మీ పార్టనర్ మరొకరితో సంబంధం పెట్టుకున్నాడో లేదో ఈ విధంగా తెలుసుకోవచ్చు…

777

ఒక అమ్మాయితో ఒక అబ్బాయి సంబంధం కొనసాగిస్తున్నప్పుడుగానీ లేదంటే భార్యాభర్తల మధ్యగానీ ఎప్పుడూ కొన్ని రకాల సందేహాలు తలెత్తుతుంటాయి. నన్ను నా పార్టనర్ మోసం చేస్తున్నారా లేదా నాతో నమ్మకంగా ఉంటున్నారా అని. ప్రేమ బంధంలోనైనా, వైవాహిక బంధంలోనైనా ఇలాంటి అనుమానాలు తలెత్తడం సహజమే. అయితే మీ పార్టనర్ ఇతరులతో సంబంధం పెట్టుకున్నాడో లేదో వాళ్ళు చేసే కొన్ని పనుల వలన తెలుసుకోవచ్చు. మరి ఎలా తెలుసుకోవచ్చో తెలుసుకుందామా.

Image result for wife and husband

మీరు ప్రేమించే అబ్బాయిగానీ అమ్మాయిగానీ మీపై ప్రేమ చూపకుండా మరో రకంగా మీతో సుఖం పొందాలని చూస్తుంటే మాత్రం కాస్త అనుమానించాల్సిందే. కొందరు కేవలం సెక్స్, ఫిజికల్ రిలేషన్ షిప్ కోసమే సంబంధాలు కొనసాగిస్తుంటారు. ఎలాంటి ప్రేమ చూపకుండా కేవలం అదొక్కటి ఉంటే చాలు అనుకుంటారు. మీతో మొదట డేటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీ పార్టనర్ మీ కోసం రకరకాల గిఫ్ట్స్ లాంటివి కొనిపెట్టి ఉంటారు. మీకోసం చాలా డబ్బు ఖర్చు చేసి ఉండొచ్చు. రెస్టారెంట్స్ కు వెళ్లడం డిన్నర్లు చేయడం, ట్రిప్స్ కు వెళ్లడం ఇలా చాలా చేసి ఉంటారు.ఇప్పుడు మరో ఒకరితో మీ పార్టనర్ సంబంధం కొనసాగిస్తున్నాడని మీకు డౌట్ వస్తే వెంటనే క్రెడిట్, డెబిట్ కార్డ్ బిల్లలు చూడండి. ఒకవేళ అలాంటిదేమన్నా ఉంటే ఈజీగా బయటపడుతుంది. ఎందుకంటే మీకు ఖర్చు పెట్టినట్లే మరొకరికి ఖర్చు పెట్టే అవకాశం ఉంది.మీ పార్టనర్ పై మీకు అనుమానం వస్తే మొదట మీరు చెయ్యాల్సిన పని మీ పార్టనర్ కోలీగ్స్ ని కలవడం. దాదాపు 50 శాతం మంది వాళ్లు పని చేసే చోట ఎవరితోనో ఒకరితో సంబంధం పెట్టుకునే అవకాశం ఉంది. అందువల్ల మీరు ఒక్కసారి మీ పార్టనర్ కొలీగ్స్ ను కలిసి మాట్లాడండి. అసలు విషయం బయటపడుతుంది.

మీ పార్టనర్ ఎప్పుడూ ఫోన్ లోనే బిజీగా ఉంటే కూడా కాస్త అనుమానించాల్సిందే. అలాగే ఫోన్ ను ఫుల్ సెక్యూరిటీగా పెట్టుకుంటే కూడా డౌట్ పడాల్సిందే. ఫోన్ కు మొత్తం పాస్ వర్డ్స్ పెట్టుకుని వాటిని మీకు చెప్పడం లేదంటే మరొకరితో సంబంధాన్ని కొనసాగిస్తున్నారనుకోవొచ్చు. మీకు పార్టనర్ విషయంలో అనుమానం కలిగితే వెంటనే మీరు నమ్మిన మూడో వ్యక్తి అభిప్రాయం తీసుకోండి. నేను అతనితో సంబంధాన్ని కొనసాగించాలా లేదంటే ఆపేయని అని అడిగి నిర్ణయం తీసుకోండి.మీ పార్టనర్ మీతో సఖ్యంగా లేరని వెంటనే ఒక నిర్ణయం తీసేసుకోండి. మొదట ఇతర సంబంధాలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీయండి. అలాకాకుండా వాదనకు దిగి బంధాన్ని తెంచుకోకండి. కన్ఫర్మేషన్ అయిన తర్వాతే ఏదైనా మాట్లాడండి. ముందే నోరు జారకండి.ఇక మీరు నిర్ధారించుకున్న తర్వాత మీరు ప్రేమించే అమ్మాయి లేదంటే అబ్బాయి లేదంటే మీ భార్య, భర్తను అసలు విషయంపై నిలదీయండి. ఇలాగే కొనసాగిస్తే మన బంధం బలంగా ఉండదని చెప్పండి. నచ్చజెప్పండి. మీ దారిలోకి తనని తెచ్చుకునేందుకు ప్రయత్నించండి.అప్పటికి కూడా మారలేదని మీకు అనిపిస్తే మీరు బ్రేకప్ చెప్పడమే మంచిది. ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మరి మేము చెప్పిన ఈ విషయాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.