ఈ అమ్మాయి కేరళకు చేసిన ఈ ఒక్క సహాయం ఈమె జీవితాన్నేమార్చేసింది.

449

భారీ వర్షాలు,వరదలతో అతలాకుతలమైన కేరళ ప్రజలను ఆదుకోవడానికి చిన్నా పెద్దా తేడాలేకుండా సామాన్యుడి నుండి ప్రముఖుల వరకు ఎందరో ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.వారిలో సినిమా వారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.అయితే సినిమా వాళ్లు కేరళకు సాయం చేయకపోయినా ఇన్ని కోట్ల సాయం చేశారంటూ చాలా వార్తలు వచ్చాయి.అయితే ఆ వచ్చిన వార్తల్లో నిజంలేదని ఆలస్యంగా తెలిసింది.అందులో భాగంగానే సన్నిలియోన్ 5కోట్లు ఇచ్చిందంటూ ట్రోలింగ్ నడిచింది..సన్ని ఎంత సాయం చేసిందని ఆరా తీయగా ,ఇప్పటివరకు ఎటువంటి సాయం ప్రకటించలేదని తన మేనేజర్ జవాబు విని అవాక్కవడం మనవంతైంది..అయితే తాజాగా సన్ని కేరళకు తానే విధంగా సాయపడిందో సోషల్ మీడియాలో పోస్టు చేసింది.మరి ఎలా సాయం చేసిందో చూద్దామా.

బాలీవుడ్‌ భామ అనుష్కశర్మ, విరాట్ కోహ్లీ దంపతులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు ఆహార, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. వరదల బారిన పడి ఇబ్బందులకు గురైన మూగజీవాలకు కూడా ఆహార పదార్థాలు అందజేశారు. ఇప్పుడు ఆ జాబితాలో సన్నీ లియోన్ కూడా చేరింది.భర్త డేనియల్‌ వెబర్‌తో పాటు మరికొందరు సభ్యులతో కలిసి సన్నీ లియోన్ కేరళ బాధితులకు సహాయం అందిస్తోంది. వరద బాధితులకు 1200 కిలోల బియ్యంతో పాటు పప్పు ధాన్యాలు అందించారు.మరింత సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సన్నీ తెలిపింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో సన్నీ పోస్టు చేసింది.

‘ఇవాళ నేను, డేనియల్‌ కలిసి కేరళలోని కొంత మందికి ఆహారం అందించాం.1200 కిలోల ఆహారం, పప్పు అందించాం.వరదల్లో తీవ్రంగా నష్టపోయిన వారికి ఇది ఏమంత పెద్ద సాయం కాదు.ఇంకా సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. జుహులో ప్రతీక్‌, సిద్ధార్థ్‌ కపూర్‌, సువేద్‌ లోహియా అద్భుతం చేశారు. ప్రత్యేకంగా చొరవ తీసుకొని వారు విరాళాలు సేకరించారు. నిజంగా వారు చాలా గొప్పవారు’ అని సన్నీ రాసుకొచ్చింది. గతంలో ఓ షోరూం ప్రారంభోత్సవానికి తొలిసారిగా కేరళకు వెళ్లిన సన్నీకి అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టిన విషయం తెలిసిందే.ఆమెకు స్వాగతం పలకడానికి జనాలు బారులు తీరడం అప్పట్లో సంచలనంగా మారింది.కేరళ ప్రజలు తనపై చూపిన అభిమానానికి సన్నీ ధన్యవాదాలు చెప్పింది.కేరళ ప్రజల అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోనని సన్ని పేర్కొంది.నేను చేసిన సాయం ఇదే.ఇంతకుమించి ఇక నేనేమి సాయం చెయ్యలేదని సన్నీ లియోన్ చెప్పింది.విన్నారుగా సన్నీ లియోన్ ఎలాంటి సాయం చేసిందో.కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న స్టార్స్ విరాళాల వివరాలను అస్సలు నమ్మవద్దు.వారంతట వారే చెప్పెంతవరకు నమ్మకండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.