పులిపిల్ల‌ల్ని కాపాడ‌దామ‌నుకున్న వ్య‌క్తికి చివ‌ర‌కు ఏమైందో ..

384

సహజంగానే పులి అంటే మనుషులకు ఎక్కడలేని భయం ఉంటుంది. దానిని చూడ‌గానే ఒక్క‌సారిగా ఎక్క‌డ లేని భ‌యం మ‌న‌కు క‌లుగుతుంది అందుకే వాటిని చూడ‌గానే ప‌ది అడుగుల దూరంలోకి వెళ్లిపోతాం. అడ‌వుల్లో నుంచి జూల‌కు వ‌చ్చిన పులుల‌ను కేజ్ లో ఉంచి చాలా జాగ్ర‌త్త‌గా సంద‌ర్శ‌కుల‌కు చూపిస్తారు అంత డేంజ‌ర్ ఇలాంటి పులుల‌తో.

Image result for tigers in well

ఒక్కసారి పంజా విసిరి దాడి చేసిందంటే ఎంతటి వారినైనా వదిలిపెట్తదు.. అలాంటి క్రూర జంతువునే కాపాడటానికి ప్రయత్నించాడు ఓ వ్యక్తి. అయితే అది పులి కాదు.. దాని పిల్లలు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది… అడవికి దగ్గరగా వుండే గ్రామంలో పాడుబడ్డ బావి ఉంది.ఈ మ‌ధ్య కురిసిన వర్షాలకు ఆ బావిలోకి నీరు చేరింది. ప్రమాదవశాత్తు ఆ బావికి లోపల ఉన్న అంచులోరెండు పులిపిల్లలు చిక్కుకున్నాయి. అవి అనుకోకుండా ఆ బావిలో పడ్డాయి అనేది తెలుస్తోంది.

Related image

చివ‌ర‌కు బావిలో ప‌డిన త‌ర్వాత అవి బయటికి ఎలా రావాలో అర్ధంకాక పెద్దగా గ్రాండించడం మొదలుపెట్టాయి. బావినుంచి అరుపులు రావడంతో గ్రామస్తులు గమనించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడికి చేరుకొని రక్షించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి భావి అంచుకు వెళ్ళాడు. అయితే పులికి ఉన్న సహజ గుణం అవతలివారిని బెదిరించడం. ఆ గుణంతోనే అవి పిల్లలైనా ఆ వ్యక్తిపై దాడి చేయడానికి ప్రయత్నించాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

పులిపిల్లల ఎదిరింపు చూసిన సదరు వ్యక్తి వెంటనే పైకి వచ్చేశాడు. ఈసారి పక్కా ప్లాన్ అమలుచేశాడు. కర్రకు మెడఉచ్చు అమర్చి వాటిని పైకి లాగారు. ఇలా రెండు మూడు స్లారు ప్ర‌య‌త్నించేస‌రికి అవి ఆ ఉచ్చులో ప‌డ్డాయి వాటిని పైకి తీసుకువ‌చ్చి, రెండిటిని బోనులో బంధించి వారి వెంట తీసుకెళ్లారు. ఇక పులిపిల్లల బాధ వదలడంతో గ్రామస్థులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.