రూమ్ బుక్ చేశాను అక్క‌డ‌కు వ‌చ్చెయ్ అమ్మాయి ఏం చేసిందో తెలిస్తే షాక.

453

స్వామి సేవ‌లో ఉద్యోగిగా విధులు చేస్తాడు అంటే ఓ యువ‌తితో రాస‌లీల‌ల‌కు ప్లాన్ చేశాడు ఓ కీచ‌క పోలీసు ఆఫీస‌ర్.. ఇప్పుడు ఈ విష‌యం పెద్ద దుమారం లేపింది, ప్ర‌జా స‌మ‌స్య‌లు తీర్చాల్సిన ఈ ఖాకీ ఓ మ‌హిళ‌పై క‌న్నేశాడు, ఆమె ప్రాబ్లం తీరుస్తాను అని చెప్పి ట్రాప్ లోకి దింపాడు..తిరుమలలో విధులు నిర్వహిస్తున్న సీఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో అతనిని సస్పెండ్ చేశారు. సదరు సీఐ పేరు సిద్ధతేజామూర్తి. చిత్తూరు జిల్లా వాల్మికీపురం సీఐగా ఏప్రిల్ నెలలో బాధ్యతలు చేపట్టారు. ఆగస్ట్ 10వ తేదీన పీలేరు సర్కిల్‌కు ఇన్స్‌పెక్టర్ లేకపోవడంతో అక్కడ ఇంచార్జిగా విధులు నిర్వర్తించారు.

Image result for police

ఈ సమయంలో పీలేరుకు చెందిన ఓ భార్యాభర్తల మధ్య గొడవలు ఆయన వరకు వచ్చాయి. బాధిత మహిళ భర్తపై ఫిర్యాదు చేశారు. అప్పటి ఆ బాధిత మహిళ నెంబర్ సీఐ సిద్ధతేజామూర్తి వద్ద ఉంది. తన నెంబర్‌కు అసభ్యకర సందేశాలు పంపిస్తూ, అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నారని బాధితురాలు తాజాగా ఫిర్యాదు చేశారు.ఈ మ‌ధ్య ఫోన్ చేసి తిరుమల కొండపై తనకు రూం బుక్ చేశానని చెప్పాడని, రూం నెంబర్ కూడా చెప్పాడని, తనను రమ్మని పిలిచాడని, మరుసటి రోజు తెల్లవారున తనకు ఫోన్ చేసి ఎందుకు రాలేదని అడిగాడని బాధితురాలు తెలియ‌చేసింది. అతను తనతో వల్గర్‌గా మాట్లాడిన సందేశాలు, అసభ్యకరంగా పంపిన సందేశాలు ఉన్నాయని తెలిపింది. అతనికి రాజకీయంగా కూడా మద్దతు ఉన్నట్లు కనిపిస్తోందని, తనకు బెదిరింపులు కూడా వస్తున్నాయన్నారు.

Image result for police

తన భార్య ఊరికి వెళ్తుందని, తనను గదికి రమ్మని చెప్పాడని, తాను డ్యూటీలో ఉన్నప్పటికీ అప్పుడప్పుడు వచ్చి వెళ్తానని చెప్పాడని బాధితురాలు పోలీసు ఉన్న‌తాధికారుల‌కు తెలియ‌చేసింది. సీఐ తనతో మాట్లాడుతుండగా బాధితురాలు దానిని రికార్డ్ చేశారు. న్యాయం కోసం గతంలో స్టేషన్‌కు వెళ్లిన ఆ మహిళను ట్రాప్ చేసే ప్రయత్నం చేశాడు. దీనిపై విచారణ జరిపిన కర్నూలు రేంజ్ డీఐజీ అతనిని సస్పెండ్ చేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

రెండు రోజుల కిందట అతను ఫోన్ చేసి తనను రమ్మని చెప్పాడని, నందకం రెస్ట్ హౌస్‌లో గదిని బుక్ చేశానని చెప్పాడని బాధితురాలు ఆరోపించారు. ఆమె మహిళా సంఘాలతో కలిసి తిరుపతి అర్బన్ ఎస్పీని కలిసే ప్రయత్నం చేశారు. అంతేకాదు, మహిళా సంఘాలతో కలిసి సీఐని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అతను తప్పించుకున్నారని చెబుతున్నారు. ఇక తెలివిగా ఈకేసు నుంచి త‌ప్పించుకుందాము అనుకున్నా ఈ ఖాకీకి ఉన్న‌తాధికారులు త‌మ స్టైల్లో విచార‌ణ చేశారు ఆ వాయిస్ కాల్ రికార్డులు మెసేజ్ లు అత‌ని నెంబ‌ర్ నుంచి వ‌చ్చాయి అని గుర్తించి అత‌నికి అదుపులోకి తీసుకున్నారు, చూశారుగా ఇలాంటి ఆఫీస‌ర్ల‌పై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవాలి అనేది కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.