‘ప్రియ‌మైన అమృత‌కు…..ప్ర‌ణ‌య్ రాయున‌ది’ అని సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ లెటర్ చూస్తే కన్నీళ్లొస్తాయి

427

మిర్యాలగూడలో కులం ‘కత్తి’కి బలైన పెరుమాళ్ల ప్రణయ్ (24) అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంతిమ యాత్రలో జనం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రణయ్ భార్య అమృత, తల్లి ప్రేమలత, అతడి సోదరుడు అజయ్.. అంతిమయాత్ర వాహనంలో ప్రణయ్ మృతదేహం వెంటే ఉన్నారు. స్నేహితులు, బంధువులు, వివిధ ప్రజాసంఘాలు, కుల సంఘాల నాయకులు భారీగా హాజరై ప్రణయ్ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ‘ప్రణయ్ అమర్ రహే’ అనే నినాదాలు, స్నేహితులు, బంధువుల అశ్రునయనాల మధ్య ప్రణయ్ అంతిమ యాత్ర కన్నీటి సంద్రంగా మారింది. స్థానిక చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు అనంతరం క్రైస్తవ మత ఆచారాల ప్రకారం ప్రణయ్ అంత్యక్రియలు పూర్తి చేశారు.అయితే నిన్న అంత్యక్రియల సమయంలో సోషల్ మీడియాలో ఒక లెటర్ దర్శనం ఇచ్చింది.అది అమృతకు ప్రణయ్ రాసినట్టు ఉంది.మరి ఆ లెటర్ గురించి తెలుసుకుందామా.

Image result for pranay and amrutha

మ‌న‌కేమైనా అయితే., మ‌నం పోతే ద మోస్త్ ఎఫెక్టెడ్ ప‌ర్స‌న్ ఒక్కరుంటారు అది నా లైఫ్ లో ఆ పిల్ల., అ పిల్లకి ఏమైనా అయితే i ‘ll be most effected… understand. ! ఇలా స‌ర‌దాగా చెప్పుకున్న డ‌బ్ స్మాష్ లే నిజ‌మైతాయ‌ని ఊహించ‌లేదు అమ్ము.! నేనే ప్ర‌పంచంగా బ‌తికిన నీ ప‌రిస్థితిని ఊహించ‌డానికే మ‌రో క‌త్తిపోటు మెడ‌మీద దించుకున్న‌ట్లుంది అమ్ము.!అయినా…5 ల‌క్ష‌లు అడ్వాన్స్ తీసుకొని క‌త్తివేటుతో నీ నుండి న‌న్ను దూరం చేసిన ఆ న‌ర‌హంత‌కునికి ఏం తెలుసు ప్రేమ గురించి.? ప‌రువు కోసం కులం త‌క్కువ‌ని న‌న్ను కాటికి పంపిన మీ నాన్న‌కేం తెలుసు ప్రేమ గురించి.? అయినా ప్రేమ‌కు కుల‌మేంటి అమ్ము.? వీరి పిచ్చికాక‌పోతే గువ్వాగోరింక‌ల్లాంటి మ‌న‌ల్ని వేరు చేసి వారు సాధించిందేంటి?

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మ‌రో మూడు నెల‌ల్లో మ‌న‌కు పుట్ట‌బోయే పాప గురించి క‌న్న ఎన్నో క‌ల‌లు వాడి రాక‌తో అయినా మీ నాన్న మ‌న‌స్సు క‌రుగుతుందేమోన‌నే ఆశ‌.మ‌న ప్రేమ గెలిచింది అని స‌గ‌ర్వంగా చెప్పుకోవాల‌నుకున్న కాంక్ష‌.అన్నీ నా నిర్జీవ దేహంతో పాటు స‌జీవంగా స‌మాధి అయ్యాయి అమ్ము.!క‌ల‌కాలం నీతోనే నిన్ను సంతోష‌పెట్ట‌డ‌మే నా ఈ జీవితమంటూ నీకిచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోలేక విగ‌త‌జీవిగా ప‌డిఉన్నందుకు న‌న్ను క్ష‌మించు అమ్ము.! నా మెడ‌పై ప‌డిన రెండు క‌త్తివేట్లు భౌతికంగా నన్ను నీ నుండి విడ‌దీశాయేమో కానీ, ప్ర‌తి ప్రేమ జంట స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌లో న‌న్ను స‌జీవంగా ఉంచాయి అమ్ము.!

Image result for pranay and amrutha

ఐ ల‌వ్యూ అమ్ము. టేక్ కేర్ నా అంతిమ సంస్కారానికి టైమైంది. బై… ఇదండీ సోషల్ మీడియాలో వైరల్ అయినా ఒక లెటర్.వింటుంటే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి కదూ.ఇంత చూడముచ్చటైన జంటను విడదీసిన ఆ నరరూప రాక్షసులను తలుచుకుంటుంటేనే కోపం వస్తుంది కదూ.వారికి తగిన శిక్ష పడాలని కోరుకుందాం.మరి ఈ లెటర్ గురించి మీరేమంటారు.ఈ పరువు హత్య గురించి అలాగే మేడ్ ఫర్ ఈచ్ ఆధర్ లా ఉన్న ఈ జంటను విడదీసి కన్నకూతురికి అన్యాయం చేసిన ఆ రాక్షసుడి గురించి అలాగే సోషల్ మీడియాలో వైరల్ అయినా ఈ లెటర్ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.