ఈ అమ్మాయి డ్రింక్ చేసి స్కూల్ కు వచ్చి ఎంత హంగామా చేసిందో చూస్తే షాక్..

287

యువత రోజురోజుకి చాలా పాడవుతోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల విజయవాడలో చోటుచేసుకున్న ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం. మంచి అలవాట్లను వదిలేసి చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. స్కూల్ ఏజ్ లోనే చెడు వ్యసనాలను అలవాటు పడుతున్నారు. మద్యం తాగుతున్నారు సిగరెట్ తాగుతున్నారు. ఇన్ని రోజులు అబ్బాయిలే చేశారనుకుంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు స్కూల్ లోనే డ్రింగ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Image result for girls drinking alcohol

విజయవాడ శివారులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు కొద్ది రోజులుగా శీతలపానీయంలో మద్యం కలిపిన సీసాలతో పాఠశాలకు వస్తున్నారు. చున్నీ చాటున ఎవరికీ కనపడకుండా కొద్దికొద్దిగా తాగుతున్నారు.ఇలా చాలా రోజుల నుంచి నడుస్తుంది. అయితే ఎప్పుడు వీరి మీద అనుమానం రాకపోవడంతో వీరిని ఎవరు అంతలా పట్టించుకోలేదు. కానీ శనివారం ఉదయం విరామ సమయంలో తాగారు. అయితే ఎవరు గుర్తుపట్టడం లేదని అనుకున్నారో లేక ఎక్కువ తాగాలనిపించిందో కానీ ఈసారి కొంచెం ఎక్కవ మోతాదులో తాగారు. పక్కన కూర్చున్న తోటి విద్యార్థినులపై తూలడం, వారి నుంచి ఆల్కహాల్ తాగిన వాసన వస్తుండటంతో ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానోపాధ్యాయుడు వైద్య నిపుణులతో మద్యం పరీక్ష చేయించారు. బాలికలు మద్యం తాగినట్లు తేలడంతో ఖంగుతిన్నారు.

ఈ క్రింది వీడియో చూడండి 

తల్లిదండ్రులను పిలిపించి, విద్యార్థులతోపాటు వారికీ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని వివరణ కోరగా ‘విద్యార్థినులు మద్యం తాగి తరగతికి రావడం నిజమే. వీరిద్దరూ గతంలో చదువుకున్న పాఠశాలలోనూ ఇదే పని చేయడంతో టీసీలు ఇచ్చి బయటికి పంపినట్లు తెలిసింది. తండ్రికి మద్యం తాగే అలవాటు ఉండటంతో సీసాలో మిగిలిన దాన్ని తాగడం కారణంగా బాలికలకు అలవాటు అయి ఉంటుందని భావిస్తున్నా. తోటి విద్యార్థులు పాడైపోతారని కుటుంబసభ్యుల సమక్షంలోనే వారికి టీసీలు ఇచ్చాం’ అని వివరించారు.చూశారుగా ఈ ఇద్దరు అమ్మాయిలు ఎంతటి పని చేశారో. మరి స్కూల్ లోనే తాగిన ఈ అమ్మాయిల ఘటన గురించి అలాగే స్కూల్ ఏజ్ లోనే చెడు వ్యసనాలకు అలవాటుపడుతున్న స్టూడెంట్స్ ఘటనల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.