సంవత్సరానికి 48 లక్షలు సంపాదిస్తున్న రైతు..ఇతని సక్సెస్ అందరికి Inspiration.!

318

మ‌న దేశంలో గ‌తంలో వ్య‌వ‌సాయం అంటే ఎంతోగొప్ప వృత్తిగా రైతు అంటే ఎంతో గొప్ప‌వ్య‌క్త‌గాచూసేవారు కాని ఇప్పుడు రైతు అంటే క‌నీసం పెళ్లికి కూడా ఎవ‌రూ ముందుకురావ‌డం లేదు అలా మారిపొయింది ప్ర‌స్తుత స‌మాజం.రైతులు అంటే సమాజంలో చులకన భావం ఏర్పడినది. వ్యవసాయం చేసేవారు సంపాదించలేరు అనే నిర్ణయానికి సమాజంలో అంతా వచ్చారు. వ్యవసాయం చేయడం వల్ల పెట్టిన పెట్టుబడికి ప్రతిఫలం కూడా వచ్చే పరిస్థితి లేదని, రైతులు అప్పులు చేసి, ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే అంటూ అందరి అభిప్రాయంగా పడిపోయింది. కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, వ్యవసాయంలో లాభాలు దక్కించుకోలేక పోవడం వల్ల యువత వ్యవసాయం అంటేనే ఆమడ దూరం వెళ్తున్నారు.

రైతులు కూడా వారి పిల్లలను వ్యవసాయం వైపుగా ప్రోత్సహించడం లేదు. అందుకే దేశంలో రైతుల సంఖ్య చాలా తగ్గుతుంది. అయితే రైతులు కష్టపడి, ఆధునిక వ్యవసాయంను చేస్తే అంతకు మించిన బిజినెస్‌ లేదని కొందరు నిరూపిస్తున్నారు. నేలకు తగ్గ పంటను వేస్తూ, రేటు వచ్చే పంటలను సాగు చేయడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మార్చుకోవచ్చు అని పలువురు ఆదర్శ రైతులు నిరూపించారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రామ్‌ సరణ్‌ అనే రైతు కూడా ఈ విషయాన్ని నిరూపిస్తున్నాడు. సంవత్సరానికి 48 లక్షల రూపాయలు సంపాదిస్తున్న రామ్ చ‌రణ్‌ ను యువ రైతులు ఆదర్శంగా తీసుకుంటున్నారు.