ఐఏఎస్ ఇంట‌ర్యూలో ఈ అమ్మాయికివింత ప్ర‌శ్న దీనికి ఆమె స‌మాధానం…

324

ఇంట‌ర్వూలో ఏ ప్ర‌శ్న అడుగుతారా తెలియ‌క కొంద‌రు అనేక పుస్త‌కాలు తిర‌గ‌వేస్తూ ఉంటారు.. అయితే ఇప్పుడు ఉద్యోగాల్లో పుస్త‌కాల్లో చ‌దువుతో పాటు స‌మాజంలో జ‌రుగుతున్న విష‌యాల‌పై వారి అవ‌గాహ‌న ఎలా ఉంది అనేది కూడా చూస్తున్నారు.. ఏ కెమిస్ట్రీ చ‌దివిన వ్య‌క్తిని లెక్క‌ల గురించి కూడా అడ‌గ‌వ‌చ్చు, ఇది ఉద్యోగాల్లో వారి ప‌రిచ‌యం అలాగే వారి మ‌న‌స్త‌త్వం అన్నింటిని తెలుసుకోవ‌డానికి ఓ కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు.. కొంద‌రికి మొద‌టి ప్ర‌య‌త్నంతో ఉద్యోగం వ‌స్తుంది. మరికొంద‌రికి ఎంత ప్ర‌య‌త్నం చేసినా ఉద్యోగం రావ‌డం మాత్రం క‌ష్టంగా ఉంటుంది. కాని వారు నిరాశ చెంద‌కుండా ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నం చేస్తూ ఉంటారు.. అలాగే ఇంట‌ర్యూల్లో స‌బ్జెక్ట్ స‌మ‌స్య‌లు చెప్తారు కాని, లోక‌జ్ఞానంలో కూడా ప్ర‌శ్న‌లు ఉంటాయి, మ‌రి వీటికి కూడా స‌మాధానం చెబితే వారు ఇంట‌ర్యూల్లో సెల‌క్ట్ అవుతారు. ఇలా ఓ ఐఏఎస్ ఇంట‌ర్యూ స‌మ‌యంలో ఇంట‌ర్వూ చేసే బృందం ఓ అమ్మాయిని వింత ప్ర‌శ్న అడిగింది.

Image result for interview

మీ భర్త చనిపోయాడు అందుకే మీరు రెండో పెళ్లి చేసుకున్నారు.. కొన్నాళ్ళు ఆనందంగా గ‌డిపాక చనిపోయినా మీ మొదటి భర్త తిరిగొస్తే ఏం చేస్తారు అని అడిగాడు.. అది విని ముందు ఆమె కొంచెం తడబడిన వెంటనే తేరుకొంది.. త‌న స‌మాధానంతో ఆ సీనియర్ అధికారులకే షాక్ ఇచ్చింది.. ఎందుకంటే ఈ ప్రశ్నలోనే పెద్ద మిస్టేక్ ఉంది.. ఇదే ప్రశ్న మనల్ని అడిగితే ఏంచెబుతాం.. మన కళ్ళముందే చనిపోయినా వ్యక్తి మళ్లి ఎలా తిరిగి వస్తాడు ఇలా జ‌రుగ‌దు చనిపోయిన వారు ఎలా తిరిగి వ‌స్తారు అని చెబుతాం.

Image result for interview

కాని ఆ అమ్మాయి చెప్పిన స‌మాధానం వింటే మీకు మతిపోవ‌డం ఖాయం అనే చెప్పాలి, ఒక‌వేళ చనిపోయిన నా భర్త తిరిగి వచ్చాడు అనుకుంటే… మనదేశ చట్టం ప్రకారం తన భర్త నుండి విడిపోయిన మహిళ చట్టం ప్రకారం అతడినుండి విడాకులు తీసుకొని మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు.. అదే ఒకవేలా ఆ భర్త ప్రమాదవశాత్తు చనిపోతే అది ద్రువికరించిన డాక్టర్ నుండి డెత్ సర్టిపికేట తీసుకొని దాని ఆధారంగా ఆ మహిళా రెండో వివాహం చేసుకోవచ్చు.. అలా చేసుకున్న ఆ పెళ్లి చట్టబద్దం అవుతుంది కాబట్టి.. మీరన్నట్లు ఒకవేలా చనిపోయినా నా భర్త తిరిగొచ్చినా.. చట్టప్రకారం నారెండో పెళ్లి విషయంలో ఎలాంటి సమస్య ఉండదు.. ఇక నేను ఎవరితో కాపురం చేస్తాను అన్నది నామనసుకు సంబందించిన విషయం అని సమాదానం చెప్పింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక ఆమె స‌మ‌య‌స్పూర్తి ఆమెకు చ‌ట్టాల‌పై ఉన్న అవ‌గాహ‌న‌పై అంద‌రూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.. క్వ‌శ్చ‌న్ ఒక్క‌రు అడిగినా ఆ ఇంట‌ర్యూ టీమ్ అంద‌రూ ఆమెని అభినందించారు. ఇలాంటి ప్ర‌శ్న‌లు అడిగిన స‌మ‌యంలో అభ్య‌ర్దులు ఎంతో ఆందోళ‌న చెందుతారు కాని నువ్వు 20 సెక‌న్ల‌లో తేరుకుని స‌రైన స‌మాధానం చెప్పారు. అది కూడా మేము అనుకున్న స‌రైన స‌మాధానం అని ఆమెని ఇంట‌ర్వ్యూలో సెల‌క్ట్ చేస్తున్న‌ట్లు ఓ న‌వ్వు ముఖం పెట్టారు. చూశారుగా ఆమె ఇంట‌ర్యూకి వ‌చ్చిన స‌మ‌యంలోనే ఇంత డేరింగ్ గా స‌మాధానం చెప్పింది ఇక ఆమెకు డిల్లీలో పోస్టింగ్ కూడా ఇచ్చార‌ట‌, మ‌రి ఆమె విజయం పై ఆమె చెప్పిన స‌మాధానం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.