జగిత్యాల బస్సు ప్రమాదం జరగడానికి అంతమంది చనిపోడానికి అసలు కారణం ఇదే

425

జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొండగట్టుకు వెళ్లి తిరిగివస్తున్న ఆర్టీసీ బస్సు సమీపంలోని ఘాట్ రోడ్డులో అదుపుతప్పి లోయలో పడింది.ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 45మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 25 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులున్నారు.అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఆ ప్రమాదానికి గల కారణాలు అలాగే ప్రయాణికులు చనిపోడానికి ముఖ్య కారణం తెలిసింది.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

జగిత్యాల జిల్లా కొండగట్టులో చోటుచేసుకున్న ఘోర ప్రమాదానికి ఆర్టీసీ, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. గతంలో ఇదే చోట ఓ లారీ ప్రమాదంలో సుమారు 20 మంది మృతి చెందారు. ఆ తర్వాత ఇంతటి పెద్ద ప్రమాదం చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. లారీ ప్రమాదమప్పుడే అధికారులు ఈ ఘాట్‌ రోడ్డుపైకి భారీ వాహనాలను నిషేదించారు. కేవలం బైక్స్‌ను మాత్రమే అనుమతించేవారు.కానీ గత మూడు నెలల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రయివేట్‌ వాహనాలను మళ్లీ అనుమతిస్తున్నారు. ఘాట్‌ రోడ్డు నుంచి హైవేపైకి కిలోమీటర్‌ దూరం ఉంటుంది. ప్రత్యమ్నాయ రోడ్డు ఉపయోగిస్తే మరో ఐదు కిలోమీటర్లు ఎక్కువగా ప్రయాణించాల్సి వస్తుంది. దీంతోనే ఆర్టీసీ అధికారులు డిజీల్‌కు కక్కుర్తిపడి బస్సులను షార్ట్‌కట్‌గా భావించిన ఘాట్‌రోడ్డు రూట్‌లో నడిపిస్తున్నారు.

Image result for జగిత్యాల బస్సు ప్రమాదం

ఘాట్‌ రోడ్డు నిర్మాణం కూడా ఆర్‌అండ్‌బీ నిబంధనలకు విరుద్దంగా ఉందని గతంలోనే అధికారులు గుర్తించారు. ప్రభుత్వానికి కూడా నివేదిక పంపించారు. ఘాట్‌ రోడ్డుకు ఇరువైపుల గోడను నిర్మించాలని కూడా నిర్ణయించారు. ఆ గోడ నిర్మాణం చేబడితే ఈ ఘోర ప్రమాధం సంభవించేది కాదని, వారి నిర్లక్ష్యంతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు అధికారుల తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ ప్రమాదంలో ఊపిరాడకనే ఎక్కువ మంది చనిపోయినట్లు తెలుస్తోంది. బస్సులో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని భావిస్తున్నారు.మంగళవారం కూడా కావడంతో కొండగట్టుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో ఏపీ 28 జెడ్‌ 2319 నంబర్‌ ఆర్టీసీ బస్సు​ సుమారు 70 మందితో శనివారంపేట నుంచి జగిత్యాలకు బయలుదేరింది.

Image result for జగిత్యాల బస్సు ప్రమాదం

రెగ్యులర్‌ డ్రైవర్‌ కాకుండా కొత్త డ్రైవర్‌ బస్సును నడిపిస్తున్నారు. డ్రైవర్‌ మలుపులను అంచనా వేయలేకపోయాడని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ శ్రీనివాస్‌ రెండు కాళ్లు విరిగిపోయాయి. అదే విధంగా ఘాట్‌ రోడ్డు వెడల్పు లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమని స్థానికలు పేర్కొన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ రహదారులను పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం స్థలం వద్ద మృతిచెందిన వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.విన్నారుగా ఈ ప్రమాదం జరగడానికి ముఖ్య కారణం అలాగే ప్రయాణికులు ఎక్కువమంది చనిపోడానికి కారణం గురించి.కాబట్టి ఇలాంటి రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి.మరి ఈ ప్రమాదం గురించి అది జరగడానికి గల కారణం గురించి అలాగే అంతమంది ప్రయాణికులు చనిపోడానికి గల కారణం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.