ఈ ఊరు మొత్తం పెళ్లికి ముందు సహజీవనం చేస్తారు..ఎందుకో తెలిస్తే షాక్..

353

ఈ మధ్య పెళ్లి చేసుకునే వారి కంటే పెళ్ళికి ముందు సహజీవనం చేసుకునే వాళ్ళే ఎక్కువవుతున్నారు. పెళ్ళికి ముందు కలిసుండటం మన దేశ సంప్రదాయం కాకపోయినా దానికే ఓటు వేస్తున్నారు యూత్. కలిసుంటే ఒకరి గురించి ఒకరికి తెలుస్తుందని అప్పుడు నచ్చితే పెళ్లి చేసుకుంటాం లేదంటే విడిపోయి సంతోషంగా ఉంటామని అంటున్నారు యువత. అయితే ఇలా సహజీవనం చేసిన తరువాత పిల్లలని కని పెళ్లి చేసుకోకుండా విడిపోయిన వారిని మనం చాలా మందిని చూశాం. ముఖ్యంగా సహజీవనం పేరు చెప్పి ఆడవారిని వాడుకుని వదిలేసినా మగవారు ఎందరో.అయితే ఇలా ఎన్నో తప్పులు జరుగుతాయని తెలిసిన కూడా ఒక ఊరిలో ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. మరి ఆ గ్రామం గురించి సహజీవనాన్ని ఎందుకు ఫాలో అవుతున్నారో తెలుసుకుందామా.

Image result for lovers

జార్ఖండ్ రాష్ట్రంలోని నిరుపేద గిరిజనులు పెళ్లి సందర్భంగా ఇచ్చే విందుకు డబ్బులు లేక పలు జంటలు పెళ్లి చేసుకోకుండానే ఏళ్ల తరబడిగా సహజీవనం చేస్తున్నారని తాజాగా వెలుగుచూసింది. జార్ఖండ్ రాష్ట్రంలోని చార్కాట్ నగర్ గ్రామానికి చెందిన రాజు మహ్లీ, మంకీదేవిలు పెళ్లి చేసుకోకుండానే గత 20 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. గిరిజనుల్లో వివాహ విందు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఈ జంట పేదరికం వల్ల వివాహవిందు ఇవ్వలేక పెళ్లి చేసుకోకుండానే కలిసి కాపురం చేస్తోంది. గిరిజనుల పరిస్థితిని చూసిన నిమిట్ అనే స్వచ్చంద సంస్థ ముందుకు వచ్చి ఇలా పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేస్తున్న 132 గిరిజన జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. నిమిట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు గిరిజన సంప్రదాయం ప్రకారం వారి స్నేహితులు, బంధువులకు విందు ఇచ్చారు. ఇలా పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేయడం జార్ఖండ్ లోని ఒరాన్, ముంద, హో గిరిజనుల్లో సంప్రదాయంగా వస్తోంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

స్థానిక గిరిజన సంప్రదాయం ప్రకారం యువతి సహజీవనం చేసే యువకుడిని ఎంపిక చేసుకొని స్థానిక పెద్దల అనుమతి తీసుకుంటారు. భార్య భర్తల్లా కాకుండా దుకా, దుక్నీల పేరిట వారు ఒకే ఇంట్లో కాపురం చేస్తారు. చిన్న ప్లాటు భూమిలో వ్యవసాయం చేస్తున్న తాను పెళ్లి విందుకు డబ్బుల్లేక పెళ్లాడలేదని మహ్లీ చెప్పారు. తమకు కొడుకు, కూతురు పుట్టాక నిమిట్ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి వివాహాలు జరిపిస్తామంటే తాము అంగీకరించామని మహ్లా పేర్కొన్నారు. పేదరికం వల్ల ఇలా పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్న జంటలకు తాము సామూహికంగా వివాహాలు జరిపిస్తున్నామని నిమిట్ట స్వచ్చందసంస్థ కార్యదర్శి నికిత సిన్హా చెప్పారు. ఇలా 2016లో 21 జంటలకు, 2017లో 43 మందికి, ఈ ఏడాది 132 జంటలకు సామూహిక వివాహాలు జరిపించామని నికితసిన్హా వివరించారు.విన్నారుగా సహజీవనం చేస్తున్న గ్రామ విశేషాల గురించి. మరి సహజీవనం చేస్తున్న ఈ గ్రామం గురించి దానికి గల కారణాల గురించి ఆలాగే ఏ మధ్య యువత ఎక్కువగా ఈ సహజీవనాన్ని ఎంచుకోవడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.