈ క్రింది వీడియో ని చూడండి

జులై ప్రాంతంలోనూ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి కొనసాగుతోంది. అప్పుడప్పుడూ వర్షాలు కురుస్తున్నా చెరువులు, జలాశయాలు నిండంటం లేదు. దీని కారణంగా ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. బుధవారం తెలంగాణలోని 102 ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసినట్లు వాతావరణశాఖ తెలిపింది. సరైన వర్షాలు లేకపోవడంతో చాలాచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. బుధవారం భద్రాచలంలో 5.8డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణ లో భారీ వర్షాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..