గర్భంతో ఉన్న ఈ మహిళ ఎలుక ఉన్న సూప్ తాగింది ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్.

400

మనం ఆహరం తినాలంటే ఏ హోటల్ అయితే మంచిదో చూసి వెళ్తాము.ఎందుకంటే అక్కడ అన్ని జాగ్రత్తగా చూసుకుని మనకు మంచి ఫుడ్ అందజేస్తారని.అయితే కొన్ని మంచి హోటల్స్ అని చెప్పుకుని వచ్చే కష్టమర్స్ కు మాత్రం మంచి ఆహారాన్ని పెట్టరు.ముఖ్యంగా అజాగ్రత్తగా వుండి ప్రజల ఆరోగ్యం మీద చెలగాటం ఆడుతుంటారు.అలాంటి ఒక విషయం గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.సూప్ తాగుదామని వెళ్లిన ఒక గర్బీని స్త్రీకి ఎలుక ఉన్న సూప్ ను ఇచ్చారు ఒక రెస్టారెంట్ వాళ్ళు.ఎలుక ఉందని తెలియక ఆ సూప్ తాగేసింది మహిళా.మరి ఆ తర్వాత ఆ మహిళకు ఏమైంది.ఈ విషయం గురించి ఆ రెస్టారెంట్ వాళ్ళు ఏమంటున్నారు.ఆ విషయాల గురించి ఇప్పుడు పూర్తీగా తెలుసుకుందాం.

Image result for pregnancy

చైనాలో నివసించే గర్భవతి అయిన మహిళ గ్జియాబూ అనే ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది. అది చైనాలో ప్రముఖ రెస్టారెంట్ .తన భర్తతో కలిసి సూప్ ఆర్డర్ చేసింది.ఇద్దరు కలిసి సూప్ తింటున్నారు.అప్పుడే సూప్‌లో చనిపోయిన ఎలుక దర్శనమివ్వడంతో షాక్‌కు గురైంది మహిళ. దీంతో విషయం పెద్దదైంది.సూప్‌లో ఎలుక పడిందని రెస్టారెంట్ సిబ్బంది దృష్టికి మహిళ భర్త తీసుకొచ్చాడు. కడుపులో బిడ్డ ఆరోగ్యంపై ఆందోళన చెందితే వెంటనే ఆమెకు అబార్షన్ చేయించండి అంటూ ఉచిత సలహాతో పాటు 3వేల డాలర్ల డబ్బులు కూడా యాజమాన్యం ఇచ్చింది. ఆ తర్వాత కడుపులోని బిడ్డ ఆరోగ్య పరిస్థితి ఎలాగుందో తెలుసుకునేందుకు వెంటనే హాస్పిటల్‌కు వెళ్లినట్లు మహిళ భర్త మా చెప్పారు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ మరో 728 డాలర్లు చెల్లించింది రెస్టారెంట్ యాజమాన్యం.

Image result for pregnancy

ఈ వార్త దావణంలా పాకిపోవడంతో ఆరోగ్యశాఖ అధికారులు రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించారు. అయితే అక్కడ ఎలుకలు ఉన్నట్లుగా ఎలాంటి ఆనవాలు కనిపించలేదు. అయినప్పటికీ రెస్టారెంట్‌ను పరిశుభ్రంగా ఉంచకపోవడంతో మూసివేయాలని అధికారులు ఆదేశించారు.దీంతో గొడవ మరింత పెద్దదిగా మారడంతో ప్రస్తుతం ఆ రెస్టారెంట్ మూతపడింది.ఇదిలా ఉంటే కస్టమర్ల సేఫ్టీనే తమకు ముఖ్యమని ఆహార భద్రతపై తాము రాజపడబోమని వెల్లడించింది.ఇంకా ఇతరత్రా మార్పులు ఏమైనా ఉంటే తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చింది.గ్జియాబూ రెస్టారెంట్లు చైనా వ్యాప్తంగా 759 ఉన్నాయి.ప్రముఖ హోటల్‌ సర్వ్ చేసిన సూప్‌లో ఎలుక ప్రత్యక్షమవడం ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసిన తర్వాత ఆ హోటల్‌కు ఎవరూ వెళ్లొద్దంటూ నెటిజెన్లు కామెంట్ చేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

గ్జియబూ రెస్టారెంట్ పరిశుభ్రతమైన ఆహారానికి మారుపేరు అని ఇంతకాలం భావించాను కానీ అంతా అబద్ధమే అని తేలిపోయిందంటూ మరో వ్యక్తి కామెంట్ చేశారు. కడుపులో బిడ్డకు ఏమైనా అయితే పోయిన ప్రాణాన్ని డబ్బుతో తీసుకురాగలరా అని మరికొందరు ప్రశ్నించారు.ప్రస్తుతం రెస్టారెంట్ మూతపడింది. విన్నారుగా ఎలుక పడిన సూప్ ఇవ్వడమే కాకుండా అబార్షన్ చేపించుకోమని డబ్బును ఎలా ఇచ్చారో.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.అంత ఫెమస్ రెస్టారెంట్ అయ్యుండి ఆహార విషయంలో ఇంత అజాగ్రత్త ఉన్న ఈ రెస్టారెంట్ గురించి అలాగే ఇలా పేరు చెప్పుకుని జనాల ప్రాణాలతో చెలగాటం ఆడే రెస్టారెంట్స్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.