వింత పద్దతి: ఆ ఊరిలో నైటీలు నిషేధం..అమ్మాయి నైటీ వేసుకొని కనిపిస్తే మగాళ్ళు ఏం చేస్తారో తెలిస్తే షాక్

507

నిడమర్రు మండలం తోకలపల్లిలో మహిళలు నైటీలు ధరిస్తే జరిమానా అన్న వార్త సోషల్‌ మీడియాలో కలకలం రేపింది. నైటీలు ధరించి రోడ్లపైకి వస్తే.. రెండు వేలు జరి మానా, చూసినవారు చెబితే రూ.వెయ్యి బహుమతి అని ప్రకటించారు. దీన్ని అతిక్రమిస్తే గ్రామం నుంచి వెలివేయడం జరుగుతుందని గ్రామ పెద్దల కమిటీ నిర్ణయించినట్లు ఆ సోషల్‌ మీడియా పోస్టు సారాం శం. దీనిపై ఆంధ్రజ్యోతి ఆ గ్రామం వెళ్లి వివ రాలు సేకరించింది. తోకలపల్లి.. ఐదువేల జనాభా కలిగిన ఊరు.ఎక్కువగా పల్లెకారు కుటుంబాలు జీవి స్తుంటాయి. గ్రామంలో 9 మందితో పెద్దల కమిటీని ఏర్పాటు చేసుకుని..వారి మాటే శాసనంగా అమలు చేస్తుంటారు.

కట్టుబాట్లకు నెలవుగా ఉండే తోకల పల్లిలో మహిళలు, యువతులు.. గ్రామంలో జరిగే సభలు, సమావేశాలకు నైటీలతో రావడం ఎక్కువగా పెరిగింది. వీటిపై తోటి మహిళలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో చిన్నపాటి గొడవలు జరిగేవి. 20-35 ఏళ్ల మహిళలు నైటీలతోనే తమ పిల్లలను స్కూల్లో దింపటం, పాఠశాల బస్సులు ఎక్కించటం, కిరాణా దుకాణాలకు వెళ్లడం, ఎస్‌ఎంసీ, పాఠశాల యాజ మాన్య కమిటీ సమావేశాలు, డ్వాక్రా సమావేశాల్లో పాల్గొనటంతో పెద్దల్లో ఊరి ఆచారాలు, కట్టుబాట్లపై ఆందోళన నెలకొంది.

పగటిపూట నైటీలతో సంచ రించడం వల్ల కుటుంబాల్లో సమస్యలు తలెత్తుతు న్నాయి. నైటీలతో బయటకు వెళ్లద్దని భర్త భార్యను వారిస్తుంటే.. ఊరంతా వేసుకుంటే లేనిది నేను వేసుకుంటే తప్పేమిటంటూ వాదించటంతో గొడవలు జరుగుతున్నాయి.యువకులతోను కొన్నిరకాల సమ స్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఏడు నెలల క్రితం మహిళలంతా గ్రామ పెద్దలతో కలిసి దీనిపై చర్చించి, ఒక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఉదయం ఆరు నుంచి రాత్రి ఏడు గంటల వరకూ నైటీలతో సంచరించరాదని నిషేధం విధించారు. మైకుల్లో ప్రచారం చేశారు. అతిక్రమిస్తే జరిమానాకు సిద్ధమవ్వాలని హెచ్చరించారు. అయితే కట్టుబాట్ల పేరుతో మహిళల స్వేచ్ఛను హరించటం ఏమిటని మరో వర్గం వాదిస్తోంది. నైటీల సమస్యపై కలకలం రేగడంతో తహసీల్దార్‌ సుందరరాజు, ఎస్సై ఎం.విజయ్‌ కుమార్‌ గురువారం గ్రామంలో పర్యటించి మహి ళలను విచారించారు. స్ర్తీ వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికి లేదని మహిళలు స్వేచ్ఛగా జీవించ డానికి ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఏడు నెలల క్రితమే నైటీల కట్టుబాటు మహిళలు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో డ్వాక్రా మహిళలు సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ పద్ధతి ఆచరి స్తున్నారు. ఎవరికి జరిమానా విధించలేదు. ఎవరినీ వెలి వేయలేదు’ అని గ్రామ పెద్ద భలే సీతారాముడు తెలిపారు. ‘గ్రామంలో మహిళలు కట్టుబాటుగా నైటీలు ధరించకూడదని నిర్ణయం తీసుకుని మైకులో చెప్పారు. అందరూ స్వచ్ఛందంగా పాటిస్తున్నాం’ అని భలే సరస్వతి చెబుతున్నారు. ‘దుకాణాలు, స్కూళ్లు, ఆసుపత్రులకు మహిళలు నైటీలతో రావడం ఇబ్బందిగా ఉండేది. వీటితో బయటకు రావద్దనే నిబంధన పెట్టుకున్నాం. ధరించి వస్తే జరిమానా విధిస్తామన్నామే తప్ప ఎవరికి విధించలేదు’ అని ఆశా కార్యకర్త ఘనసల విజయకుమారి తెలిపారు.