మీ మొబైల్ ఫోన్ లో పోర్న్ చిత్రాలున్నాయా అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం

2510

ఇటీవ‌ల పోర్నోగ్ర‌ఫీ మ‌రింత పెరిగిపోయింది అనే చెప్పాలి.. గతంలో కంటే ఈ పోర్నోగ్ర‌ఫి ఇటీవ‌ల మ‌రింత విచ్చ‌ల‌విడిగా చూస్తున్నారు. ముఖ్యంగా యువ‌త దీనికి ఎక్కువ‌గా అడిక్ట్ అవుతున్నారు. తాజాగా ఈ పోర్న్ వెబ్‌సైట్లను నిషేధించాల్సిందిగా ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగింది. మొత్తం 827 పోర్న్ వెబ్‌సైట్లను బ్లాక్ చేసింది. అయితే ఈ పోర్న్ వీడియోల మీద కేంద్రం ఇప్పుడు మరొక సంచలన నిర్ణయం తీసుకుంది. పోర్న్ చూసే వారిని జైలుకే పంపే యోచనలో ఉంది. మరి దాని గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for seeing mobile phone

మీ సెల్‌ఫోన్లో చిన్న పిల్లలపై తీసిన పోర్న్ వీడియోలు, ఫోటోలు ఉన్నాయా? ఉంటే వెంటనే వాటిని డిలీట్ చేసేయండి. లేదంటే భారీ జరిమానాతో పోటు జైలుశిక్షకూ గురికావొచ్చు. చిన్న పిల్లలపై లైంగిక నేరాలను అరికట్టేందుకు తెచ్చిన ఫోక్సో చట్టాన్ని కేంద్ర మరింత కఠినతరం చేయబోతోంది. ఈ చట్టాన్ని సవరించేందుకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. 18 సంవత్సరాలు నిండని పిల్లలపై లైంగిక దాడికి పాల్పడే వారికి ఉరిశిక్ష విధించాలని ప్రతిపాదించింది. 12 ఏళ్లలోపు చిన్నారులను రేప్ చేస్తే మరణశిక్ష విధించేలా ఇప్పటికే వివిధ రాష్ట్రాలు చట్టాలు తెచ్చాయి. బాలికలు త్వరగా యవ్వన దశకు వచ్చేలా వ్యభిచార ముఠాలు హార్మోన్ ఇంజెక్షన్లను ఇస్తున్న ఘటనలు ఇటీవల తెలంగాణలోని యాదగిరిగుట్ట ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని కూడా ఫోక్సో చట్టం కిందకి తెచ్చారు. ఇలాంటి కేసుల్లో తీవ్రతను బట్టి శిక్షలు విధించనున్నారు.

చిన్నారుల బాల్యాన్ని చంపేసే ఇలాంటి పనులను రూపుమాపాల్సిన అవసరం ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. చిన్నారులతో తీసిన పోర్న్ చిత్రాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో లేకుండా చర్యలు తీసుకోనున్నుట్లు తెలిపారు. పోక్సో సవరణ బిల్లు ఆమోదం పొందే నాటికే ఎవరి సెల్‌ఫోన్లలో అయినా 18 ఏళ్లలోపు వయసున్న పిల్లల నీలి చిత్రాలు ఉండి వాటిని డిలీట్‌ చేయకపోతే భారీ జరిమానా విధిస్తారు. అలాంటి పోర్న్ చిత్రాలను ఫార్వర్డ్‌ చేసినా, వాట్సాప్ గ్రూపుల్లో షేర్‌ చేసినా జైలుశిక్ష, జరిమానా రెండూ విధిస్తారు. ఏ వ్యక్తి దగ్గరైనా చిన్నారుల పోర్న్ చిత్రాలు ఉన్నట్లు తెలిసీ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయని వారికీ జరిమానా తప్పదు. వాణిజ్య అవసరాలకు పిల్లలతో తీసిన నీలిచిత్రాలను వాడితే ఇంకా పెద్ద నేరంగా పరిగణిస్తారు. కాబట్టి మీ మొబైల్స్ లో అలాంటివి అస్సలు ఉంచుకోకండి. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. పోర్న్ వీడియోల మీద కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.