స్త్రీకోరుకునేది ఇలాంటి మ‌గాడినే

440

స‌మ‌కాలిన స‌మాజంతో పాటు భావిత‌రాల‌కు ఎన్నో సూచ‌న‌లు చేశాడు చాణిక్యుడు, అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ అనేక చాణిక్య నీతి సూత్రాలు పాటిస్తూ ఉంటారు .ముఖ్యంగా ఇలాంటి అనేక కొటేష‌న్లు జీవితంలో పైకి రావ‌డానికి ఎంతో ఉప‌యోగ‌క‌ర‌మైన‌వి అని చెబుతారు. ముందు చూపుతో నాటి స‌మాజం నుంచి నేటి నవీన స‌మాజం వ‌ర‌కూ చాణిక్యనీతి సూత్రాలు పాటిస్తున్నారు అంటే వాటి విలువ అర్ధం చేసుకోవ‌చ్చు, జీవితంలో చాణిక్య నీతి సూత్రాలు పాటించిన వారు ఎవ‌రైనా, మంచి మార్గంలో ఎదిగిన‌వారు అవుతారు… అయితే ఇద్దరుపెళ్లి చేసుకునే స్త్రీ పురుషుల మ‌ధ్య ప్రేమ ఉండాలి … పెద్ద‌లు కుదిర్చిన పెళ్లి అయినా ,వారికి పెళ్లి అయిన త‌ర్వాత ప్రేమ వస్తుంది. అయితే ముఖ్యంగా ప్రేమికుల మ‌ధ్య కొన్ని విష‌యాల‌లో ఏకాభిప్రాయం రావాలి అని చెబుతున్నాడు చాణిక్యుడు .ఇలా ఉంటేనే వారి లైఫ్ సుఖంగా ఉంటుంది, జీవితంలో అనేక ఆశ‌లతో అమ్మాయి అబ్బాయితో లైఫ్ స్టార్ట్ చేస్తుంది. కాని ఆ అబ్బాయి అమ్మాయి ప‌ట్ల న‌మ్మ‌కంగా లేక‌పోయినా, మోసం చేసినా ఆ అమ్మాయి మ‌న‌సు బాధిస్తుంది, అంతేకాదు వారి జీవితంలో అనేక వివాదాలు వ‌స్తాయి. మ‌రి ఈ ప్రేమ నిల‌బ‌డాలి అంటే ఎలాంటి పనులు పురుషులు చేయాలి అనేది చాణిక్యుడు తెలిపాడు. మ‌రి అవేమిటో ఇప్పుడు చూద్దాం.

ఈ క్రింది వీడియో చూడండి

ప్రేమించ‌డం ప్రేమ‌ను నిల‌బెట్టుకోవ‌డం చాలా క‌ష్టం.. కాని ఇద్ద‌రు ప్రేమికులు కూడా ఒక‌రిపై ఒక‌రు న‌మ్మ‌కంగా ఉండాలి. ఎవ‌రిని ఎవ‌రూ మోసం చేసుకోకూడ‌దు, కుటుంబంలో ఇద్ద‌రు ఒక‌టే అని అనుకోవాలి. ఇద్ద‌రు పెళ్లి చేసుకునే ముందు కొన్ని గుణాలు క‌లిగి ఉండాలి. అయితే స్త్రీని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌టం మంచిదే. అది త‌ల్లి కావ‌చ్చు చెల్లి అక్క కావ‌చ్చు ..వారిని ఇష్టంగా చూసుకునేవారు క‌చ్చితంగా భార్యని కూడా బాగా చూసుకుంటారు… ఎవ‌రికి ఎన్ని కోరిక‌లు ఉన్నా ప‌ర‌స్త్రీని త‌ప్పుడు దృష్టితో చూడ‌క‌పోవ‌డం మంచిది. ఇలా వేరే స్త్రీని కామ‌వాంచ‌తో చూసినా మోహంతో ఏమైనా అనుభ‌వించాలి అని భావ‌న క‌లిగినా, ఇది త‌ప్పు అని ఇలాంటి ఆశ‌లు ఉన్న వారి మ‌ధ్య రిలేష‌న్ గ‌ట్టిగా ఉండ‌దు అని చెబుతున్నాడు చాణిక్యుడు, ముఖ్యంగా తన భార్య ప్రియురాలిపై త‌న‌కు ఎంత న‌మ్మ‌కం ఉంటుందో అవ‌త‌లి వారిపై కూడా అంతే న‌మ్మ‌కం క‌లిగించేలా ఉండాలి అనేదిచాణిక్య నీతి.

Image result for romance

త‌న ప్రేమికురాలికి, భార్య‌కి భ‌ద్ర‌త భ‌రోసా ఇవ్వ‌డం.. ఏ భార్య అయినా భ‌ర్త నుంచి తన తండ్రి లాల‌న కోరుకుంటుంది. ఇలాంటి ప్రేమ భార్యకి భ‌ర్త అందించాలి. ఇక పెళ్లి కాక‌పోతే త‌న ప్రేయ‌సికి ఇలాంటి ప్రేమ అందించాలి. అప్పుడు మ‌రింత ప్రేమ పెరుగుతుంది. ఇద్ద‌రి మ‌ధ్య మ‌రింత దృఢ‌మైన బంధం ఏర్ప‌డుతుంది. .శారీర‌క సుఖం, ఇద్ద‌రి జీవితంలో శారీర‌క సుఖం ఇద్ద‌రి మ‌ధ్య విడ‌దీయ‌రాని బంధంగా ఉంటుంది . ఏ భ‌ర్త అయితే సంసారం సుఖం అందిస్తారో ఆ బంధం ఎప్ప‌టికి దృడంగా ఉంటుంది అని చెబుతున్నాడు ఛాణిక్యుడు.. చూశారుగా మ‌రి ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.