కుల పిచ్చి ఉన్న వారికి ఈ అబ్బాయి 10 సూటి ప్రశ్నలు.. సమాధానం చెప్పే దమ్ముందా?

451

న‌ల్ల‌గొండ జిల్లా మిర్యాల‌గుడాలో జ‌రిగిన దారుణం ఎవ‌రిని మ‌ర్చిపోలేకుండా చేస్తోంది.. కూతురి ప్రేమ‌ను కాదు అని, త‌న కులం గొప్ప‌ది అని అనుకున్న మారుతిరావు సాధించింది ఏమిటి ? చేతికి బేడీలు సాధించాడు క‌ట‌క‌టాల‌పాల‌య్యాడు, ఏ ప‌రువు అయితే కావాలి అని ఈ హ‌త్య చేశాడో దేశంలో అంద‌రూ చ‌ర్చించుకునేలా ఆ ప‌రువు పోగొట్టుకున్నాడు. కులాంత‌ర వివాహం చేసుకుంటే త‌ప్పు అనే మారుతిరావులు ఇంకా మ‌న స‌మాజంలో చాలా మంది ఉన్నారు, మ‌న ఇళ్ల ప‌క్క‌నే ఉండ‌వ‌చ్చు.

Image result for pranay and amrutha

కొందరు మనుషులు మానవత్వం మరిచిపోయి కులం అనే కోణంలో ఆలోచించి, వెనకడుగు వేస్తున్నారు అన‌డానికి ఉదాహ‌ర‌ణ మారుతిరావుని చూపించాలి.. స‌రిగ్గా ప్ర‌పంచం కూడా చూడ‌ని ప్ర‌ణ‌య్ ని అతి కిరాత‌కంగా ఒక్క‌వేటుతో చంపించాడు, కోటిరూపాయ‌లు ఖర్చుచేసి చంపిన మారుతిరావుకి 1000 కోట్లు ఇస్తే ప్ర‌ణ‌య్ ని బ్ర‌తికించ‌గ‌లడా… అల్లుడ్ని చంపేసి కూతురి నూరేళ్ళ జీవితాన్ని నాశనం చేసాడు ఈ దయాగుణం లేని తండ్రి. కూతురుకి పుట్టబోయే పసిబిడ్డకు తండ్రిని దూరం చేసాడు. చివరికి ఏం సాధించాడు. ఇలాంటి కుల‌పురుగుల‌కు ఓ ప‌ది ప్ర‌శ్న‌లు అడుగుతున్నారు యువ‌త.

Image result for pranay and amrutha

నీ కడుపు నింపే రైతుది నీ కులం కాదు…ఎలా తింటున్నావు.?
నీ ఇంట్లో పాల ప్యాకెట్ వేసేవారిది నీ కులం కాదు…ఎలా కొంటున్నావు?
నీకు చదువు చెప్పిన గురువు ది నీ కులం కాదు..ఎలా చదువుకున్నావు?
నీ ఇల్లు కట్టిన కూలిది నీ కులం కాదు…ఇంట్లో ఎలా ఉంటున్నావు?
నీ బట్టలు ఉతికి ఇస్త్రీ చేసే వారిది నీ కులం కాదు…ఎలా వేసుకుంటున్నావు?
నీ ఇల్లు ఊడ్చే పనిమనిషిది మీ కులమా?
రోగం వస్తే నువ్వు వెళ్లే డాక్టర్ ది మీ కులమా?
జుట్టు పెరుగుతే నువ్వు వెళ్లే కటింగ్ షాప్ వారిది నీ కులమా?
నీకు జ‌బ్బు వ‌స్తే వేసుకునే మందులు త‌యారు చేసింది నీ కుల‌మా
నువ్వు వేసుకునే బ‌ట్ట‌లు నీకుల‌పోడు త‌యారు చేశాడా

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కులం పేరుతొ మనుషులను విడదీసి ఏం సాధించావ్?
ఏ పరువు కోసమైతో చేసావో ఆ పరువు పోగొట్టుకున్నావు…కూతురు జీవితాన్ని నాశనం చేసావు.!
సాటి వారికి సాయం చేయలేనప్పుడు నువ్వెందుకు నీ కులం ఎందుకు.? కులం అంటే మనం చేసే పని…ఎవరు చేసే పనిని బట్టి వారి కులం వచ్చింది..ఒకరు ఎక్కువ కులం..ఒకరు తక్కువ కులం అనే మాట ఏంటి.? అందరు కష్టపడే పని చేస్తున్నారు…అందరు ఒక్కటే. ఎప్ప‌టికైనా ఒక‌టి గుర్తు ఉంచుక‌వాలి కులం క‌న్నా గుణం గొప్ప‌ది, కులం గొప్పదైతే మహా అయితే నీ కులపోల్లు నీ దగ్గరికి వస్తారు..కానీ నీ గుణం మంచిదైతేనే నీతో కలిసి జీవితంలో ప్రయాణిస్తారు.. ఇక‌నైనా మారండి కులం అనే ఈ సమాజాన్ని కుల‌ర‌హిత స‌మాజంగా మార్చే ప్ర‌య‌త్నం అంద‌రి నుంచి రావాలి, దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.