హిజ్రాతో పెళ్లి.. అందరు ఒప్పుకున్నారు.. ఇంకొక గంటలో పెళ్లి అనగా పంతులు ఏం చేశారో తెలిస్తే షాక్..

414

సమాజములో పుట్టిన ప్రతి ఒక్కరికి కొన్ని కలలు ఉంటాయి.ముఖ్యంగా పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో జీవితాంతం సుఖంగా ఉండాలని ఉంటుంది.మగ పుట్టుక పుట్టిన ఆడ పుట్టుక పుట్టిన ఈ కోరిక ఉంటుంది.వీళ్లకు ఉన్నట్టే హిజ్రాలకు కూడా ఉంటుంది.అయితే వారిని పెళ్లి చేసుకోడానికి సమాజం ఒప్పుకోదు.కొందరు మంచి వ్యక్తులు దైర్యం చేసి ముందడుగు వేస్తే తప్పా హిజ్రాలకు పెళ్లి అవ్వదు.అలా ధైర్యంతో ఒక హిజ్రాను పెళ్లి చేసుకోడానికి ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు.ఇరు కుటుంబ సభ్యులు కూడా వీరి పెళ్లికి ఒప్పుకున్నారు.అయితే ఇక్కడ ఆలయ అధికారులు చేసిన పనియే అందరి చేత ఛీ అని అనిపించుకునేలా ఉంది.మరి ఏమైందో పూర్తీగా తెలుసుకుందామా.

మదురైలోని ట్యూటికోరిన్ తలముత్తు నగర్‌కు చెందిన అరుణ్ కుమార్(22) రైల్వేశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగి. మదురైలోని ఓ ప్రైవేట్ కాలేజీలో శ్రీజ అనే అమ్మాయి బీఏ ఫస్టియర్ స్టూడెంట్. అరుణ్, శ్రీజ కు ఏడాదిన్నర కిందట పరిచయం ఏర్పడింది.వీరి పరిచయం ఆపై ప్రేమగా మారింది. శ్రీజ లింగమార్పిడి ద్వారా యువతిగా మారడం గమనార్హం. అయినా ఆమె మనసే తనకు ముఖ్యమంటూ ఆమెను ప్రేమించాడు.ఆ తర్వాత ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలనుకున్నారు.ఇంట్లో చెప్తే వద్దని అని అన్నారు.అయినా సరే పెట్టుబడి తన పేరెంట్స్‌ను పెళ్లికి ఒప్పించాడు అరుణ్. శ్రీజను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు సైతం కూతురి మనసును అర్థం చేసుకున్నారు. బగంప్రియల్ ఉదనురై శంకర రామేశ్వర శివాలయం అధికారులను 10 రోజుల ముందుగానే కలుసుకుని అరుణ్, శ్రీజలకు వివాహం జరిపించాలని కోరారు. శ్రీజ ట్రాన్స్‌జెండర్ అని ముందుగానే వారికి చెప్పారు.వాళ్ళు ముహూర్తం ఫిక్స్ చేశారు.అక్టోబర్ 31 వ తేదీన ముహూర్తం పెట్టారు.

అయితే బుధవారం కొన్ని గంటల్లో పెళ్లనగా పండితులు షాక్ ఇచ్చారు. తాము ఈ కార్యక్రమం నిర్వహించలేమని ఆలయం అధికారులు చెప్పేసరికి షాక్ కు గురికావడం ఇరు కుటుంబాల వంతైంది.అమ్మాయి ట్రాన్స్ జెండర్ అని పెళ్లి చేసేది లేదని తేల్చి చెప్పారు. కలెక్టరేట్ సమీపంలోని హిందూ రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ఎండోమెంట్స్ (హెచ్‌ఆర్ అండ్ సీఈ) అధికారులను ఆశ్రయించారు. జరిగిన విషయం చెప్పి అధికారుల నుంచి పెళ్లికి అనుమతి తీసుకున్నారు. అనుకున్న సమయానికే బుధవారం ఉదయం దాదాపు 10 గంటలకు అరుణ్, శ్రీజల వివాహం వైభవంగా జరిగింది.ఇలా ఈ ప్రేమ జంట ఒక్కటైంది.చూశారుగా ఈ ప్రేమ జంట పెళ్ళికి ఎన్ని అవాంతరాలు వచ్చాయో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.