ఈ ఒక్క ఫోటో ఈమె జీవితాన్నే మార్చేసింది.. ఎలాగో మీరే చూడండి

1248

ఒక్కోసారి మ‌నం చేసిన సాయం మ‌న‌కు ఎలా ప్ర‌తిఫ‌లంగా వ‌స్తుందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతాం.. ఇలాంటి ఓ సంఘ‌ట‌న ఢిల్లీలోని ఓ ట్యాక్సీ డ్రైవ‌ర్ కుటుంబంలో జ‌రిగింది…ఇప్పుడు అత‌ని ప‌రిస్దితిని చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఓసారి ఈ మాన‌వ‌త్వం ప‌రవ‌శించిన స్టోరీని తెలుసుకుందాందిల్లీలో రాజ్ వీర్ అనే వ్య‌క్తి ఉన్నాడు.. అత‌నికి ఓ ట్యాక్సీ ఉంది.. ఓరోజు రాత్రి అత‌ను చాలా లేట్ గా డ్యూటీ చేయ‌డంతో, ఉద‌యం లేవ‌లేక‌పోయాడు.. చివ‌ర‌కు 10 గంట‌ల స‌మ‌యంలో ట్యాక్సీని న‌డుపుకుంటూ డ్యూటీకి వెళ్లాడు… ఆ స‌మ‌యంలో ఇంటి నుంచి మూడు కిలోమీట‌ర్ల దూరం వెళ్లిన త‌ర్వాత, అత‌నికి కొంత మంది జ‌నం రోడ్డుపై గుముగూడి క‌నిపించారు.. ఏమి జ‌రిగిందా అని ద‌గ్గ‌ర‌కు వెళ్లి చూశాడు. అక్క‌డ ఓ అంద‌మైన కాలేజీ అమ్మాయి ప్ర‌మాదానికి గురై రోడ్డుమీద చావుబ‌తుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతోంది, అంత మంది ఉన్నా ఎవ‌రూ ఆమెని కాపాడ‌లేక‌పోయారు, వెంట‌నే ఆమెని త‌న ట్యాక్సీలో ఎక్కించుకుని లోక‌నాయ‌క్ జ‌య‌ప్ర‌కాష్ హాస్ప‌ట‌ల్ కు తీసుకువెళ్లి అడ్మిట్ చేశాడు.

Image result for cab drivers

పావుగంట త‌ర్వాత డాక్ట‌ర్లు వ‌చ్చి ఆమె ప‌రిస్దితి చాలా క్రిటిక‌ల్ గా ఉంది.. ఆమెకు రక్తం పోయింది అని చెప్పారు. అలాగే ఆమె బ్ర‌త‌కాలి అంటే ఆమెకు బ్రెయిన్ స‌ర్జ‌రీ చేయాలి అని చెప్పారు.. అందుకు గాను రెండుల‌క్ష‌ల రూపాయ‌లు అవ‌స‌రం అవుతుంది అని చెప్పారు. దీంతో వెంట‌నే రాజ్ వీర్ త‌న ట్యాక్సీని అమ్మేసి ఆ డబ్బుని హాస్ప‌ట‌ల్ లో చెల్లించి ఆమెకు ఆప‌రేష‌న్ చేయించాడు… అలాగే మూడు బాటిల్స్ ర‌క్తం కూడా అందించాడు. త‌ర్వాత ఆమెని అక్క‌డ వ‌దిలి క్షేమంగాఉంద‌ని తెలుసుకున్నాక ఇంటికి వెళ్లిపోయాడు.ఆతర్వాత ఆమె వివ‌రాలు తెలుసుకుని డాక్ట‌ర్లు ఆమె త‌ల్లిదండ్రుల‌కు కబురు పంపించారు.. కాని ఆమె తండ్రి కొద్దిరోజుల‌ క్రితం ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణించారు. ఆమె త‌ల్లి మాత్ర‌మే ఆమె ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. ఓ రెండు నెల‌ల వ‌రకూ ఆమె బెడ్ రెస్ట్ తీసుకుంది. త‌ర్వాత ఆమె ఆ ట్యాక్సీ డ్రైవ‌ర్ అడ్ర‌స్ తెలుసుకుని అత‌ని ఇంటికి వెళ్లింది. త‌న‌కు ప్రాణిబిక్ష పెట్టినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపింది, అత‌న్ని చూసి క‌న్నీరు పెట్టుకుంది.

Image result for cab drivers

అత‌ను సొంత ట్యాక్సీ అమ్మేయ‌డంతో బీదవాడిగా మారిపోయి, వేరే ట్యాక్సీద‌గ్గ‌ర ప‌నిచేస్తున్నాడు. ఇంత బాధ‌లో ఉన్నా ఆ అమ్మాయిని న‌వ్వుతూ ప‌ల‌క‌రించాడు ఆ వ్య‌క్తి..అయితే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు క‌దా అని ఆ అమ్మాయిని న‌వ్వుతూ ప‌ల‌క‌రించాడు.. అత‌ను అలా మారిపోవ‌డానికి తానే కార‌ణం అని భావించింది ఆ అమ్మాయి.. ఇక మ‌రో ఆరు నెల‌ల త‌ర్వాత ఆమె రాజ్ వీర్ ఇంటికి వ‌చ్చింది ఈ స‌మ‌యంలో రాజ్ వీర్ ని అన్న‌య్యా అని ప‌ల‌క‌రించి, ఎలా ఉన్నావు అని యోగ‌క్షేమాలు అడిగింది.. తాను డిగ్రీపూర్తిచేశాను కాలేజీలో ఫంక్ష‌న్ కు నువ్వు రావాలి.. నేను డిగ్రీ ప‌ట్టా తీసుకునే స‌మ‌యంలో నువ్వు ఉండాలి అని అత‌న్ని ఆమె త‌ల్లిని కోరింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక ఆమె బాగా చ‌దువుకుని టాప్ ర్యాంక‌ర్ గా గోల్డ్ మెడ‌ల్ సాధించింది. అప్పుడు ఆమెకు గోల్డ్ మెడ‌ల్ అందిస్తున్న స‌మ‌యంలో, ఒక్క‌నిమిషం ఆగ‌మ‌ని, త‌న అన్న‌య్య అని రాజ్ వీర్ ని స్టేజ్ పైకి పిలిచింది.. అతన్ని చూసి అంద‌రూ షాక్ అయ్యారు..ఇలా చిరిగిన బ‌ట్ట‌లు వేసుకున్న వ్య‌క్తి ఆమె అన్న‌య్యా అని కంగుతిన్నారు.. కాని ఆ స‌మ‌యంలో త‌న‌కు జ‌రిగిన విష‌యాన్ని అన్న‌య్య ఎలా త‌న ప్రాణాలు కాపాడాడు అనేది చెప్పింది అసీమా. ఈ గోల్డ్ మెడ‌ల్ త‌న అన్న‌కు ఇవ్వాలి అని అత‌నికే ఇచ్చింది.. త‌ర్వాత నెల‌రోజుల‌కు మంచి ఉద్యోగం సంపాదించుకున్న అసీమా, రాజ్ వీర్ ని అలాగే అత‌ని త‌ల్లిని ఇంటికి తీసుకువెళ్లింది. త‌న‌తోనే వారిని కూడా చూసుకుంటోంది. ఇప్పుడు అత‌ను సొంత ట్యాక్సీలు మూడు కొనుక్కొని డ్రైవ‌ర్ల‌ను పెట్టి న‌డుపుకుంటున్నాడు. అందుకే ఎప్పుడూ ఒక‌రికి చేసిన సాయం ఊరికినే పోదు అంటారు.. చూశారుగా అసీమా అత‌ని కుటుంబం రుణం ఎలా తీర్చుకుందో. ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి