తన భర్త మరణం తర్వాత మీడియా ముందు ఎవ్వరు ఊహించని విధంగా స్పందించిన ఈ సైనికుడి భార్య.. విని అందరు షాక్

254

ఫిబ్రవరి 14 న జరిగిన పుల్వామా దాడి గురించి అందరికి తెలుసు.ఒకే ఒక్క పెనుదాడి వందల మంది గుండెల్లో బడబాగ్ని రగిల్చింది. మాటలకందని మహా విషాదాన్ని మిగిల్చింది. మాతృభూమి రక్షణలో పునీతమౌతున్న వారంతా అమరులైపోయారు. పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కన్నీటికి కారణమైంది.విషాదం దాదాపు అమరులందరి కుటుంబాల్లో నెలకొంది. ఇక, కొండంత ప్రేమతో పెంచుకున్న కుమారుడు కంటికిక కానరాడనే పుత్రశోకం ఎందరో అమ్మానాన్నల గుండెలను కాల్చేస్తోంది. కోటి కలలతో భర్త చిటికెనవేలు పట్టుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన అతివలు ఈ పరిణామంతో భవిష్యత్తు ఏమిటో తెలియక నడిసంద్రంలో నావల్లా అల్లాడిపోతున్నారు. ఇదిగో! జమ్మూ నుంచి వెళుతున్నాం. తర్వాత ఫోన్‌చేస్తామంటూ కుటుంబసభ్యులకు చెప్పిన జవాన్లు ఇక అలాంటి అవకాశమే లేకుండా తరలి వెళ్లిపోయారు.అయితే పుల్వామా దాడిలో మరణించిన ఓ సీఆర్పీఎఫ్ జవాను భార్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయి.

Image result for pulwama

కర్ణాటక రాష్ట్రానికి చెందిన హెచ్. గురు సీఆర్పీఎఫ్ లో పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారిలో గురు కూడా ఉన్నాడు. తన భర్త వీరమరణం పొందడంపై గురు భార్య కళావతి తీవ్రంగా స్పందించింది. తన భర్తను ఎలా పొట్టనబెట్టుకున్నారో ఆ కిరాతకులను కూడా అదే రీతిలో చంపాలని పిలుపునిచ్చింది. జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.”నిన్న నా భర్త నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కానీ పని ఒత్తిడి కారణంగా ఆ కాల్ మాట్లాడలేకపోయాను. మళ్లీ నేను కాల్ చేస్తే అవుటాఫ్ రీచ్ అని వచ్చింది. నా భర్తతో మాట్లాడ్డానికి వచ్చిన ఆ చివరి అవకాశం అలా మంటగలిసిపోయింది… అంతా మా తలరాత” అంటూ కన్నీటి పర్యంతమైంది కళావతి.

తన భర్త మరణించిన విషయం గురువారం రాత్రి 11 గంటల సమయంలో తెలిసిందని వెల్లడించింది. అయితే ఈ సందర్భంగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు సీఆర్పీఎఫ్ జవాన్ల దయనీయ పరిస్థితికి నిదర్శనం అని చెప్పాలి. దేశాన్ని కాపాడే జవాన్లకే రక్షణ లేకపోతే వాళ్లను ఇళ్లకు పంపించేయండి.. కనీసం వాళ్ల కుటుంబాల కోసమైనా పాటుపడతారు… అంటూ డిమాండ్ చేసింది కళావతి. నా భర్త దేశాన్ని రక్షించాడు, కానీ విపత్కర పరిస్థితుల్లో తనను ఎవరూ రక్షించలేకపోయారు… అంటూ తీవ్ర ఆవేదన నిండిన స్వరంతో వ్యాఖ్యానించింది. కాగా, ఉగ్రదాడిలో అసువులు బాసిన హెచ్. గురు భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.మరి ఈ ఉగ్రదాడి గురించి అలాగే అమర జవాన్ హెచ్. గురు భార్య గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.