లావోస్ లో జలసునామి కొట్టుకుపోయిన వేలాది మంది కారణం వింటే షాకవుతారు..

576

లావోస్ లో జ‌ల‌సునామి అక్క‌డ వారిని ఆశ్ర‌యం లేకుండా చేసింది.. వారికి ఘోర విషాదం మిగిల్చింది. జలరాకాసి దాటికి ఊళ్లకు ఊళ్లే క్షణాల్లో కొట్టుకుపోయాయి. వందలాది ప్రాణాలు.. గల్లంతయ్యాయి. ఈ దారుణం ఆగ్నేయ లావోస్‌లో జ‌రిగింది… ఈశాన్య లావోస్‌లో నిర్మాణంలో ఉన్న జలవిద్యుత్తు ఆనకట్ట రాత్రి 8 గంటల ప్రాంతంలో కుప్పకూలడంతో ఆరు గ్రామాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దాదాపు ఐదు బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీరు ఒక్కసారిగా గ్రామాలపైకి ఉరకడంతో.వందల మంది గల్లంతయ్యారు. ఈ ప్ర‌మాదంలో వంద‌ల‌మంది మ‌ర‌ణించి ఉంటారు అని అంటున్నారు అధికారులు.

Image result for laos
అటపూ ప్రావిన్స్‌లోని సనమ్‌షే జిల్లాలో ఉన్న ఈ ఆనకట్ట నుంచి ప్ర‌వాహంలా వ‌చ్చిన నీరు 20లక్షల ఒలింపిక్‌ ఈతకొలనుల నీటితో సమానంగా చెప్ప‌వ‌చ్చు…ఉరుము లేని పిడుగులా వచ్చి పడిన ఈ జల సునామితో చాలా ఇళ్లు కొట్టుకుపోయాయి. పలు ఇళ్లు మునిగిపోయాయి. దాదాపు 6,600 మంది నిరాశ్రయులయ్యారు. ప్రజలు ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఇళ్ల పైకప్పులపైకి చేరారు… కొంద‌రు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడానికి నాటుపడవలపైకి ఎక్కి ప్ర‌యాణించారు…

Image result for laos
ఇక్క‌డ అధికారులు సహాయ కార్యక్రమాల పర్యవేక్షణ చేస్తున్నారు..షె పియాన్‌-షె నామ్‌నాయ్‌ ఆనకట్ట కుప్పకూలడానికి కారణాలు తెలుసుకుటున్నారు…ఈ ఆనకట్ట నిర్మాణం 2013లో మొదలయింది. ఈ ప్రాజెక్టు వ్యయం దాదాపు .8వేల కోట్ల రూపాయ‌లు. వచ్చే ఏడాది నుంచి విద్యుత్తు సరఫరా ప్రారంభం కావాల్సి ఉంది. దీని సామర్థ్యం 410 మెగావాట్లు. ఈ ప్రాజెక్టులో భాగంగా షె పియాన్‌, షె నామ్‌నాయ్‌, హువాయ్‌ మెక్షాన్‌ నదులపై పలు ఆనకట్టలు నిర్మించారు… ఈ కర్మాగారం నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్తులో 90 శాతం థాయ్‌లాండ్‌ అవసరాలకు ఉద్దేశించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మెకాంగ్‌ నది, దాని ఉపనదులు, ఇతర నదుల వల్ల జలసిరితో కళకళలాడుతుంది లావోస్.. ఇప్పుడు ఈ ప్ర‌మాదంతో అక్క‌డ ప్ర‌జ‌లు కన్నీరు మున్నీరు అవుతున్నారు భారీగా నీరు ఉప్పొంగి రావ‌డంతో కొట్టుకుపోయిన వారి ఆచూకి కోసం గాలిస్తున్నారు పెద్ద ఎత్తున వారి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టింది ప్ర‌భుత్వం.. నిర్మాణంలో త‌లెత్తిన లోపం వ‌ల్లే ఇటువంటి ప్ర‌మాదం జ‌రిగి ఉంటుంది అని చెబుతున్నారు అధికారులు..పదులకొద్దీ నిర్మిస్తున్న జలవిద్యుత్తు ప్రాజెక్టులపై పర్యావరణ సంస్థలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాయి…మ‌రి దీనిపై వేసే క‌మిటీ తేల్చాలి ఈ ప్ర‌మాదానికి కార‌ణం ఏమిటి అనేది.