ప్రపంచంలో వింత శిశువు…చూసి షాక్ అయిన డాక్టర్స్

309

ఈ మధ్య మనం విచిత్రమైన విషయాల గురించి వింటున్నాం.సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగిన అది ప్రపంచం మొత్తం పాకుతుంది.మొన్నామధ్య మేక కడుపునా పంది పుట్టిందని వార్త వచ్చింది.అలాగే గేదె కడుపున కుక్క పుట్టిందని విన్నాం.ఇలాంటి రకరకాల జననాల గురించి విన్నాం.అయితే ఇప్పుడు మరొక అలాంటి జననమే జరిగింది.ఒక మహిళా కడుపునా ఒక వింతైన శిశువు జన్మించింది.మరి ఆ శిశువు ఎలాంటి ఆకారంలో పుట్టిందో తెలుసుకుందామా.

నిత్యం వింత వింత విషయాలు బయటకు వస్తున్నాయి.నమ్మశక్యం కానీ నిజాలు విస్మయం కలిగిస్తున్నాయి.ఛత్తీస్‌గఢ్‌లో వింత శిశువు జన్మించింది.పూర్తి వివరాల్లోకి వెళితే…. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలోని తఖత్‌పూర్ పరిధిలోని దౌజా గ్రామంలో నివసించే శివకుమార్ సాహూ అనే వ్యక్తి భార్య నిండు గర్బీని.తమ ఇంటికి బాబో పాపనో వస్తుందన్న ఆనందం వాళ్ళు ఉంది.కానీ దేవుడు వాళ్ళ మీద కక్ష్య కట్టాడు.ఏం పాపం చేశారో ఏమో తెలీదు కానీ వారిని మాత్రం షోక సంద్రంలోకి నెట్టాడు. శుక్రవారం రాత్రి ఆమెకు సడెన్ గా నొప్పులు రావడంతో ధౌజా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.ఆమె కడుపులోని బిడ్డను బయటకు తీయడానికి డాక్టర్స్ 2 గంటలు కష్టపడ్డారు.అయితే బిడ్డను బయటకు తీశామన్న సంతోషం ఆ డాక్టర్స్ ఎక్కువసేపు లేదు కారణం ఆ పుట్టిన బిడ్డ వింతగా పుట్టడం.

మూడు చేతులతో ఒక ఆడ శిశువు జన్మించింది.శిశువు మూడు చేతులతో పుట్టడంతో అందరూ ఆశ్యర్యపోయారు.ఆ మూడో చెయ్యి ఒక చేతికి అతుక్కుని ఉంది. దీంతో ఇంట్లోనివారు భయపడిపోయి విషయాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలికి తెలిపారు. ఆమె ఆ శిశువును పరిశీలించి చిన్నారి ఆరోగ్యంగానే ఉందని తెలిపారు.మీరు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని డాక్టర్స్ ఆ కుటుంబ సభ్యులకు దైర్యం ఇచ్చారు. ఈ వార్త అంతటా పాకిపోవడంతో ఈ చిన్నారిని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. కొంతమంది ఆ చిన్నారిని అమ్మవారి ప్రతిరూపంగా భావించి పూజలు కూడా చేస్తున్నారు.