వ్యభిచారం చేస్తూ దొరికిన 16 ఏళ్ల అమ్మాయి కోసం ఈ లేడి DSP చేసిన పని తెలిస్తే సెల్యూట్ చేస్తారు..

418

విధి బలీయమైనది. చెమట చుక్క చిందించి నుదుటి రాత మార్చుకో అన్నాడు ఒక సినీ కవి. అయితే అది అన్ని పరిస్థితులలో వీలు కాదు.కంటికి కన్నీరు తప్పా మనసుకు ఆనందం అంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితుల నడుమ పగబట్టిన పరిస్థితులు జీవితాన్ని ఛిద్రం చేస్తాయి. గడిచిన ప్రతి క్షణం యుద్ధ జోన్ లోకి నెడితే ఎవరైనా ఏం చెయ్యగలరు. పోరాడటానికి శక్తి కూడా ఇవ్వని విధి ముందు తలవంచి బతుకు బండిని వెళ్లదీయడం కన్నా మరొక మార్గం ఏముంటుంది.ముంబైకి చెందిన ఒక 16 ఏళ్ల అమ్మాయి జీవితంలో అచ్చం ఇలాగే జరిగింది. 16 ఏళ్లకే కడుపులో బిడ్డతో ఒక హోటల్ లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ అమ్మాయి ఇప్పటి గుంటూరు అడిషనల్ ఎస్పీ సరితా గారికి చెప్పిన తన దారుణ పరిస్థితుల గురించి తెలిస్తే ఎవరైనా కన్నీరు పెట్టుకోకతప్పదు. ఎస్పీ సరితా గారికి ఆ అమ్మాయి చెప్పిన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Image result for prostitute

గుంటూరు ఎస్పీ సరిత గారి గురించి ఆమె మోటివేషన్ స్పీచ్ ల గురించి అందరికి తెలిసిందే. ఆమె ఒకసారి ఎదుర్కొన్న వింత పరిస్థితి గురించి ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆడపిల్ల జీవితం దారితప్పితే ఎలా ఉంటుందో చాలా ఉద్వేగంగా చెప్పుకొచ్చారు. అసలు ఆ అమ్మాయి ఎవరో ఆమె చెప్పిన విషయాలు ఏమిటో సరితా గారి మాటల్లోనే తెలుసుకుందాం. నేను గుంటూరు వెస్ట్ కు dsp గా పని చేస్తున్న రోజుల్లో వ్యభిచారం కేసులో ఇద్దరు అమ్మాయిలను స్టేషన్ కు తీసుకొచ్చారు.సాధారణంగా ఇలాంటి కేసులో అమ్మాయిలను రెస్క్యూ హోమ్ కు పంపించి వారికి కావాల్సిన అవసరాలను తీరుస్తాం.అయితే ఈ రోజు స్టేషన్ కు వచ్చిన ఇద్దరు అమ్మాయిలలో ఒక అమ్మాయి మైనర్.పైగా ఆమె ప్రెగ్నెంట్ కూడా.ఎందుకో ఆమెను అలా చూడగానే నా హృదయం చలించింది. నా పర్సనల్ ఇంట్రెస్ట్ కొద్దీ ఎందుకమ్మా ఇలా చేస్తున్నావని అడిగా..అంతే కళ్ళనిండా కన్నీరుతో తానా పరిస్థితి గురించి చెప్పుకొచ్చింది.మేడమ్ మాది ముంబై. మాయా అమ్మ నా ఐదవ ఏటనే చనిపోయింది.మా మేనత్త నన్నుపోషించింది. మా అత్తమ్మ వ్యభిచారం చేసిన నన్ను మా బావను పెంచింది.ఇంట్లో మగదిక్కు లేదు. అత్తకు వేరొక మార్గం కనిపించక అలా చేసింది.నన్ను మాత్రం బాగానే పెంచింది. తన కొడుకుకు ఇచ్చి పెళ్లి చేసింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే కొన్ని రోజులకు మా అత్తకు ఎయిడ్స్ అని తెలిసింది.మా బావకు కూడా ఆరోగ్యం చెడిపోయింది.ఇలాంటి పరిస్థితిలో మా అత్తను మా బావను పోషించుకోవడం నా భాద్యత అనుకున్నా.నా చిన్నప్పుడు మా అత్తమ్మ నన్ను వదిలేసి ఉంటె నాకు ఈ మాత్రం జీవితం కూడా ఉండేది కాదు.అందుకే నాకు ఈ మార్గం కన్నా ఇంకొక మార్గం లేదు.మాకు చదువు లేదు మాకు ఉద్యోగాలు ఇవ్వరు.కూలి చేసుకుని సంపాదిస్తే మా అత్తమ్మ బావ మందులకే సరిపోవు. ఇక తినడానికి ఎలా సరిపోతాయి.అందుకే తప్పని పరిస్థితిలో కడుపుతో ఉన్నా కూడా పడుపు వృత్తిలోకి వచ్చా అని ఆమె చెప్పుకొచ్చింది.ఆమె మాటలు విన్న ఆ క్షణంలో సరిత గారి హృదయం చలించిపోయింది.ఆ తరువాత ఆ అమ్మాయి జీవితాన్ని సరిదిద్దాలని వారికి కొంత ఆర్థిక సాయం చేసింది సరితా గారు. అయితే ఈ ఘటన జరిగి చాలా రోజులైంది. కానీ ఇన్నాళ్లకు ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పింది.ప్రస్తుతం ఈమె చెప్పిన ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా వివిధ పరిస్థితుల మధ్య వ్యభిచాలుగా మారుతున్న వారి పరిస్థితి మారాలంటే ప్రభుత్వాలు ఏదో ఒకటి చెయ్యాలి. లేకుంటే వ్యభిచార దందాకు అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా వేరేవాళ్ళ జీవితాలను కూడా నాశనము చేస్తారు. మరి సరితా గారు ఎదుర్కొన్న ఈ వ్యభిచార అమ్మాయి గురించి అలాగే వ్యభిచారం చేసే వారి జీవిత పరిస్థితుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.