కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కాటేశాడు..!ఒకరిని కాదు ఇద్దరినీ కాదు ఏకంగా 150 మంది…ఛీ..ఛీ

545

సమాజంలో స్త్రీలను ప్రశాంతంగా ఉండనిచ్చేటట్టు లేరు కొంతమంది మగాళ్లు.ఆడపిల్లగా ఎందుకు పుట్టాం అని ఆడపిల్లలు భయపడే స్థితికి వచ్చేశారు.ఎందుకంటే వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు అలా ఉన్నాయి మరి.ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి.వారిని లైంగికంగా వేధించేవాళ్ళు అడుగడుగునా ఉన్నారు.స్త్రీ బయట అడుగుపెట్టాలంటేనే ఒంటరిగా వెళ్లాలంటేనే భయపడే స్థితికి వచ్చింది పరిస్థితి.కొందరు అయితే అభంశుభం తెలియని చిన్నారుల మీద తమ ప్రతాపాన్ని చూపుతున్నారు.ఇప్పుడు ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.కంటికి రెప్ప‌లా కాపాడాల్సిన వాడే కాటేశాడు. ప‌శువులా ప్ర‌వ‌ర్తించాడు. కన్నూ మిన్నూ కాన‌కుండా మ‌న‌వ‌రాలి వ‌య‌స్సున్న బాలిక‌పై క‌న్నేశాడు. ఒక‌రా.. ఇద్ద‌రా..150 మందిని ఎన్నో విధాలుగా వేధించాడు.మరి ఆ కామకుక్క గురించి పూర్తీగా తెలుసుకుందామా.

తిరుపతి బాలికల వసతి గృహంకు సూపరింటెండెంట్ పనిచేస్తున్నాడు నందగోపాల్.ఇతను స‌ద‌న్‌ను త‌న ఇష్టారాజ్యంగా మార్చుకున్నాడు. దీంతో ఆడిందే ఆటా పాడిందే పాట‌లా మారింది. ప్రైవేటు ఆర్మీని ఏర్పాటు చేసుకుని స‌ద‌న్‌లో ఉండే అనాధ బాలిక‌ల‌పై అఘాయిత్యాల‌కు తెగ‌బ‌డ్డాడు. అనాధ బిడ్డ‌ల‌ను అక్కున చేర్చుకుని ఆప‌న్న‌హ‌స్తం అందించాల్సిన సూప‌రింటెండెంట్ కామ‌పిశాచిగా మారిపోయారు.ప‌దేళ్లుగా ఎలాంటి బ‌దిలీలు లేకుండా తిరుప‌తిలోనే తిష్ట వేసిన 58 ఏళ్ల నంద‌గోపాల్ బాలిక‌ల స‌ద‌న్‌లో ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకుని తన కోర్కెలు తీర్చుకునేందుకు అభం శుభం ఎరుగ‌ని అమాయ‌కుల్ని కాటేస్తున్నాడు. రాజ‌కీయ ప‌లుకుబ‌డిని ఉప‌యోగించుకుని పై నుంచి కింది స్థాయి వ‌ర‌కు ఎవ‌రినైనా మేనేజ్ చేస్తున్నాడు. ఈ కామాంధుడి లీల‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. త‌ల్లిదండ్రులు లేని అనాధ‌ల‌ను కాపాడాల్సిన పెద్ద దిక్కే వారి పాలిట రాక్ష‌సుడిలా త‌యార‌య్యాడు. సాక్ష్యాత్తు క‌డ‌ప జిల్లా క‌లెక్ట‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మైన‌ర్‌పై లైంగిక దాడి కేసు విచార‌ణ సాగుతుందంటేనే అస‌లు మొత్తం కేసు వ్య‌వ‌హారం ఎలాంటి మ‌లుపులు తీసుకుంటో అర్థం చేసుకోవ‌చ్చు.

ఎన్నో క‌ష్టాల‌తో ప్రాణాల‌ను అర‌చేతిలో పెట్టుకుని క‌డ‌ప జిల్లా నుంచి తిరుప‌తి స‌ద‌న్‌కు వచ్చిన ఒక అనాధ బాలిక‌పై నంద‌గోపాల్‌ బాలిక‌ల వ‌స‌తి గృహంలో అత్యాచారారానికి పాల్ప‌డ‌ట‌మే కాక నోరు తెరిస్తే చంపేస్తానంటూ బెదిరింపుల‌కు దిగాడు. కీచ‌కుడి చేతిలో బలైన బాలిక గ‌ర్భం దాల్చిన విష‌యం వెలుగులోకి రావడంతో నంద గోపాల్ అకృత్యాలు ఆల‌స్యంగా వెలుగు చూశాయి. త‌మ‌కు సూప‌రింటెండెంట్ నుంచి ర‌క్ష‌ణ కావాలంటూ స‌ద‌న్‌లో ఉన్న బాలిక‌లు మొర‌పెట్టుకుంటున్నారు. ప్ర‌భుత్వం స్పందించే వ‌ర‌కు ఆందోళ‌న ఆప‌ము అని అంటున్నారు బాలిక‌లు. దీంతో నందగోపాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 150 మంది అమ్మాయిలున్న హాస్టల్ కు మహిళా అధికార్లను నియమించకుండా ఎందుకు సదరు డిపార్ట్ మెంట్, ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని మహిళా సంఘాలు నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం మహిళా ఉద్యోగులను నియమిస్తే వారిని టార్చర్ పెట్టి బయటకు పంపేవాడని కూడా సదరు మహిళా నేతలు ఆరోపిస్తున్నారు.మ‌రో ప‌క్క సూప‌రింటెండెంట్ ఆకృత్యాల‌పై అధికారులు విచార‌ణ‌కు ఆదేశించారు. చూశారుగా ఈ సూపరిండెంట్ ఎంత పని చేశాడో.మనువరాలి వయసున్న ఆడపిల్లలను ఎలా వేదించాడో.