భారీగా తగ్గిన బంగారం ధర

218

ఓ పక్క ఆషాడం సేల్ జరుగుతోంది మార్కెట్లో, మరో పక్క 15 రోజుల్లో శ్రావణం వస్తుంది . దీంతో పూజలు కోసం బంగారం వస్త్రాలను ఎక్కువగా ప్రజలు కొనుగోలు చేస్తారు.. అందుకే బంగారం ధర ఈ సమయంలో తగ్గుతుంది కాని ఈసారి బంగారం శ్రావణం మాసం రాకుండానే మార్కెట్ లో పెరిగింది కేంద్రం విధించిన పన్నులు కూడా దీనికి కారణం అయ్యాయి కాని తాజాగా మాత్రం ఆషాడంలో బంగారం ధర మార్కెట్లో తగ్గుముఖం పట్టింది.

ఈ క్రింది వీడియో ని చూడండి

పసిడి ధర పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో ఆదివారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.240 తగ్గుదలతో రూ.36,420కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడం ధరపై ప్రతికూల ప్రభావం చూపింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.240 తగ్గుదలతో రూ.33,450కు దిగొచ్చింది. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం దాదాపుగా స్థిరంగానే కొనసాగింది. కేజీ వెండి ధర కేవలం రూ.2 తగ్గుదలతో రూ.41,160కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.

Image result for gold

గ్లోబల్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్కు 0.13 శాతం క్షీణతతో 1,426.30 డాలర్లకు తగ్గింది. అదేసమయంలో వెండి ధర మాత్రం ఔన్స్కు 0.20 శాతం పెరుగుదలతో 16.23 డాలర్లకు చేరింది. ఢిల్లీ మార్కెట్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గుదలతో రూ.35,350కు క్షీణించింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.250 క్షీణతతో రూ.34,150కు తగ్గింది. ఇక కేజీ వెండి ధర కేవలం రూ.2 తగ్గుదలతో రూ.41,160కు క్షీణించింది. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.