దుబాయ్ లో చెయ్యకూడని పనులు.. చేస్తే నేరుగా జైలుకే..

273

మీరు ప్రపంచంలో ఎక్కడైనా సరే వింతలు విశేషాలు చూసే ఉంటారు.అయితే వాటన్నిటికీ మించి అద్భుతాలు చూడాలంటే మాత్రం మనం దుబాయ్ వెళ్లాల్సిందే.దుబాయ్ లో ఉన్న అద్భుతాల గురించి మనం కలలో కూడా ఊహించి ఉండం.ఆ అద్భుతాలే దుబాయ్ ను ఇప్పుడు అగ్ర దేశాలలో ఒకటిగా నిలిపాయి.ఒకప్పుడు ఎడారితో చాలా చిన్నగా ఉండే ఈ నగరం ఇప్పుడు మహా నగరంగా మారింది.అలా మారి ప్రపంచాన్నే ఆకర్షిస్తుంది.తన అందచందాలతో ఆకట్టుకుంటుంది దుబాయ్.ఉద్యోగాలు చెయ్యాలని కొందరు విసిట్ చేసి ఆనందంగా గడిపిరావాలని కొందరు వస్తుంటారు.ప్రపంచంలోనే మోస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ గా దుబాయ్ పేరొందింది.అలాంటి దుబాయ్ ;ప్ కొన్ని పనులు అస్సలు చెయ్యకూడదు. చేస్తే మీరు నేరుగా జైలుకే వెళ్లాల్సి ఉంటుంది. మరి ఆ చెయ్యకూడని పనులేంటో చూద్దామా.

Image result for dubai girls
 1. పొట్టి పొట్టి బట్టలు ధరించకూడదు…
  దుబాయ్ లో అమ్మాయిలు పొట్టి పొట్టి బట్టలు వేసుకుని బయట తిరగకూడదు. అక్కడ ఎక్కువగా ముస్లిం యువతులు ఉంటారు. కాబట్టి వాళ్ళు వాళ్ళ మత ఆచారాలను తప్పకుండ పాటించాలి. లేకుంటే వారికి ఏమైనా చేసే హక్కు ఆ దేశ ప్రభుత్వానికి ఉంది. ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు కూడాకొంచెం పద్ధతైన బట్టలు వేసుకోండి.
 2. ముద్దులు పెట్టుకోవడం నిషేధం..
  మన దేశంలో కానీ వేరే ఇతర పాశ్చాత్త దేశాలలో ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టుకుంటారు. చుట్టూ ఎవరున్నా సరే వారి పనుల్లో వారు మునిగిపోతారు. అయితే ఇలాంటివి దుబాయ్ లో చెల్లవు. కట్టుకున్న భార్యాభర్తలు అయినా సరే పబ్లిక్ లో ముద్దులు పెట్టుకోకూడదు.
 3. పాటలు పాడటం, డాన్స్ లు చెయ్యడం నేరం..
  ఇక ఏ దేశంలో అయినా స్వేచ్ఛ ఉంటుంది. ముఖ్యంగా ఏ దేశం అయినా పాటలు పాడటాన్ని, డాన్సులు చేయడాన్ని ఎంకరేజ్ చేస్తుంది కానీ దుబాయ్ లో అలా ఉండదు. రోడ్ల మీద పాటలు పాడటం, డాన్సులు చెయ్యడం లాంటివి చెయ్యకూడదు.
Image result for dubai girls
 1. ఎక్కడ పడితే అక్కడ మద్యం సేవించకూడదు..
  ఇక దుబాయ్ లో మద్యపానం నిషేధం. మద్యం సేవిస్తే చట్టరీత్యానేరం. వారిని నేరుగా జైలుకే పంపిస్తారు. కొన్ని ప్రదేశాల్లో మాత్రమే మద్యానికి అలో ఉంది. తాగాలనుకుంటే అక్కడికి వెళ్లే తాగాలి.
 2. మాదకద్రవ్యాల వాడకం…
  ఇక దుబాయ్ లో డ్రగ్స్ లాంటి మాదకద్రవ్యాలు తీసుకుంటే నేరం. ఒకవేళ మీరు దొంగచూటుగా తీసుకోవాలన్నా కూడా అక్కడి పోలీసులకు తెలుస్తుంది. దాంతో మిమ్మల్ని నేరుగా స్టేషన్ ను తీసుకెళ్లి కేసు నమోదు చేస్తారు.
 3. అనుమతి లేకుండా స్థానికులు ఫొటోలు తీయకూడదు..
  ఇక అక్కడ ఉన్నమరొక చట్టం ఏమిటంటే..దుబాయ్ లో అక్కడి స్థానికుల ఫోటోలు తీయకూడదు. ఒకవేళ మీరు ఫోటోలు దిగితే అందులో అక్కడి స్థానికులు ఎవరైనవస్తే వారు మీ మీద కేసు పెట్టె హక్కు వాళ్లకు ఉంటుంది. అది అక్కడ తప్పు కాబట్టి మీరు ఇక జైలుకే.

ఈ క్రింది వీడియో చూడండి

 1. నాలుకను అదుపులో ఉంచుకోవాలి..
  ఇక దుబాయ్ లో ఏది పడితే అది మాట్లాడకూడదు. మన దేశంలో వాక్ స్వాతంత్రం ఉంది కానీ దుబాయ్ లో అది లేదు కాబట్టి అక్కడ ఉండాలంటే నోరు ఖచ్చితంగా అదుపులో పెట్టుకోవాలి.
 2. లెస్బియన్ గే సంబంధాలు పెట్టుకోకూడదు…
  ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. లెస్బియన్ సంబంధాలు పెట్టుకోకూడదు. ప్రస్తుత కాలంలో చాలా దేశాలలో లెస్బియన్ సంబంధాలు పెట్టుకుంటున్నారు. కానీ దుబాయ్ లో అలా నడవదు .అలా ఎవరైనా పెట్టుకుంటే వారిని ఉరి తీస్తారు.

ఇలా దుబాయ్ లో కొన్ని పనులు అస్సలు చెయ్యకూడదు. చేస్తే ఇక మీ పని అంతే. కాబట్టి దుబాయ్ వెళ్తే జాగ్రత్త. మరి దుబాయ్ లో చెయ్యకూడని ఈ పనుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.