ఈ ప్రేమికులకు హిజ్రా పెట్టిన శాపం వింటే కన్నీళ్ళు తప్పక వస్తాయి

349

శశి అనే ఒక వ్యక్తికి ఒక హిజ్రాకు మధ్య జరిగిన ఒక సంఘటన గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అతను తన కథను మాకు చెప్పాడు. అతని కథను అతని మాటల్లోనే మీకు చెప్పబోతున్నాను. విని తెలుసుకోండి.హాయ్ అండి నా పేరు శశి. నేను బీటెక్ చదివాను. 2007 లో పూర్తీ అయ్యింది.బాగానే చదివాను కానీ ఉద్యోగం రాలేదు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తన పేరు రాధికా. తనకు కూడా నేనంటే బాగా ఇష్టం. చదువు అయిపోయాక ఉద్యోగంలో చేరి పెళ్లి చేసుకోవాలని మా ఆలోచన. అనుకున్నట్టే హైదరాబాద్ చేరుకున్నాం. ఇద్దరం చెరొక హాస్టల్ లో జాయిన్ అయ్యాము. కోర్స్ లు సినిమాలు షికార్లు అయినవి కానీ ఉద్యోగం మాత్రం రాలేదు. కష్టాలు మొదలయ్యాయి. రాధికను ఇంటికి వచ్చేయమన్నారు.పెళ్లి చేస్తామని చెప్పారు. కానీ రాధికా ఆ పెళ్ళిళ్ళను ఎలాగోలా క్యాన్సిల్ చేస్తూ వచ్చింది.ఇలా 2009 ముగిసింది.ఇక సంక్రాంతి వచ్చింది.ఇంటికి తప్పక వెళ్లాల్సిన పరిస్థితి. ఇంటికెళ్ళాక పరిస్థితి ఎలా ఉంటుందో అని ఒకసారి హైదరాబాద్ లో కలుద్దాం అని నెక్లేస్ రోడ్డులో కలుసుకున్నాం. పండుగకు తాను వెళ్ళింది నేను వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను.

Image result for hijra

పండుగకు వెళ్లిన రాధికా తిరిగి హైదరాబాద్ వచ్చేసింది. మే నెల వరకు చూసి పెళ్లి చేస్తామని చెప్పారంట వాళ్ళ అమ్మానాన్న. అంటే మూడు నెలలో జాబ్ కొట్టి రాధికను పెళ్లి చేసుకోవాలి. ఇక మా ఇంట్లో కూడా డబ్బు పంపలేము చిన్న జాబ్ అయినా చూసుకో అని చెప్పేశారు. ఆ మూడు నెలలు కూడా రాధికా నన్ను బాగా చూసుకుంది. తన డబ్బులను నా కోసం ఖర్చు పెట్టింది. అయినా ఆ మూడు నెలలో నాకు జాబ్ రాలేదు. ఇక రాధికను ఇంటికి పంపించేయాలని డిసైడ్ అయ్యాను.అదే విషయం చెబుదామని మళ్ళి మీట్ అయ్యాం. నా మనసులో ఏముందో రాధికకు తెలియదు. ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. తనకు చెప్పాలంటే భయంగా ఉంది. ఎందుకంటే పెళ్లి చేసుకోకపోతే చనిపోతా అని తాను చాలాసార్లు చెప్పింది.ఇలా నాలో నేను మధనపడుతుంటే ఒక హిజ్రా వచ్చింది. మా దగ్గరికి వచ్చి డబ్బులు అడిగింది. లేవని చెప్పాను. రెండు నిముషాలు విసిగించింది. ఏం లేకుండా ఎందుకు వచ్చారు అని వెటకారంగా మాట్లాడింది.ఇక మేము ఇవ్వం అనుకుని ఆ హిజ్రా వెళ్ళిపోయింది. ఆ తరువాత ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఏదేదో మాట్లాడుకున్నాం. అలా ఒక మూడు గంటలు మాట్లాడుకున్నాం. ఆ హిజ్రా మళ్ళి వచ్చింది.మీరు ఇంకా వెళ్లలేదా అని మమ్మల్ని చూసి అంది.

Image result for lovers

పక్కకు జరగండి అని మా ఇద్దరి మధ్యలో వచ్చి కూర్చుంది,. ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోతే నేను లేస్తా అని చెప్పింది. ఇక మేము చేసేదేమి లేక లైకి లేచి వెళ్ళడానికి బయల్దేరాం. మళ్ళి ఆ హిజ్రా ఇటు రండి అని పిలిచింది. కానీ మేము అక్కడే ఉన్నాం. ఆ హిజ్రా ఒక 500 రూపాయల నోటు తీసి నా చేతిలో పెట్టి ఏమైనా తినేసి పోండి అని అన్నది. అప్పుడు అర్థం అయ్యింది ఆమె మనసు. వద్దండి అని అన్నాను. ఏం వద్దు ఈ పోరి వద్దా అని గట్టిగా అరిచింది.అప్పుడు నా కళ్ళలో నీళ్లు తిరిగాయి.ఇద్దరు బాగున్నారు. బాగా సంపాదిస్తారులే అని అన్నది. ఆంతే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఒకేఒక్క మాట అంది. మా అమ్మాయిని మంచిగా చుస్కో లేదంటే నేను వచ్చి నీ తాట తీస్తా అని అంది ఆ హిజ్రా. ఆమె ఆరోజు అక్కడికి ఎందుకు వచ్చిందో తెలీదు కానీ ఆమె మాట్లాడిన ప్రతి మాట నా గుండెకు తగిలింది.ఇక ఆమె ఇచ్చిన 500 నోటు తప్పని పరిస్థితిలో మార్చాల్సి వచ్చింది. అయితే మార్చే ముందే ఇవి మొత్తం ఖర్చు అయ్యే ముందే ఉద్యోగం రావాలని అనుకున్నాను. ఆమె నోటి ఫలమో ఏమో కానీ ఆరోజు నుంచి ఆమె అన్న ప్రతి మాట జరిగింది.మంచి జాబ్ వచ్చింది. ఇంట్లో వాళ్ళను ఒప్పించి రాధికను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మాకు ఒక పాప. ఆ పాప వయసు 4 ఏళ్ళు. మా పాపకు ఇంకా పేరు పెట్టలేదు. ఎందుకంటే ఆ హిజ్రా కనిపిస్తే ఆమె పేరునే మా పాపకు పెడదామని.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆమె కోసం నెక్లేస్ రోడ్డు చాలాసార్లు వెళ్లాను. సిటీలో ఎక్కడైనా కనిపిస్తుందేమో అని ఆమె కోసం చాలా తిరిగాను. అయినా కానీ ఆమె ఇంతవరకు కనపడలేదు. అందుకోసమే ఆమె అన్న మాటలు నాకు వరమైన సరే శాపంలాగానే భావిస్తున్నాను. నాకు నిజమైన వరం ఆమె కనిపించిన రోజే. నాకు ఏ హిజ్రా కనిపించిన నేను ఎదురెళ్లి మరి తనకు డబ్బులు ఇస్తుంటాను. మనిషికి రూపాన్ని బట్టి ఆకారాన్ని బట్టి మనసు ఉండదు. ఆ తల్లిని నేను మనస్ఫూర్తిగా జీవితాంతం రుణపడి ఉంటాను. ఇంకొక విషయం ఏమిటంటే.. ఆరోజు రాధికకు నేను ఏం చెప్పాలనుకున్నానో ఇంతవరకు చెప్పలేదు. ఆ అవకాశమే రాలేదు. ఇప్పుడు నా భార్యతో పాపతో చాలా సంతోషంగా ఉన్నా. ఇదంతా ఆమె దీవించిన దీవెనల వలన. ఇది నా లైఫ్ స్టోరీలో హిజ్రా పెట్టిన శాపము. కాదు వరం అని శశి తన ఆత్మకథను చెప్పుకున్నాడు. మరి ఈ శశి జీవితంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.